Share News

Woman Constable: 10 రోజుల్లో పెళ్లి అనగా.. మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య

ABN , Publish Date - Feb 26 , 2025 | 04:10 AM

పది రోజుల్లో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సిన ఓ మహిళా కానిస్టేబుల్‌ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగింది.

Woman Constable: 10 రోజుల్లో పెళ్లి అనగా.. మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య

భువనగిరి టౌన్‌, ఫిబ్రవరి 25 (ఆంద్రజ్యోతి): పది రోజుల్లో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సిన ఓ మహిళా కానిస్టేబుల్‌ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగింది. కుటుంబసభ్యులు ఇష్టం లేని పెళ్లి చేస్తుండడంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వర్గల్‌ గ్రామానికి చెందిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ మామిడి అనూష(30) భువనగిరిలోని జిల్లా పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌లో నాలుగేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు.


స్థానిక విద్యానగర్‌లో మరో ఇద్దరు ఏఆర్‌ కానిస్టేబుళ్లతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. అనూషకు కుటుంబ సభ్యులు ఈనెల 14న నిశ్చితార్థం చేసి, మార్చి 6న పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. ఈ క్రమంలో మంగళవారం అనూష తను అద్దెకు ఉంటున్న ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నారు. అయితే కుటుంబసభ్యులు తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని అనూష తన సహచర ఉద్యోగుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.

Updated Date - Feb 26 , 2025 | 04:10 AM