Hyderabad: ఎంఎంటీఎస్‌లో అత్యాచార యత్నం
ABN , Publish Date - Mar 25 , 2025 | 05:06 AM
ఎంఎంటీఎస్ రైలులో దారుణం జరిగింది. మహిళా బోగీలో ఒంటరిగా ఉన్న యువతిపై గుర్తు తెలియని వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఆమె భయపడి రైలు నుంచి దూకింది. బాధితురాలిని రైల్వే సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.

ఒంటరి యువతిపై దుండగుడి దాష్టీకం
భయంతో రైలు నుంచి దూకిన యువతి
గాంధీ ఆస్పత్రికి తరలించిన రైల్వే సిబ్బంది
బండి సంజయ్ చొరవతో యశోదా ఆస్పత్రికి
పరారీలో నిందితుడు.. అతడి ఫొటో గుర్తింపు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్/అడ్డగుట్ట/హైదరాబాద్ సిటీ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ఎంఎంటీఎస్ రైలులో దారుణం జరిగింది. మహిళా బోగీలో ఒంటరిగా ఉన్న యువతిపై గుర్తు తెలియని వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఆమె భయపడి రైలు నుంచి దూకింది. బాధితురాలిని రైల్వే సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన యువతి(23) స్విగ్గీలో పనిచేసుకుంటూ మేడ్చల్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటోం ది. ఈ నెల 22న సెల్‌ఫోన్ రిపేర్ కోసం సికింద్రాబాద్‌కు వచ్చింది. తిరిగి హాస్టల్‌కు వెళ్లేందుకు రాత్రి 7 గంటల సమయంలో తెల్లాపూర్ నుంచి మేడ్చల్ వైపు వెళ్లే ఎంఎంటీఎ్‌సలోని మహిళల బోగీలోకి ఎక్కింది. ఆమెతోపాటు ఉన్న మరో ఇద్దరు మహిళలు అల్వాల్ స్టేషన్‌లో దిగిపోవడంతో బాధితురాలు ఒంటరిగా ఉంది. యువతి సెల్‌ఫోన్ చూసుకుంటుండగా గుర్తు తెలియని యువకుడు(23) బోగీలోకి ప్రవేశించాడు. ఒంటరిగా ఉన్న ఆమె పట్ల అసభ్యం గా ప్రవర్తించాడు. బలవంతం చేసే ప్రయత్నం చేయడంతో భయపడిన యువతి కదులుతున్న రైలు నుంచి దూకేసింది. గాయాలతో ఉన్న ఆమెను గుర్తించిన స్థానికులు.. పోలీసులు, 108కు సమాచారం అందించారు. దీంతో జీఆర్పీ సిబ్బంది అక్కడికి చేరుకుని బాధితురాలిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆస్పత్రికి వెళ్లిన రైల్వే ఎస్పీ చందనా దీప్తి బాఽధితురాలిని పరామర్శించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. మాట్లాడలేని స్థితిలో ఉన్న ఆమె నుంచి అతికష్టం మీద వివరాలను సేకరించామని తెలిపారు. కాగా, అత్యాచార యత్నం చేసింది మేడ్చల్ సమీపంలోని గౌడవల్లికి చెందిన మహేశ్‌గా పోలీసులు గుర్తించారు. నిందితుడిగా అనుమానిస్తున్న ఒకరి ఫొటోను బాధితురాలికి చూపించగా.. ఆమె అతడేనని నిర్ధారించింది. మహేశ్‌పై నగరంలోని పలు పోలీస్‌స్టేషన్లలో చాలా కేసులు ఉన్నాయి.
బండి సంజయ్ చొరవతో యశోదాకు..
రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆస్పత్రిలో ఉన్న బాధితురాలిని మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌తో కలిసి ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా సబిత మాట్లాడారు. బాధితురాలిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అందాల పోటీలు కాదు, మహిళలకు భద్రత కల్పించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి గాంధీ ఆస్పత్రిలో బాధితురాలిని పరామర్శించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచన మేరకు బాధితురాలిని యశోద ఆస్పత్రికి తరలించారు. యువతి కుటుంబ సభ్యులతో బండి సంజయ్ ఫోన్‌లో మాట్లాడారు. అధైర్యపడొద్దని అండగా ఉంటామని భరోసా ఇచ్చా రు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభు త్వం దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, హరీష్ బాబుతోపాటు పలువురు బీజేపీ నేతలు ఆస్పత్రిలో బాధితురాలిని పరామర్శించారు. ఇంత దుర్మార్గం జరిగినా నిందితుడి అరెస్టులో జాప్యం చేయడం సరికాదన్నారు.
ఇదేనా ఇందిరమ్మ రాజ్యం: హరీశ్‌రావు
రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటన తెలంగాణ సమాజాన్ని కలచివేసిందని, రాజధానిలోనే ఇలాంటి దారుణాలు జరుగుతుంటే ప్రభు త్వం, పోలీసు, రైల్వే యంత్రాంగం ఏం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోవడానికి హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతగాని పాలనే కారణమని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారడం సిగ్గుచేటన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో అత్యాచార కేసులు 29 శాతం పెరిగాయని డీజీపీ ప్రకటించారని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ప్రగల్భాలు పలకడం కాదని.. ముందు మహిళల ప్రాణాలకు భద్రత కల్పించాలని హరీశ్ రావు విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు
Cell Phones: పిల్లలను సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..
For Telangana News And Telugu News