Share News

Hyderabad: పోస్టల్‌ ఖాతాలో 2500 పడతాయని!

ABN , Publish Date - Apr 10 , 2025 | 05:24 AM

ఈ మహిళలంతా క్యూ కట్టింది హైదరాబాద్‌ అబిడ్స్‌లోని జనరల్‌ పోస్టాఫీస్‌ (జీపీవో) వద్ద.

Hyderabad: పోస్టల్‌ ఖాతాలో 2500 పడతాయని!

ఈ మహిళలంతా క్యూ కట్టింది హైదరాబాద్‌ అబిడ్స్‌లోని జనరల్‌ పోస్టాఫీస్‌ (జీపీవో) వద్ద. మహిళా సమృద్ధి యోజన పథకం కింద ఢిల్లీలోని నిరుపేద మహిళలకు ప్రతి నెలా రూ.2,500 చొప్పున పోస్టాఫీసు ఖాతాలో జమ చేస్తామని అక్కడి ప్రభుత్వం ప్రకటించడంతో.. కేంద్ర ప్రభుత్వం దేశమంతా ఈ పథకాన్ని అమలు చేస్తుందనే వదంతులు వ్యాపించాయి.


దీంతో పోస్టల్‌ పేమెంట్స్‌ బ్యాంకు ఖాతా తెరిచేందుకు బుధవారం అబిడ్స్‌లో మహిళలు ఇలా మండుటెండలో బారులు తీరారు. కొద్దిరోజులుగా మహిళలు పెద్ద ఎత్తున ఈ ఖాతాలు తెరుస్తున్నారు.

Updated Date - Apr 10 , 2025 | 05:24 AM