Andhra Jyothy: ఆంధ్రజ్యోతి లక్కీడ్రాలో విజేతలు వీళ్లే
ABN, Publish Date - Mar 25 , 2025 | 05:04 PM
ఆంధ్రజ్యోతి పత్రిక పాఠకుల కోసం కార్ అండ్ బైక్ రేస్‌ను సంస్థ యాజమాన్యం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు లక్కీ కూపన్ల డ్రా నిర్వహించారు.
ఆంధ్రజ్యోతి పత్రిక పాఠకుల కోసం కార్ అండ్ బైక్ రేస్‌ను సంస్థ యాజమాన్యం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు లక్కీ కూపన్ల డ్రా నిర్వహించారు. హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ ప్రధాన కార్యాలయంలో జరిగిన లక్కీ డ్రాలో ముఖ్య అతిథులుగా సెలకాన్ హైపెక్స్ ప్రయివేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రేతినేని మురళీకృష్ణ, జెఎస్‌బి హ్యుందాయ్ సీఈవో కళ్యాణ్ సింగ్ ఠాకూర్, చందన బ్రదర్స్ మేనేజింగ్ డైరెక్టర్ జేవీ సురేష్ పాల్గొని విజేతలను ఎంపిక చేశారు. ప్రథమ బహుమతి మోటర్ బైక్‌ను సిద్ధిపేటకు చెందిన చొప్పదండి వేణుకృష్ణ గెలుచుకోగా, రెండో బహుమతి రిఫ్రిజిరేటర్‌ను హైదరాబాద్ సాలర్‌జంగ్ కాలనీకి చెందిన సువర్ణ, మూడో బహుమతి టీవీని నాగర్ కర్నూలుకు చెందిన చెన్నయ్య గెలుచుకున్నారు. 2024 నవంబరు 1 నుంచి 2025 ఫిబ్రవరి 28వ తేదీ మధ్య ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన 12 కూపన్లను (4 సెట్లు) పాఠకులు ఇప్పటికే ఆంధ్రజ్యోతి కార్యాలయానికి పంపించగా..వాటిని డ్రా తీసి విజేతలను ఎంపిక చేశారు.
ఇవి కూడా చదవండి...
YS Sharmila Petrol Tax Criticism: వాటి ధరలు ఎప్పుడు తగ్గిస్తారు.. కూటమి సర్కార్‌కు షర్మిల ప్రశ్న
Supreme Court Comments: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్.. సుప్రీం కీలక వ్యాఖ్యలు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here
Updated at - Mar 25 , 2025 | 05:04 PM