వరంగల్ జిల్లాలో ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవ లక్కీ డ్రా..
ABN, Publish Date - Mar 25 , 2025 | 04:51 PM
ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవం సందర్భంగా వరంగల్ యూనిట్ కార్యాలయంలో కార్ అండ్ బైక్ రేస్ లక్కీ డ్రా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి,మున్సిపల్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే హాజరయ్యారు.
ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవం సందర్భంగా వరంగల్ యూనిట్ కార్యాలయంలో కార్ అండ్ బైక్ రేస్ లక్కీ డ్రా మంగళవారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి, మున్సిపల్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే హాజరయ్యారు. లక్కీడ్రాలో ఒకటి, రెండు, మూడో బహుమతి విజేతలను కలెక్టర్ ఎంపిక చేసి వారితో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ సెక్షన్, సీటీపీ, డెస్క్ రూంలను పరిశీలించారు. న్యూస్ ప్రింట్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రజ్యోతికి ప్రజాక్షేత్రంలో మంచి ప్రజాదరణ ఉందని కలెక్టర్, సీపీ, మున్సిపల్ కమిషనర్ తెలిపారు.
ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated at - Mar 25 , 2025 | 04:53 PM