సెలబ్రిటీ అయినా, స్టార్ హీరో అయినా వదలం
ABN, Publish Date - Mar 18 , 2025 | 07:23 PM
బెట్టింగ్ యాప్‌లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ యాప్‌లకు ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కొంతమందికి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే టెస్టీ తేజ, విష్ణుప్రియకు పోలీసులు మరో అవకాశం ఇచ్చారు.
అమాయకులను మోసం చేసి రూ. వందల కోట్లు కొల్లగొడుతున్న కేటుగాళ్లను పోలీసులు కటకటాల్లోకి నెడుతున్నారు. అతిపెద్ద మల్టీలెవల్ మోసానికి తెలియకుండానే ప్రచారం కల్పించిన సెలబ్రిటీలపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్ (పరేషన్ బాయ్స్), హర్ష సాయి, రీతు చౌదరి, టేస్టీ తేజతో సహా 11 మంది నటులు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్‌లపై కేసు నమోదు చేశారు.
Updated at - Mar 18 , 2025 | 07:41 PM