తెలంగాణకు మరో యునెస్కో గుర్తింపు..!

ABN, Publish Date - Mar 24 , 2025 | 03:11 PM

నిలువు రాళ్లుగా పిలిచే అద్భుతానికి యునెస్కో గుర్తింపు ఇక చాలా దూరంలో లేదు. క్రీస్తు పూర్వం ఐదు వందల ఏళ్ల నాడు మహబూ‌బ్‌నగర్ ఉమ్మడి జిల్లాలోని పరివాహక ప్రాంతంలో నిక్షిప్తమైన మెగా లిథిక్స్ స్టోన్స్‌కు యునెస్కో ఇప్పుడు తాత్కాలిక లిస్ట్‌లో చోటు కల్పించింది.

మహబూబ్‌నగర్‌: నిలువు రాళ్లుగా పిలిచే అద్భుతానికి యునెస్కో గుర్తింపు ఇక చాలా దూరంలో లేదు. క్రీస్తు పూర్వం ఐదు వందల ఏళ్ల నాడు మహబూ‌బ్‌నగర్ ఉమ్మడి జిల్లాలోని పరివాహక ప్రాంతంలో నిక్షిప్తమైన మెగా లిథిక్స్ స్టోన్స్‌కు యునెస్కో ఇప్పుడు తాత్కాలిక లిస్ట్‌లో చోటు కల్పించింది. కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు సరైన రీతిలో ప్రతిపాదనలు పంపి ప్రజెంట్ చేస్తే ప్రపంచ వారసత్వ సంపదగా లిస్ట్ కాబోతున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలోని ముడుమాల్ గ్రామంలో ఈ ప్రత్యేక రాళ్లు ఉన్నాయి. కృష్ణానది తీరాన వెలిసిన మారుమూల పల్లె ఇది. ఆ పల్లె వాసులకు వ్యవసాయం తప్ప మరే ఇతర వృత్తి తెలియదు. అక్కడ ఓ 20 ఎకరాల విస్తీర్ణంలో వికృత ఆకృతిలో రాళ్లు ఉంటాయి. అవన్నీ నిలువుగా ఉంటూ సుమారు 15 అడుగుల ఎత్తులో కనిపిస్తాయి. అలాగే ఓ క్రమ పద్ధతిలో భూమిలో పాతినట్లుగా కనిపిస్తాయి. ఆ రాళ్లను చూసిన ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయి.


వాటిని చూస్తే సంతోషం కూడా కలుగుతుంది. ఇక్కడి స్థానికులకు తోచిన విధంగా ఈ రాళ్లకు పేరు పెట్టుకున్నారు. ఆ రాళ్ల అడుగు భాగంలో ఆది మానవుల సమాధులు ఉన్నాయని స్థానికులు భావిస్తుంటారు. దేవుళ్ల శాపంతో ఆదిమానవులు రాళ్లుగా మారిపోయారని మరికొంతమంది అభిప్రాయపడుతుంటారు. వారి అభిప్రాయాలను తప్పని నిరూపిస్తూ అనేక మంది శాస్త్రవేత్తలు ఆ ప్రాంతాన్ని సందర్శిస్తూ వచ్చారు. అవి క్రీస్తుపూర్వం ఐదు వందల ఏళ్ల నాటివని శాస్త్రవేత్తలు గుర్తించారు. నక్షత్రాల గమనం, రుతువుల మార్పును అర్థం చేసుకునేందుకు ఆదిమానవులు ఆ రాళ్లను అక్కడ పాతినట్లుగా నిర్థారణకు వచ్చారు. ఆ నిలువు రాళ్ల సమూహాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేందుకు ముందడుగు పడింది. యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు దక్కింది. నిజానికి ముడుమాల్ నిలువురాళ్లకు గుర్తింపు లభించడం కోసం పలు సంస్థలు పురాతత్వ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తు వచ్చారు. ఇదే తరహా నిర్మాణాలు ఉన్న బ్రిటన్‌లోని స్టోన్ హెంజ్‌కు ఎప్పుడో ప్రపంచ వారసత్వ సంపదలో చోటు దక్కగా.. ముడుమాల్‌లోని నిలువురాళ్లకు చోటు దక్కలేదు.1980వ సంవత్సరంలోనే వీటి ప్రత్యేకత వెలుగులోకి వచ్చింది. అయితే చాలా మంది పురాతత్వ శాస్త్రవేత్తలు, సామాజిక వేత్తలు ఈ రాళ్లపై పరిశోధనలు చేశారు. అప్పటి నుంచి యునెస్కో గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్నారు.


మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఈ వార్తలు కూడా చదవండి...

Nagpur Riots Latest Update: నాగ్‌పూర్ అల్లర్లలో నిందితుడిపై మహా సర్కార్ రియాక్షన్ ఇదీ..

Loan Repayment Tips: ఇలా చేయకపోతే... అప్పుల్లో తలనొప్పులు ఖాయం

Read Latest Telangana News And Telugu News

Updated at - Mar 24 , 2025 | 03:41 PM