వాళ్ళను వదిలిపెట్టకండి సార్..చంద్రబాబుతో శాంతి భర్త

ABN, Publish Date - Jan 01 , 2025 | 10:01 PM

దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అవినీతి, అక్రమాలపై ప్రభుత్వానికి ఆమె భర్త మదన్ మోహన్ ఫిర్యాదు చేశారు. బుధవారం అమరావతిలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు‌తో శాంతి భర్త మదన్ మోహన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శాంతి అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆధారాలను సీఎం చంద్రబాబుకు ఆయన అందజేశారు.

అమరావతి, జనవరి 01: దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అవినీతి, అక్రమాలపై ప్రభుత్వానికి ఆమె భర్త మదన్ మోహన్ ఫిర్యాదు చేశారు. బుధవారం అమరావతిలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు‌తో శాంతి భర్త మదన్ మోహన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శాంతి అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆధారాలను సీఎం చంద్రబాబుకు ఆయన అందజేశారు. అలాగే వైసీపీ అగ్రనేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అక్రమాలపై సైతం ఈ సందర్బంగా సీఎం చంద్రబాబుకు మదన్ మోహన్ ఫిర్యాదు చేశారు.


తన బిడ్డకు విజయసాయిరెడ్డి డీఎన్‌ఏ టెస్ట్ చేయ్యాలని విజ్జప్తి చేశారు. అలాగే విశాఖపట్నంలో అన్యాక్రాంతమైన భూములపై తన భార్య శాంతి, విజయసాయిరెడ్డిల పాత్రపై విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబుకు మదన్ మోహన్ ఫిర్యాదు చేశారు. తనను కోల్‌కతా నుంచి తిరిగి హైదరాబాద్‌కు బదిలీ చేయాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును కోరారు. కేవలం విజయసాయిరెడ్డి వల్లనే తాను కోల్‌కతాకు బదిలీ అయ్యానన్న విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి మదన్ మోహన్ తీసుకు వెళ్లారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jan 01 , 2025 | 10:01 PM