సిట్ దర్యాప్తు.. టీటీడీ ఉద్యోగుల్లో గుబులు
ABN, Publish Date - Mar 13 , 2025 | 01:03 PM
SIT investigation: తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ దర్యాప్తుతో టీటీడీ ఉద్యోగుల్లో గుబులు నెలకొంది. ఈ వ్యహారంలో టీటీడీ ఉద్యోగులను విచారించాలని సిట్ నిర్ణయించింది. ఈ మేరకు వారికి నోటీసులు కూడా అందజేసింది.
తిరుమల, మార్చి 13: తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. టీటీడీ ఉద్యోగుల అవినీతిపై దృష్టి సారించిన సిట్ అధికారులు.. కల్తీ నెయ్యి కేసును ఏసీబీ కోర్టుకు బదిలీ చేయాలని పిటిషన్ దాఖలు చేసింది. మార్కెట్ విభాగంలో అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులపై చర్యలకు సిట్ సిద్ధమవుతోంది. సిట్ నిర్ణయంతో టీటీడీ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే భోలే బాబా డెయిరీ, వైష్ణవి డెయిరీ ఎండీలను విచారణ చేసింది సిట్. వారిని జ్యుడిషల్ కస్టడీ నుంచి తీసుకుని మరీ సిట్ అధికారులు విచారించారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో వీళ్లకు సహకరించిన టీటీడీ ఉద్యోగులు ఎవరెవరు ఉన్నారనే అంశంపై సిట్‌కు క్లారిటీ వచ్చింది.
Farmhouse Case: ఫామ్‌హౌస్ కేసు.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీకి రెండోసారి నోటీసులు..
ఈ వ్యవహారంలో ఉన్న టీటీడీ ఉద్యోగులపై ఏసీబీ నుంచి కేసు నమోదు చేయాలని మొదట భావించినప్పటికీ న్యాయపరంగా ఉన్న సూచనల మేరకు ఏసీబీ కోర్టుకు వెళ్లకుండా సిట్ దర్యాప్తు చేసే విధంగా తాజాగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో టీటీడీ ఉద్యోగులకు ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు కూడా అలిపిరి వద్ద ఉన్న సిట్ కార్యాలయానికి వచ్చి వారి వాంగ్మూలాన్ని ఇవ్వనున్నారు. వారిచ్చే వాంగ్మూలంలో నిజానిజాల ఆధారంగా సిట్ కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి...
Kondapalli Srinivas on pension: పెన్షన్ల సంఖ్య తగ్గింపుపై మండలిలో ఆసక్తికర చర్చ
Congress vs BRS: ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్
Read Latest AP News And Telugu News
Updated at - Mar 13 , 2025 | 01:03 PM