AP Speaker Congratulates: టీం ఇండియాకు శుభాకాంక్షలు..
ABN, Publish Date - Mar 10 , 2025 | 12:44 PM
AP Speaker Congratulates: ఛాపింయన్స్ ట్రోఫీలో ఘన విజయం సాధించిన భారత జట్టుకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కంగ్రాట్స్ తెలిపారు.
అమరావతి, మార్చి 10: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో గెలుపొందిన టీం ఇండియాకు (Team India) ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు (AP Speaker Ayyanna Patrudu) శుభాకాంక్షలు తెలిపారు. ఈ ట్రోఫీలో కప్పు గెలుచుకున్న భారత క్రికెట్ జట్టుకు తన తరపున, సభ తరపున, తెలుగు ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. భారత్ ఈ కప్పు గెలుచుకోవడం మూడో సారి అని, ఈ దఫా టోర్నమెంట్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా కప్పు గెలిచిన భారత జట్టు క్యాప్టెన్, జట్టు సభ్యులందరికీ ఆంధ్రరాష్ట్ర అసెంబ్లీ తరపున స్పీకర్ అయ్యన్నపాత్రుడు కంగ్రాట్స్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
BJP MLC candidate: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమువీర్రాజు
Buddha warn to KTR: మాతో పెట్టుకుంటే మాడి మసైపోతారు..
Read Latest AP News And Telugu News
Updated at - Mar 10 , 2025 | 01:14 PM