విడాకులు తీసుకున్న చాహల్, ధన శ్రీ వర్మ
ABN, Publish Date - Mar 20 , 2025 | 05:36 PM
భారత జట్టు స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్నారు. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసినట్లు చాహల్ తరఫున న్యాయవాది వెల్లడించారు.
భారత జట్టు స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్నారు. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసినట్లు చాహల్ తరఫున న్యాయవాది వెల్లడించారు. విడాకుల పిటిషన్ విచారణ కోసం చాహల్ ధన శ్రీ ఇవాళ(గురువారం) మధ్యాహ్నం కోర్టుకు వచ్చారు.
పరస్పరం అంగీకరంతో విడాకులు తీసుకుంటునందున ఆరు నెలల తప్పనిసరి విరామం అంటే కూలింగ్ ఆఫ్ పీరియడ్ గడువును బాంబే హైకోర్టు రద్దు చేసింది. మార్చి 20వ తేదీ లోగా విడాకుల పిటీషన్‌పై నిర్ణయం తీసుకోవాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. దీంతో విచారణ చేపట్టిన కోర్టు విడాకులు మంజూరు చేసింది. చాహల్ ధనశ్రీల వివాహం 2022లో జరిగింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ జంట గతంలో పెట్టిన పోస్టులు అభిమానులను గందరగోళానికి గురిచేశాయి. సామాజిక మాధ్యమాల్లో వీరిద్దరూ ఒకరినోకరూ ఆన్‌ఫాలో చేసుకోవడం, భార్య ధనశ్రీ వర్మ తన పేరు నుంచి చాహల్ పదాన్ని తొలగించడంతో వీరు విడిపోతున్నారని వార్తలు వచ్చాయి. మొత్తంమీద అనుకున్నట్లుగానే జరిగింది. ఈరోజు వీరిద్దరూ విడాకులు తీసుకోవడంతో ఈ వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది.
పూర్తి వీడియో కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
ఈ వార్తలు కూడా చదవండి
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated at - Mar 20 , 2025 | 05:58 PM