-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP and Telangana National International breaking Live Updates of 12th November 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Nov 12 , 2026 | 10:30 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Nov 12, 2026 20:48 IST
తమిళనాడు మదురైలోని తనిష్క్ జ్యువెలరీ షాప్‌లో భారీ చోరీ
కలవాసల్ బైపాస్ రోడ్డులో కొత్తగా ప్రారంభమైన షోరూమ్‌లో దోపిడీ
సుమారు 16 కిలోల బంగారం, వజ్రాభరణాలను దోచుకెళ్లిన దొంగలు
వీటి విలువ సుమారు రూ.25 కోట్ల వరకు ఉంటుందని అంచనా
-
Nov 12, 2026 20:41 IST
ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ రాజీనామా
హువాంగ్ రాజీనామాను వెల్లడించిన సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్
అధ్యక్ష పదవి, బోర్డు సభ్యత్వానికి కూడా హువాంగ్ రాజీనామా
మధ్యంతర సీఈఓగా కోలెట్ క్రెస్ నియామకం
-
Nov 12, 2026 20:06 IST
నీటిపారుదల శాఖ DEE సత్యనారాయణ అరెస్ట్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ చేసిన ACB
నాగర్‌కర్నూల్, హైదరాబాద్‌తో పాటు 10 ప్రాంతాల్లో ACB సోదాలు
భారీగా బయటపడిన DEE సత్యనారాయణ స్థిరాస్తులు
ట్రాన్స్‌కోలో ADగా పనిచేస్తున్న సత్యనారాయణ భార్య
వనపర్తిలో 25 ఎకరాల వ్యవసాయ భూమి, ఫామ్‌హౌస్, 9 ప్లాట్లు
50 తులాల బంగారం, 3 కార్లు సీజ్ చేసిన ACB
-
Nov 12, 2026 19:36 IST
హైదరాబాద్: సచివాలయంలో కార్మిక శాఖ సెక్రెటరీ దాసరి హరిచందనను కలసిన ESI JAC నేతలు
తెలంగాణ ESI ఆస్పత్రుల్లో సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్
ESI డైరెక్టర్‌గా వెంటనే వైద్యుడిని నియమించాలని విజ్ఞప్తి
ESI ఆసుపత్రుల నిర్వహణకు సొసైటీ ఏర్పాటు ప్రక్రియను నిలిపివేయాలని వినతి
అన్ని విభాగాల్లో పెండింగ్ ప్రమోషన్లు వెంటనే చేపట్టాలి..
ల్యాబ్ పరీక్షలు, మందుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి..
డిమాండ్లు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు: ESI JAC చైర్మన్ డా. చీమ శ్రీనివాస్
-
Nov 12, 2026 19:24 IST
చిత్తూరు: గంగవరం మండలంలో విషాదం
పూరి తీర్థ యాత్రలకు వెళ్లిన కుటుంబం నదిలో గల్లంతు
మనవరాలిని కాపాడే ప్రయత్నంలో తాత, అమ్మమ్మ మృతి
ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ సమీపంలో ఘటన..
మృతులు శ్రీనివాసులు, దేవీ
-
Nov 12, 2026 19:21 IST
తెలంగాణలో మరో ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీపై కొరడా
M/s డిఫెన్సర్ సెక్యూరిటీ సర్వీసెస్ లైసెన్స్ రద్దు
7 రోజుల్లో ఒరిజినల్ లైసెన్స్‌ను అప్పగించాలని ఆదేశాలు
భద్రతా సిబ్బంది నియామకంలో నిబంధనలు ఉల్లంఘన
BNS సెక్షన్లు 140(2), 103(1), 238 కింద కేసు నమోదు
-
Nov 12, 2026 19:00 IST
హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక ప్రగతికి చోదక శక్తులుగా GCCలు: మంత్రి శ్రీధర్‌బాబు
అంతర్జాతీయ సంస్థ మార్స్ GCC (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్) ప్రారంభించిన మంత్రి
GCCల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నాం: శ్రీధర్ బాబు
హైదరాబాద్‌ను గ్లోబల్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతాం..
ఇతర పరిశ్రమలతో ఐటీ రంగం అనుసంధానంపై ప్రత్యేక దృష్టి..
కొత్త రంగాల్లో పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యం..
టెక్నాలజీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం: శ్రీధర్‌బాబు
సంప్రదాయ IT సేవల కేంద్రం నుంచి..
నాలెడ్జ్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా హైదరాబాద్: మంత్రి శ్రీధర్‌బాబు
-
Nov 12, 2026 18:49 IST
విశాఖ: CII సమ్మిట్‌లో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం
మంత్రి లోకేష్ సమక్షంలో అవగాహనా ఒప్పందాలు
రూ.1,57,607 కోట్ల విలువైన 35 MOUలు
పెట్టుబడుల ద్వారా యువతకు 52,956 ఉద్యోగ అవకాశాలు
రెన్యువబుల్ ఎనర్జీ, ఇన్ ఫ్రా, ఏరో స్పేస్..
హెల్త్ కేర్, టూరిజం రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులు
-
Nov 12, 2026 18:24 IST
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్
ఇకపై తెలుగులోనే Ai ఆధారిత వ్యవసాయ సలహాలు
తెలంగాణలో భారత్ విస్తార్ సేవల అమలుకు..
వ్యవసాయ శాఖ–NISG మధ్య MoU
ఒకే డిజిటల్ వేదికపైకి ఆరు కీలక వ్యవసాయ సేవలు
-
Nov 12, 2026 18:21 IST
మురసు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన
రేపు, ఎల్లుండి బాపట్ల, పల్నాడు, ఏలూరు, తూ.గో. జిల్లాల్లో..
తుపాను నష్టాన్ని పరిశీలించనున్న కేంద్ర బృందం
-
Nov 12, 2026 18:19 IST
విశాఖ: సీఎం చంద్రబాబుతో కియా ఇండియా MD గ్వాంగ్ లీ భేటీ
ఏడాదికి అదనంగా మరో 2 లక్షల కార్ల ఉత్పత్తికి MoU
రూ.18 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న కియా సంస్థ
ఏపీ యూనిట్ నుంచి 100 దేశాలకు కియా కార్ల ఎగుమతి
-
Nov 12, 2026 17:55 IST
విశాఖ: సీఎం చంద్రబాబుతో దీపక్ నైట్రేట్ ప్రతినిధుల భేటీ
మానవ వనరులు, స్కిల్ డెవలప్‌మెంట్ అంశాలను సీఎం చంద్రబాబుకు వివరించిన ప్రతినిధులు
కెమికల్ పార్క్ ఏర్పాటులో భాగస్వాములు కావాలని కోరిన సీఎం
-
Nov 12, 2026 17:42 IST
నెల్లూరు: ఆత్మకూరు పరిధిలోని వెంకట్రావుపల్లి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
ఎదురెదురుగా ఢీకొన్న బొగ్గు లోడు లారీ - సిమెంట్ టాంకర్
డ్రైవర్ మృతి, మరొకరి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు
-
Nov 12, 2026 17:13 IST
తిరుపతి: పుత్తూరు కేకేసి కళాశాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆటోను ఢీకొన్న లారీ.. ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి
ప్రమాదంలో 10 మంది ఎంపీహెచ్‌డబ్ల్యూ (MPHW) / ఎంఎల్‌టీ విద్యార్థినులకు గాయాలు
ఆసుపత్రిలో శిక్షణ ముగించుకుని తిరిగి పుత్తూరు వస్తుండగా దుర్ఘటన
క్షతగాత్రులకు పుత్తూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స.. ఒకరి పరిస్థితి విషమం
మెరుగైన వైద్యం కోసం తిరుపతి ఆసుపత్రికి విద్యార్థిని తరలింపు
ప్రమాద ఘటనతో ఆందోళనలో విద్యార్థినుల కుటుంబ సభ్యులు
-
Nov 12, 2026 16:58 IST
తెలంగాణలో 21 మంది IPSలు బదిలీలు
హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్ నియామకం
-
Nov 12, 2026 16:52 IST
రంగారెడ్డి: నందిగామలో భారీ అగ్నిప్రమాదం
ప్లాస్టిక్ పరిశ్రమలో చెలరేగిన మంటలు
5 ఫైరింజన్లతో మంటలార్పుతున్న సిబ్బంది
కుర్చీలు, ఇతర సామగ్రి దగ్ధం, భారీగా ఆస్తి నష్టం
-
Nov 12, 2026 16:48 IST
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
పెట్టుబడి రక్షణ చట్టం తీసుకురానున్న ప్రభుత్వం
విశాఖ CII సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు వెల్లడి
పెట్టుబడుల రక్షణకు చట్టం చేస్తామని సీఎం ప్రకటన
రాజకీయ వైరుధ్యాలకు పెట్టుబడిదారులు బలి కావొద్దు: సీఎం చంద్రబాబు
పెట్టుబడిదారుల రక్షణే లక్ష్యంగా కొత్త చట్టం: సీఎం
ఇన్వెస్టిమెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ దేశమంతా ఉండాలి: సీఎం
చట్టం చేసి కేంద్రానికి పంపుతాం: సీఎం చంద్రబాబు
పార్లమెంట్‌లో ప్రత్యేక చట్టం చేయాలి: సీఎం చంద్రబాబు
-
Nov 12, 2026 16:47 IST
నంద్యాల: నందికొట్కూరు మున్సిపాలిటీలో మారిన సమీకరణాలు
ఎమ్మెల్యే జయసూర్య వర్గాన్ని వీడిన 29, 30 వార్డు కౌన్సిలర్లు
మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిక
-
Nov 12, 2026 16:46 IST
విశాఖ: వాల్‌మార్ట్ వైస్ ప్రెసిడెంట్ పాల్ డైక్‌తో మంత్రి లోకేష్ భేటీ
ఏపీ డ్వాక్రా మహిళా సంఘాల ఉత్పత్తులకు వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ సరఫరా వ్యవస్థల్లో అవకాశం కల్పించాలి
స్వయం ఏపీ, లేపాక్షి బ్రాండ్ల ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెటింగ్‌కు అవకాశం కల్పించాలని ప్రతిపాదన
ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామన్న పాల్ డైక్
-
Nov 12, 2026 16:45 IST
ముంబై మేయర్ కార్యాలయానికి బాంబు బెదిరింపు
ఆఫీస్‌ను పేల్చేస్తామంటూ ఈ-మెయిల్
అమితాబ్ బచ్చన్ నివాసంతో పాటు సింగర్ దిల్జీత్ దోసాంజ్ ప్రోగ్రామ్‌కు బెదిరింపులు
తనిఖీలు చేస్తున్న భద్రతా దళాలు
-
Nov 12, 2026 16:44 IST
మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత
విశాఖ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి
వైఎస్ హయాంలో అటవీశాఖా మంత్రిగా పనిచేసిన శత్రుచర్ల
రోశయ్య కేబినెట్‌లో రవాణాశాఖ మంత్రిగా పనిచేసిన శత్రుచర్ల
2017 నుంచి టీడీపీ MLCగా కొనసాగిన శత్రుచర్ల
-
Nov 12, 2026 16:43 IST
హైదరాబాద్: 2024 బ్యాచ్ మహిళా ఎస్‌ఐపై సీపీ సీరియస్
కుల్సుంపురా డివిజన్‌లో పనిచేస్తున్న మహిళా ఎస్‌ఐపై అవినీతి ఆరోపణలు
వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్‌ఐ వ్యవహారాలపై ఆధారాలు ప్రస్తావించిన సీపీ సజ్జనార్
పీఎస్ నుంచి రిలీవ్ చేసి హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్
ట్రైనింగ్ పూర్తికాకముందే మహిళా ఎస్‌ఐపై అవినీతి ఆరోపణలు
ఎస్‌ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లపై చర్యలకు రంగం సిద్ధం
-
Nov 12, 2026 16:41 IST
మదురైలో భారీగా బంగారం చోరీ
తనిష్క్ జ్యువెలరీ షోరూంలో 20 కిలోల బంగారం అపహరణ
నిన్న అర్ధరాత్రి చోరీ జరిగినట్లు అనుమానం
షోరూం పైఅంతస్తు నుంచి లిఫ్ట్ ద్వారా ఓ వ్యక్తి లోపలికి ప్రవేశించినట్లు సీసీ ఫుటేజీలో గుర్తింపు
కేసు నమోదు, దర్యాప్తు చేస్తున్న మదురై పోలీసులు
-
Nov 12, 2026 16:40 IST
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ 32, నిఫ్టీ 44 పాయింట్ల లాభం
-
Nov 12, 2026 15:56 IST
నెల్లూరు: రాపురు మండలం సిద్ధవరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
కూలి పనులు ముగించుకుని వస్తున్న ఇద్దరు వ్యక్తులను వేగంగా వచ్చి ఢీకొన్న కారు
బొమ్మనబోయిన గంగయ్య(62), వామిటిపర్తి పిచ్చయ్య (59) అనే ఇద్దరు కూలీల మృతి
-
Nov 12, 2026 15:47 IST
విశాఖ: ఉమెన్ అండ్ గ్రోత్ సమ్మిట్-2026
మహిళల భద్రతపై రాజీపడే ప్రసక్తే లేదు: సీఎం చంద్రబాబు
మహిళలకు ఆర్థికస్వేచ్ఛ అవసరం: సీఎం
పాలసీలన్నీ మహిళలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నాం: సీఎం
అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు: సీఎం
డ్వాక్రా సంఘాలు లక్షన్నర కోట్ల టర్నోవర్ సాధించాయి: సీఎం
-
Nov 12, 2026 15:30 IST
22-ఎ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్‌లో ఉండటానికి వీల్లేదు: మంత్రి
పరిష్కారంలో జాప్యానికి తావివ్వొద్దు- కలెక్టర్లు ప్రత్యేక చొరవ చూపాలి: మంత్రి
కలెక్టర్ల బాధ్యతాయుతమైన పర్యవేక్షణతోనే సామాన్యులకు నిజమైన ప్రయోజనం: మంత్రి
జిల్లా కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశం: మంత్రి
-
Nov 12, 2026 13:13 IST
హైదరాబాద్‌లో టీజీ సేఫ్ స్పెషల్ డ్రైవ్
నగరంలోని కేఎఫ్‌సీ, డోమినోస్ బ్రాంచ్‌లలో కొనసాగుతున్న సోదాలు
నిల్వ ఉంచిన నాన్ వెజ్, ఆహార పదార్థాల అపరిశుభ్రత, గడువు ముగిసిన పదార్థాలను వాడుతున్నట్లు గుర్తింపు
అన్ని బ్రాంచ్‌లలో కొనసాగుతున్న టీజీ సేఫ్ ఫుడ్‌సేఫ్టీ అధికారుల సోదాలు
-
Nov 12, 2026 13:07 IST
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రెస్‌మీట్..
మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు
ఈ నెల 13, 16, 19తేదీల్లో మూడు విడతలుగా నోటిఫికేషన్లు
ఈ నెల 26, 29, డిసెంబర్ 2 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు
విడతల వారీగా పోలింగ్ అయిన వెంటనే ఓట్ల లెక్కింపు
నామినేషన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల్లో CCTV నిఘా తప్పనిసరి: ఎస్ఈసీ
పోలింగ్ వీడియో రికార్డింగ్‌లు 60 రోజుల పాటు భద్రపరచాలి: ఎస్ఈసీ
-
Nov 12, 2026 13:04 IST
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్
4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు ఎన్నికలు
ఈ నెల 14 నుంచి 16 వరకు నామినేషన్ల స్వీకరణ
17న నామినేషన్ల పరిశీలన, 19 వరకు విత్‌డ్రా గడువు
ఈ నెల 26న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు
-
Nov 12, 2026 13:04 IST
తెలంగాణ MLC పట్టభద్రుల ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల
ఈ నెల 25న ముసాయిదా జాబితా
డిసెంబర్ 30న తుది జాబితా విడుదల
-
Nov 12, 2026 12:56 IST
విశాఖ: CII సదస్సు మరోసారి జరపడం సంతోషంగా ఉంది: సీఎం చంద్రబాబు
నా ఆధ్వర్యంలో ఇప్పటివరకు 8 CII సదస్సులు జరిపా: సీఎం
నాపై నమ్మకంతో ఎందరో పెట్టుబడులకు ముందుకొచ్చారు: సీఎం
నమ్మకమైన భాగస్వామి ఉంటే విజయాలు తథ్యం: సీఎం
దేశంలో స్వచ్ఛమైన నగరాల్లో మొదటిది విశాఖ: సీఎం
దేశంలోనే అత్యంత సురక్షిత ప్రాంతం విశాఖ: సీఎం
విశాఖ సమీపంలో సెమీకండక్టర్ పరిశ్రమ వేదిక కానుంది: సీఎం
అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం: సీఎం
అపార అవకాశాలకు ఏపీ ముఖ్యమైన ప్రాంతం: సీఎం
-
Nov 12, 2026 12:46 IST
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు హత్య బెదిరింపులు
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో బెదిరింపులు వచ్చినట్లు ఆరోపణలు
కేజ్రీవాల్‌ను చంపేస్తామంటూ హెచ్చరికలు
రూ.7 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం
-
Nov 12, 2026 12:38 IST
హైదరాబాద్: శంకర్ గౌడ్ కుటుంబానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం
శంకర్ గౌడ్ కుమారుడు హేమంత్ గౌడ్‌కు ఆర్టీసీలో ఉద్యోగం
రికార్డ్ ట్రెజరర్‌గా నియమిస్తూ నియామక పత్రం అందజేత
మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ లెటర్ అందజేత
శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం, ఆర్టీసీ తరఫున పరిహారం అందజేత
ఒకరోజు వేతనంగా కోటి రూపాయలు అందించిన ఆర్టీసీ ఉద్యోగులు
గతంలో ఆత్మహత్య చేసుకున్న నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్
-
Nov 12, 2026 12:37 IST
విశాఖ: మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది: డిప్యూటీ సీఎం పవన్
సుదీర్ఘ తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ బలం: పవన్
పెట్టుబడులకు నమ్మకమైన ప్రాంతం ఏపీ: పవన్
సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: పవన్
-
Nov 12, 2026 12:36 IST
విశాఖ: ఏపీలో మరో అభివృద్ధి కేంద్రంగా ఉత్తరాంధ్ర: కేంద్రమంత్రి రామ్మోహన్
పర్యాటకానికి అపార అవకాశాలున్న ప్రాంతం ఉత్తరాంధ్ర: రామ్మోహన్
ఆర్థిక, సాంస్కృతిక రాజధాని విశాఖ: రామ్మోహన్
విశాఖను ఆర్థికాభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నాం: రామ్మోహన్
వ్యాపారమే కాదు.. నమ్మకం కూడా చాలా ముఖ్యం: రామ్మోహన్
సమర్థ నాయకత్వం ఉన్న రాష్ట్రం ఏపీ: రామ్మోహన్
-
Nov 12, 2026 12:35 IST
విశాఖ సుందరమైన ప్రాంతం: కేంద్రమంత్రి పీయూష్ గోయల్
పెట్టుబడులను ఆకర్శిస్తున్న ప్రాంతంగా విశాఖ రూపుదిద్దుకుంటోంది: గోయల్
సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఏపీ ముందుంది: గోయల్
సమర్థవంతమైన చంద్రబాబు నాయకత్వంలో ఏపీకి కొత్త పెట్టుబడులు: గోయల్
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను.. స్పీడ్ ఆఫ్ డూయింగ్‌గా మార్చారు: గోయల్
పెట్టుబడిదారులకు నమ్మకం కల్పించడంలో చంద్రబాబు దిట్ట: గోయల్
తుపాన్లు, విపత్తుల సమయంలో చంద్రబాబు ఎలా పనిచేస్తారో చూశాం: గోయల్
ఆర్నబ్, మురసు వంటి తుపాన్లతో ఎంతో నష్టం జరిగింది: గోయల్
-
Nov 12, 2026 12:35 IST
హైదరాబాద్: అగ్రికల్చర్ వర్సిటీలో వేధింపులపై విచారణ
మహిళా కమిషన్ ఎదుట హాజరైన VC అల్దాస్ జానయ్య
ఈ వ్యవహారంపై ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
15 రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిటీకి ఆదేశం
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండీ లక్ష్మి నేతృత్వంలో కమిటీ
-
Nov 12, 2026 12:34 IST
ఢిల్లీ: బీజేపీ కేంద్ర కార్యాలయంలో దీపావళి మిలన్
జర్నలిస్టులతో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సమావేశం
మీడియాతో నాకు చాలా మంచి అనుబంధం ఉంది: ప్రధాని మోదీ
భారత్‌లో టెక్నాలజీ వినియోగం పెరిగింది: ప్రదాని మోదీ
గల్లీల్లో కూడా టెక్నాలజీ వినియోగిస్తున్నారు: ప్రధాని మోదీ
అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను మార్చాలన్నది నా లక్ష్యం: ప్రధాని మోదీ
-
Nov 12, 2026 12:33 IST
శ్రీసత్యసాయి జిల్లా పరిగి మండలంలో బాలికపై దాడి ఘటనపై మంత్రి సవిత ఆరా
బాలిక తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి సవిత
గాయాల నుంచి బాలిక కోలుకుంటున్నట్లు మంత్రికి తెలిపిన తల్లిదండ్రులు
అనంతపురం ప్రభుత్వాసుపత్రి వైద్యులతో మాట్లాడిన మంత్రి సవిత
మెరుగైన వైద్యమందించాలని ఆదేశం
జామ కాయ కోసినందుకు బాలికపై రాయితో దాడి చేయడం అమానుషం: మంత్రి
విచక్షణ కోల్పోయి మహిళ దాడి చేయడం బాధాకరం: మంత్రి
బాలిక కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి
దాడి చేసిన మహిళపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం: మంత్రి సవిత
-
Nov 12, 2026 12:19 IST
వనపర్తి జిల్లా ఖిల్లా ఘనాపురం మండలం షాపూర్‌లో ఏసీబీ అధికారుల మెరుపు దాడులు
ఇరిగేషన్ అండ్ సీఏడీ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌పై ఏసీబీ సోదాలు
ఆర్. సత్యనారాయణ (44) నివాసంతో పాటు ఇతర ప్రాంతాల్లో సోదాలు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ సోదాలు
ఏకకాలంలో రంగంలోకి దిగిన 10 ఏసీబీ బృందాలు
సోదాల్లో బయటపడనున్న ఆస్తులు, కీలక పత్రాలు
-
Nov 12, 2026 11:58 IST
విశాఖ: సీఐఐ భాగస్వామ్య-2026 సదస్సు నేపథ్యంలో మంత్రి లోకేశ్ కామెంట్స్..
సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న రాష్ట్రం ఏపీ: మంత్రి లోకేశ్
ఓడరేవుల అభివృద్ధి ప్రాజెక్టులకు అవకాశాలు: లోకేశ్
పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహం అందిస్తున్నాం: లోకేశ్
పర్యాటకంగా అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి: మంత్రి లోకేశ్
రాష్ట్రాభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలి: లోకేశ్
సదస్సు ద్వారా రూ.12లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యం: లోకేశ్
లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా: లోకేశ్
విశాఖకు పరిశ్రమలు క్యూ కడుతున్నాయి: మంత్రి లోకేశ్
విశాఖ సమీపంలో సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటు కాబోతోంది: లోకేశ్
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పరిశీలించి పెట్టుబడులు పెట్టండి: లోకేశ్
ఏపీలో కనెక్టివిటీ ఎంతో ఉపయోగకరంగా ఉంది: లోకేశ్
అనుమతుల విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు: లోకేశ్
మౌలిక సదుపాయాల కల్పనలో వెనుకాడం: లోకేశ్
ఏపీని మీ సొంత ప్రాంతంగా భావించి పెట్టుబడులు పెట్టండి: లోకేశ్
-
Nov 12, 2026 11:43 IST
శంషాబాద్: డాన్స్ మాస్టర్ శేఖర్ కారుకు రోడ్డు ప్రమాదం
శంషాబాద్ మండలం ముచ్చింతల్ వద్ద మరో శేఖర్ మాస్టర్ కారును ఢీకొన్న మరో వాహనం
ఇన్నోవాలో ప్రయాణిస్తున్న కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు స్వల్ప గాయాలు
మహేశ్వరం మండలం గోల్లూరులో సినిమా షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం
ప్రమాదంలో శేఖర్ మాస్టర్ కారు పూర్తిగా ధ్వంసం
ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపిన పోలీసులు
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న శంషాబాద్ పోలీసులు
-
Nov 12, 2026 11:41 IST
నాగర్‌కర్నూల్ జిల్లాలో ఏసీబీ అధికారుల మెరుపు దాడులు
ఇరిగేషన్ అండ్ సీఏడీ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌పై ఏసీబీ సోదాలు
ఆర్. సత్యనారాయణ (44) నివాసంతో పాటు ఇతర ప్రాంతాల్లో సోదాలు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ సోదాలు
ఏకకాలంలో రంగంలోకి దిగిన 10 ఏసీబీ బృందాలు
సోదాల్లో బయటపడనున్న ఆస్తులు, కీలక పత్రాలు
-
Nov 12, 2026 11:09 IST
ఇటలీలో వందలాది స్కూళ్లకు బాంబు బెదిరింపులు
300కుపైగా స్కూళ్లకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్
దర్యాప్తు కొనసాగుతోందని ఇటలీ ప్రధాని మెలోనీ వెల్లడి
-
Nov 12, 2026 11:09 IST
హైదరాబాద్: ఏపీ లిక్కర్ కేసులో హైకోర్టులో ఈడీ పిటిషన్
రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్
సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న ఈడీ
ఈడీ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్న తెలంగాణ హైకోర్టు
-
Nov 12, 2026 11:07 IST
ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం
ఢిల్లీలో AQI 319 పాయింట్లుగా నమోదు
కాలుష్యంతో తగ్గిన రోడ్లపై విజిబిలిటీ
59 కేంద్రాల్లో 38 చోట్ల 300 దాటిన AQI
-
Nov 12, 2026 11:07 IST
కడప: ప్రొద్దుటూరులో రూ.8.46 కోట్లకు ఐపీ పెట్టిన బంగారు వ్యాపారి
రియల్ ఎస్టేట్, బంగారం వ్యాపారాల్లో దివాళా తీసినట్టు కోర్టులో పిటిషన్
ఆందోళనలో రుణం ఇచ్చిన 33 మంది బాధితులు
-
Nov 12, 2026 11:05 IST
భారీగా తగ్గిన బంగారం ధరలు
రూ.2180 తగ్గి రూ.1,39,800కి చేరిన 24క్యారెట్ల 10గ్రా. బంగారం ధర
రూ.2000 తగ్గి రూ.1,28,150కి చేరిన 22క్యారెట్ల 10గ్రా. బంగారం ధర
కిలో వెండి ధర రూ.2,00,000
-
Nov 12, 2026 10:41 IST
పల్నాడు: సత్తెనపల్లి మండలం పెదమక్కెనలో కూటమి నాయకులకు వార్నింగ్
జై భీమ్ పేరుతో కరపత్రం విడుదల
జనసేన నాయకుడు హనుమయ్య కిరాణా దుకాణానికి కరపత్రం అంటించిన యువకులు
దుకాణం దగ్గర కూటమి నాయకులకు కుర్చీలు వేసి కూర్చోపెట్టవద్దు అంటూ వార్నింగ్
గుర్తుపెట్టుకో.. వారం రోజుల్లో దుకాణం లేచిపోతుంది
ఎస్సీ ఎస్టీల పవర్ ఎంటో చూపిస్తాం అంటూ వార్నింగ్
సీసీకెమెరాలో రికార్డైన దృశ్యాలు
సత్తెనపల్లి రూరల్ స్టేషన్‌లో కూటమి నాయకుల ఫిర్యాదు
-
Nov 12, 2026 10:37 IST
గుంటూరు: మంగళగిరి జనసేన నేతల పేరుతో మోసం
ఏలూరు, తణుకు ప్రాంతాల్లో ఉద్యోగాల పేరుతో వసూళ్లు
20 మంది నుంచి రూ.7కోట్లు వసూలు చేసిన కేటుగాళ్లు
కళ్యాణం శివ శ్రీనివాస్(కేకే), కోట రుక్మిణి పేరుతో వసూళ్లు
మంగళగిరి రూరల్ పీఎస్‌లో కేకే, కోట రుక్మిణి ఫిర్యాదు, కేసు నమోదు
-
Nov 12, 2026 10:37 IST
హైదరాబాద్: హకీంపేటలో అక్రమ గుడిసెల తొలగింపు
అక్రమంగా వేసుకున్న గుడిసెలను తొలగిస్తున్న హైడ్రా
ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా వెలిసిన నిర్మాణాల తొలగింపు
పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలను తొలగిస్తున్న హైడ్రా
-
Nov 12, 2026 10:36 IST
జమ్మూకశ్మీర్‌లో అదృశ్యమైన ఇద్దరు SPOల అనుమానాస్పద మృతి
కిశ్త్వాడ్ అడవుల్లో బాబా చంద్, రష్పాల్ మృతదేహాల గుర్తింపు
-
Nov 12, 2026 10:35 IST
ఎన్‌విడియా సంక్షోభంపై స్పందించిన ఎలాన్ మస్క్
హువాంగ్‌ను తొలగిస్తే నేను చేర్చుకుంటా: మస్క్
-
Nov 12, 2026 10:35 IST
ఎన్‌విడియా CEO జెన్సెన్ హువాంగ్‌పై మరో వివాదం
కింబర్లీతో సంబంధంపై అంతర్జాతీయ మీడియాలో కథనాలు
హువాంగ్‌పై రెండో వివాహేతర సంబంధం ఆరోపణలు
జెన్సెన్ భవితవ్యంపై ఎన్‌విడియా బోర్డు కీలక భేటీ
CEO పదవి నుంచి హువాంగ్ తొలగింపుపై చర్చలు
చైనా గూఢచర్య ఆరోపణలపై ఇప్పటికే స్వతంత్ర దర్యాప్తు
ఎన్‌విడియా భవిష్యత్‌పై ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళన
ఆఫ్టర్ ట్రేడింగ్ అవర్స్‌లో భారీగా పతనమైన షేర్లు
-
Nov 12, 2026 10:30 IST
విశాఖలో CII అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు ప్రారంభం
ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్రమంత్రి పీయూష్ గోయల్
హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్
సదస్సుకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులు, అంతర్జాతీయ వక్తలు
సదస్సు ప్రాంగణంలో స్టాళ్లను సందర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం