Home » Andhra Pradesh » East Godavari
సాంకేతికంగా అర్హత సాధించి అతి తక్కువ ధరలో కోట్ చేసిన వారికే ఇసుక రీచ్‌ల నిర్వహణకు అనుమతులు ఇస్తామని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ చెప్పారు. జిల్లాలోని పన్నెండు ఇసుక రీచ్‌ల్లో మాన్యువల్‌గా ఇసుక తవ్వకాలు, వాహనాల లోడింగ్, స్టాకు పాయింట్ల వరకు రవాణా, స్టాకు పాయింట్ల నుంచి వాహనాల్లో ఇసుకను లోడ్ చేయడానికి చార్జీల వసూళ్ల నిమిత్తం పిలిచిన షీల్డు టెండర్ల టెక్నికల్ బిడ్లను పూర్తి పారదర్శకతతో ధ్రువీకరించాలని సూచించారు.
ఈ నెల 14 నుంచి నాన్ కమ్యూనకబుల్ వ్యాధుల 3.0 ఇంటింటా సర్వేను ప్రారంభించిన మొత్తం 9 నెలల పాటు నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. నోటి కేన్సర్, రొమ్ముకేన్సర్, గర్భాశయ కేన్సర్ స్ర్కీనింగ్ నిర్వహిస్తారన్నారు.
విధ రాషా్ట్రలకు చెందిన పది మంది ట్రైనీ కలెక్టర్లు రెండు రోజుల క్షేత్ర స్థాయి శిక్షణలో భాగంగా మంగళవారం తూర్పు గోదావరి జిల్లా కడియం మండలంలో పర్యటించారు. రెండు బృందాలుగా ఏర్పడి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల తీరుతెన్నులను పరిశీలించారు.
రత్నగిరివాసుడైన సత్యదేవునికి జరిగే వార్షిక వే డుకల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన స్వామివారి తెప్పోత్సవం నిర్వహణకు అధికారులు సర్వంసిద్ధం చేశారు. ప్రతిఏటా క్షీరాబ్ధి ద్వాదశి పర్వదినాన ఈ వేడుక నిర్వహిస్తారు. ఇప్పటికే హంస వాహనాన్ని ముస్తాబు చేశారు. తులసిధాత్రి పూజ జరిపేందుకు పంపా తీరం వద్ద వేదికను సర్వాంగసుందరంగా అలంకరిస్తున్నారు.
కరిచర్లగూడెంలోని పేదలకు ఇళ్లస్థలాలు పంపిణీ చేసేందుకు కొనుగోలు చేసిన 15 ఎకరాల్లో 70 సెంట్ల భూమిని అక్రమించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మగ్బుల్ భాష, వేముల నాగరాజు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం ఫిర్యాదు చేశారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీతో ప్రజలకు మేలు జరగడంలేదని ఏఐటీయూసీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు తాటిపాక మధు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేశారు.
ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు జిల్లా రిటర్నింగ్ అధికారి, కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సోమ వారం నోటిఫికేషన్ విడుదల చేశారు.
రాజోలులో బీసీ హాస్టల్ విద్యార్థులు హాస్టల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకుల ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు.
దేవరపల్లిలోని జడ్పీ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓరుగంటి సాహితి రాష్ట్రస్థాయి క్రికెట్ జట్టుకు ఎంపికైనట్టు వ్యాయామ ఉపాధ్యాయుడు ఓరుగంటి నాగ రాజు తెలిపారు.
వెయ్యి గుడుల వెలుగుకోసం భక్తి చైతన్య ముగింపు సభ అప్పనపల్లి బాలాజీ సన్నిధిలో సోమవారం రాత్రి జరిగింది.