Home » Andhra Pradesh » Elections
ఉత్తరాంధ్రాలో రెండు వేల కోట్ల అసైన్డ్ భూములను సీఎస్ జవహర్ రెడ్డి (CS Jawahar Reddy) కొట్టేశారని జనసేన (Jana Sena) సీనియర్ నేత పీతల మూర్తి యాదవ్ (Murthy Yadav) ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికల హింస మీద విచారణ జరుగుతుంటే ఆయన విశాఖ వచ్చి భూ వ్యవహారాలు చేస్తున్నారని విమర్శించారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ ఆసైన్డ్ భూములు ఎక్కువుగా ఉన్నాయన్నారు. భూముల మార్పిడి జీవో 596.. ఆ జీవో ఆధారంగా భూములు కొట్టేశారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజలు వైసీపీని తిరస్కరించారని, జూన్ 4వ తేదీన ఆ విషయం తెలుస్తోందన్నారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల (AP Election 2024) కౌంటింగ్‌కు, ప్రస్తుత హింసాత్మక సంఘటనలకు నేపథ్యంలో జిల్లాలకు ప్రత్యేక పోలీస్ అధికారులు రానున్నారు. పోలింగ్ రోజు, అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనల నేపథ్యంలో ఉన్నతాధికారులను నియమించారు. ఈ మేరకు ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా (AP DGP Harish Kumar Gupta) శనివారం కీలక ఆదేశాలు జారీ చేశారు.
సీఎస్ జవహర్ రెడ్డి (CS Jawahar Reddy) పంపిన ప్రతిపాదనలు ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా ఉన్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) అన్నారు. శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
గన్నవరం మే 25: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల రోజు, మరుసటి రోజు వైసీపీ చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే మాచర్ల, తిరుపతి, తాడిపత్రి ఘటనలు వీడియోలతో సహా బయటకు రాగా తాజాగా గన్నవరం వైసీపీ అభ్యర్థి వంశీ దాడులకు సంబంధించిన ఘటన ఆలస్యంగా బయటపడింది. కేసరపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పొట్లూరి బసవరావు ఇంటిపై వంశీ దాడి చేయగా.. స్థానిక యువత, గ్రామస్థులు ఆయన్ను పరిగెత్తించిన విషయం వైరల్‌గా మారింది.
వైసీపీ నేత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంకా అజ్ఞాతంలోనే కొనసాగుతున్నారు. ఈవీఎంల ధ్వంసం కేసులో జూన్6 వరకు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించినప్పటికీ ఎమ్మెల్యే పిన్నెల్లి మాత్రం ఇంకా బయటకురాలేదు. ఓవైపు రామకృష్ణారెడ్డి తప్పించుకుతిరుగుతుంటే.. మరోవైపు ఆయన అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.
ఏపీలో మే 13వ తేదీ జరిగిన పోలింగ్ రోజున వైసీపీ వర్గీయులు ఎలా రెచ్చిపోయారో అందరికీ తెలుసు. ఓటమి భయం చుట్టుముట్టడంతో ఏం చేయాలో పాలుపోక.. రిగ్గింగ్‌కు పాల్పడేందుకు..
ఏపీలో అధికార వైసీపీ అరాచకాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. టీడీపీ నాయకులను టార్గెట్ చేసుకొని.. వైసీపీ వరుస దాడులకు పాల్పడుతోంది. ఈ నెల 13న జరిగిన పోలింగ్ రోజున..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నంద్యాలలో పర్యటించి హడావుడి చేసిన సంగతి తెలిసిందే.! నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి (Shilpa Ravi) ఇంటికి వెళ్లి..
ఈ నెల 13వ తేదీన పోలింగ్ పూర్తయిన వెంటనే అభ్యర్థుల్లో ఫలితాలపై టెన్షన్ మొదలైంది.