సార్వత్రిక ఎన్నికల కోలహలం మొదలైంది. దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతో పాటు.. నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలూ జరగనున్నాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. దేశ ప్రజలంతా తమ పాలకులను ఎన్నుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ ఎన్నికల యుద్ధంలో గెలుపు కోసం పార్టీలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. కేంద్రంలో మోదీ హ్యాట్రిక్ కొడతారా.. ఇండియా కూటమి ఎన్డీయేకు షాకిస్తుందా.. దేశం మొత్తం ఇదే చర్చ. అభివృద్ధి కోసం అప్కీబార్ మోదీ సర్కార్ అని బీజేపీ అంటుంటే.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇండియా కూటమిని గెలిపించాలని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. కమలం, హస్తం మధ్య పోరులో ఎవరిది పై చేయి కాబోతుందనేది ఆకక్తి రేపుతోంది. 543 మంది పార్లమెంట్ సభ్యులను ఎన్నుకునేందుకు దేశ ప్రజానీకం సిద్ధమైంది. ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా.. జూన్4వ తేదీన అసలు ఫలితం తేలిపోతుంది.
మరోవైపు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు. రాష్ట్ర విభజన తర్వాత జరగబోతున్న మూడో ఎన్నికల్లో అధికారం ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. 2 సార్లు ఎన్నికలు జరగ్గా ఓ సారి టీడీపీ కూటమి, మరోసారి వైసీపీ విజయం సాధించాయి. గత 2 ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలు కాక రేపుతున్నాయి. వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతుంటే అరాచక పాలనకు అంతం పలకాలనే నినాదంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టాయి. కూటమిలో ప్రధాన భాగస్వామి తెలుగుదేశం పార్టీ ఉంది. రెండోసారి అధికారం కోసం వైసీపీ ప్రయత్నిస్తుంటే.. ఈ సారి వైసీపీని ఓడిస్తామని కూటమి శపథం చేస్తోంది. హోరాహోరీగా జరగనున్న ఈ పోరులో గెలుపెవరిది. వరుసగా రెండోసారి వైసీపీ విజయ ఢంకా మోగిస్తుందా.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి.. ఫ్యాన్‌కు కరెంట్‌ను ఆపుతుందా.. అసలేం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంది.
కాంగ్రెస్ సైతం వామపక్షాలతో కలిసి పోటీ చేస్తున్నప్పటికీ ప్రధాన పోటీ టీడీపీ కూటమికి, వైసీపీకి మధ్యనే ఉండనుంది. ఈసారి ఫ్యాన్ గాలి వీయడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. 2019 ఫలితం రివర్స్ అయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు ఏపీ ఎన్నికల యుద్ధంలో గెలిచేదెవరు.. ఓడేదెవరో జూన్4న తేలిపోనుంది
పార్టీ | ఆదిక్యం | గెలుపు | మొత్తం |
---|---|---|---|
టీడీపీ + | 0 | 20 | 20 |
వైఎస్ఆర్సీపీ | 0 | 82 | 82 |
కాంగ్రెస్ పార్టీ | 0 | 50 | 50 |
ఇతరులు | 0 | 4 | 4 |
పార్టీ | గెలుపు |
---|---|
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ | 151 |
తెలుగుదేశం పార్టీ | 23 |
జనసేన పార్టీ | 1 |
భారతీయ జనతా పార్టీ | 0 |
భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ | 0 |
పార్టీ | గెలుపు |
---|---|
తెలుగుదేశం పార్టీ | 102 |
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ | 67 |
భారతీయ జనతా పార్టీ | 4 |
ఇతరులు | 2 |
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు
టీడీపీ+
వైఎస్ఆర్సీపీ
కాంగ్రెస్ పార్టీ
ఇతరులు
0
0
0
0
టీడీపీ
వైఎస్ఆర్సీపీ
జెఎస్పీ
బీజేపీ
కాంగ్రెస్ పార్టీ
టీడీపీ
వైఎస్ఆర్సీపీ
బీజేపీ
ఇతరులు
నియోజకవర్గం పేరు | అభ్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | ఆదిక్యం |
---|
నియోజకవర్గం పేరు | అభ్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | ఆదిక్యం |
---|
నియోజకవర్గం పేరు | అభ్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | ఆదిక్యం |
---|
S.No | అభ్యర్థి పేరు | నియోజకవర్గం | పార్టీ |
---|