Home » Andhra Pradesh » Krishna
నలంద విద్యానికేతన్ సెకండరీ విభాగంలో నిర్వహిస్తున్న సీబీఎస్ఈ రీజినల్ సైన్స్ ఎగ్జిబిషన్ మంగళవారం ముగిసింది.
Andhrapradesh: ‘‘ 2019లో చంద్రబాబును ఉద్దేశించి అసెంబ్లీలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతిపక్ష హోదాపై నువ్వు చేసిన వ్యాఖ్యలు గుర్తులేవా జగన్.. అసలు నీకు ప్రతిపక్షహోదా ఎందుకు ఇవ్వాలి జగన్.. నీకు ఏం అర్హత ఉంది. జగన్ మినహా మిగిలిన వైసీపీ 10 మంది ఎమ్మెల్యేలకు 8,93,333ఓట్లు 2024 ఎన్నికల్లో వచ్చాయి . 8.93లక్షల మంది ప్రజల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాల్సిన బాధ్యత వైసీపీ ఎమ్మెల్యేలకు లేదా’’ అంటూ ఆనం మండిపడ్డారు.
Andhrapradesh: ‘‘2020 నుంచి ఐపాక్ టీం కంటెంట్ ఇస్తే తమలాంటి వాళ్ళు ఫేస్బుక్లో పోస్ట్ చేసేవాళ్లం. జగనే కావాలి, జగనన్న రావాలి యాప్‌లో పోస్టులు చేసేవాళ్ళం. ఎన్నికలకు ముందు నుంచి వైసీపీకి వ్యతిరేకంగా టీవీ చానల్స్ డిబేట్లో మాట్లాడే వారిని లక్ష్యంగా చేసుకునే వాళ్ళం’’ రిమాండ్ రిపోర్టులో వర్రా రవీందర్ రెడ్డి తెలిపారు.
Andhrapradesh: ‘‘ఇప్పుడు ఎవరు ఏ సబ్జెక్టు మాట్లాడుతున్నారో నేను కూడా నోట్ చేసుకుంటున్నా. కేంద్ర బడ్జెట్లో కూడా ఏ విధమైన నిధుల కేటాయింపులు ఉన్నాయో స్టడీ చేసుకుంటే ఎమ్మెల్యేలకు ఉపయోగపడుతుంది. పని చేయాలన్న ఆసక్తి మీలో ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. సభలో ప్రతిపక్షం లేదు కదా మనకేముంది అని అనుకోవద్దు’’
Telangana: వైఎస్సార్పీపీ సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులు, పోలీసుల చిత్రహింసలపై ఎన్హెచ్ఆర్సీకి ఆ పార్టీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా నిర్బంధిస్తున్నారని తెలిపారు. యాక్టివిస్టులను కస్టోడియల్ టార్చర్ చేస్తున్నారని.. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు పోలీసులు తూట్లు పొడుస్తున్నారని అన్నారు.
Andhrapradesh: ‘‘నేను 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా, ఇంకా నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు మొదటి సారి ఎమ్మెల్యేలైన వారికి ఈ వర్క్ షాప్ ఎంతో ఉపయోగపడుతుంది. అసెంబ్లీ రూల్స్ ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు తెలియాలి. సభలో ఏమి చేయాలో, ఏమి చేయకూడదో తెలుసుకోవాలి’’..
Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సీఎం హోదా అయినా, ప్రతిపక్ష హోదా అయినా ప్రజలే ఇవ్వాలి. గతంలో సీఎం హోదా ఇస్తే అడ్డగోలుగా పాలన చేశారు. నీ దెబ్బకి నీకు ప్రతిపక్ష హోదా కూడా దండగ అనే ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేశారు...
Andhrapradesh: రాజకీయాలతో సంబంధం లేని మహిళలపై కూడా పోస్టులు పెట్టారని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ మండిపడ్డారు. సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆనాడు కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్న జాషువా తెలుగుదేశం పార్టీ నాయకులపై అన్యాయంగా కేసులు పెట్టారని ఆరోపించారు.
పటమటలంకకు చెందిన ఓ వ్యక్తికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి ఇంగ్లీష్‌లో మాట్లాడాడు. ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. ‘మీ ఫోన్ నెంబర్ నుంచి అనేక మందికి వేధింపులు జరుగుతున్నాయి. దీనిపై అంథేరి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి.’ అని చెప్పాడు. దీనికి ఇవతలి వ్యక్తి కంగారు పడ్డాడు. ఇంగ్లీష్‌పై పట్టున్న ఈయన తాను ఎలాంటి వేధింపులు చేయలేదని చెప్పాడు. ఎఫ్ఐఆర్ నెంబర్లు చెప్పాలని అడిగాడు. లైన్లో ఉంటే పోలీసులకు కలుపుతామని చెప్పి ఆ ఫోన్‌ను మరొకరికి కలిపాడు. కేసులు నమోదయ్యాయని చెబుతూ ఎఫ్ఐఆర్ నెంబర్లు తెలిపాడు. వెంటనే మళ్లీ ముందుగా ఫోన్లో మాట్లాడిన వ్యక్తి కేసు లేకుండా చేస్తామని భరోసా ఇచ్చాడు. తాము చెప్పినట్టు చేయకపోతే సిమ్ బ్లాక్ అయిపోతుందని బెదిరించాడు. ఇక్కడి వ్యక్తి పోలీస్‌స్టేషన్‌కు వెళ్తానని చెప్పడంతో అవతలి వ్యక్తి వెంటనే ఫోన్ కట్ చేశాడు. మళ్లీ ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వచ్చింది. ఇది తాజాగా జరిగిన ఘటన. తక్కువ పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని తెలియజేసే వీడియో లింక్ సూర్యారావుపేటలో ఉంటున్న ఒక వ్యక్తి ఫోన్‌కు వచ్చింది. ఆ వ్యక్తి వెంటనే సైబర్ క్రైం పోలీసుల వద్దకు వెళ్లాడు. వచ్చిన వీడియోను పోలీసులకు చూపించాడు. ఇదంతా ఒక మోసమని చెప్పిన పోలీసులు అతనికి ఓ అవగాహన కల్పించారు. ఇంతవరకు బాగానే ఉంది. తర్వాత కొద్దిరోజులకు ఆయన ఫోన్‌కు వాట్సాప్‌లో ఒక నోటీసు వచ్చింది. కాసేపటికి వీడియో కాల్ వచ్చింది. విదేశాలకు పంపే పార్శిల్లో డ్రగ్స్ ఉన్నాయని, ముంబై పోలీసులు పట్టుకున్నారని ఫోన్ చేసిన వ్యక్తి చెప్పాడు. ఎలాంటి విచారణ లేకుండా ఉండాలంటే తాను చెప్పినట్టు చేయాలన్నాడు. అతను చెప్పినట్టు డబ్బు పంపాడు. ఈవిధంగా రూ.10 లక్షల వరకు కోల్పోయాడు. ఒక కేసులో త్రుటిలో తప్పించుకున్న ఆయన డిజిటల్ అరెస్టులో మాత్రం ఇరుక్కుపోయాడు. ఇన్నాళ్లూ వన్‌టైమ్ పాస్‌వర్డ్‌లతో రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు... ఇప్పుడు డిజిటల్ అరెస్టులపై పడ్డారు. కేసులు, నోటీసుల పేరుచెప్పి రూ.లక్షల్లో కాజేస్తున్న ఘటనలు ఇప్పుడు నగరంలో ఎక్కువగా జరుగుతున్నాయి.
ఆవిరైన ఆశలకు ఊపిరిపోశారు. అమరావతి అభివృద్ధికి మళ్లీ బీజం వేశారు. ఐదేళ్ల తర్వాత కలలను సాకారం చేస్తూ సోమవారం అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఉమ్మడి కృష్ణాజిల్లావాసుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బందరు పోర్టు, గన్నవరం విమానాశ్రయం, అమరావతి మెట్రో.. వంటి కీలక ప్రాజెక్టులకు కేటాయింపులు శుభపరిణామాలుగా పేర్కొంటున్నారు. ఇక బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అమరావతి అవుటర్ రింగురోడ్డు అవసరాన్ని తెలియజేయడం మరో ముఖ్యమైన అంశంగా చెబుతున్నారు. - (విజయవాడ-ఆంధ్రజ్యోతి)