Share News

Bhanuprakash: అసెంబ్లీకి జగన్ గైర్హాజరుపై భానుప్రకాష్ సంచలన కామెంట్స్

ABN , Publish Date - Nov 12 , 2024 | 11:54 AM

Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సీఎం హోదా అయినా, ప్రతిపక్ష హోదా అయినా ప్రజలే ఇవ్వాలి. గతంలో సీఎం హోదా ఇస్తే అడ్డగోలుగా పాలన చేశారు. నీ దెబ్బకి నీకు ప్రతిపక్ష హోదా కూడా దండగ అనే ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేశారు...

Bhanuprakash: అసెంబ్లీకి జగన్ గైర్హాజరుపై భానుప్రకాష్ సంచలన కామెంట్స్
TTD board members Bhanu Prakash Reddy

అమరావతి, నవంబర్ 12: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి (Former CM YS Jagan) నిన్న జరిగిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు గైర్హాజరైన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి (TTD board member Bhanu Prakash Reddy ) స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటున్న జగన్‌కు నియమ నిబంధనలు తెలుసా అని ప్రశ్నించారు. సీఎం హోదా అయినా, ప్రతిపక్ష హోదా అయినా ప్రజలే ఇవ్వాలన్నారు.

BRS: పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది: కేటీఆర్



‘‘గతంలో సీఎం హోదా ఇస్తే అడ్డగోలుగా పాలన చేశారు. నీ దెబ్బకి నీకు ప్రతిపక్ష హోదా కూడా దండగ అనే ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇప్పుడు జగన్ కేవలం పులువెందుల ఎమ్మెల్యే మాత్రమే. అసెంబ్లీకి వెళ్లి పులివెందుల సమస్యలు మాట్లాడాలని జగన్‌ను అక్కడి ప్రజలే డిమాండ్ చేయాలి. ప్రజలు బుద్ధి చెప్పినా ... ‌ఇంకా ఈగోతో అసెంబ్లీకి వెళ్లను అంటాడా. అసెంబ్లీ మీద గౌరవం ఉంటే జగన్ అసెంబ్లీకి వెళ్లాలి’’ అని డిమాండ్ చేశారు.


ఆ పోస్టులను ప్రోత్సహించింది జగనే..

గత ఐదేళ్లల్లో సోషల్ మీడియా పోస్టులను ప్రోత్సహించింది జగన్ కాదా అని ప్రశ్నించారు. అసభ్య పోస్ట్‌లు, వీడియోలు పెట్టినా జగన్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. అడ్డుకోవాల్సిన వైసీపీ పెద్దలు .. నీచమైన పోస్ట్‌లను ప్రోత్సహించారని మండిపడ్డారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చట్ట పరంగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇంట్లో మహిళలను దూషించినా జగన్ ఎందుకు ఆపలేదని అడిగారు. ఇప్పుడు మొసలి‌కన్నీరు కారిస్తే సరిపోతుందా అంటూ దుయ్యబట్టారు. ఐపీఎస్‌లను కూడా రాజకీయ నాయకులుగా మార్చి పని చేయించిన ఘనుడు జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆనాడు అడ్డగోలుగా పోస్ట్‌లు పెట్టిన వారిపైనా, ప్రోత్సాహించిన వారిపైనా చట్టపరంగా చర్యలు ఉంటాయని భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు.

KTR: రేవంత్ నిన్ను వదలను.. ఢిల్లీలో కేటీఆర్ సవాల్



భాను ప్రకాష్ ఘన సత్కారం

కాగా.. టీటీడీ బోర్డు సభ్యుని హోదాలో విజయవాడ బీజేపీ కార్యాలయానికి వచ్చిన భానుప్రకాష్ రెడ్డిని.. షేక్ బాజీ, పాతూరి నాగభూషణం, అడ్డూరి శ్రీరామ్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భాను ప్రకాష్ మాట్లాడుతూ.. ప్రపంచంలో అతి పెద్ద ధార్మిక క్షేత్రం వెంకన్న తిరుమల ఆలయమన్నారు. ఆ వెంకన్న స్వామికి సేవ చేసే అవకాశం కల్పించిన కూటమి పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ‘‘నామీద నమ్మకంతో నాకు ఈ‌ బాధ్యత అప్పగించారు. గతంలో ఒకసారి కూడా ఇలాగే ఆ స్వామికి‌ సేవ చేసుకున్నా. ఏపీలో ఆలయాలకు మంచి రోజులు వచ్చాయి. గత ఐదేళ్లల్లో ఆలయాలు, విగ్రహాలు విధ్వంసం జరిగింది. తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. నిబంధనలు కు విరుద్ధంగా 81 మందితో జగన్ కమిటీ వేశారు. ఆనాడు మా పార్టీ పెద్దల సహకారంతో కోర్టును ఆశ్రయించాను. ఆ తరువాత ఆ కమిటీ సభ్యులను తగ్గించారు. ధర్మకర్తల మండలి సమావేశం వివరాలు ఆన్ లైన్‌లో పెట్టలేదు. ధార్మిక క్షేత్రాన్ని జగన్ ధనార్జన ‌క్షేత్రంగా మార్చుకున్నారు. ఎనిమిది సార్లు గత ప్రభుత్వం నిర్ణయాలపై మేము కోర్టుకు వెళ్లాం. ఆలయ ఆస్తలును దోచుకున్న వాటిని కక్కించబోతున్నాం. వడ్డీ కాసుల వాడి సొమ్మును తిరిగి రాబడతాం. భవిష్యత్తులో తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయి. రాజులు ఇచ్చిన మాన్యాలు కూడా గత ప్రభుత్వంలో దోచుకున్నారు. దేశంలో ఎక్కడా ఈ తరహా దోపిడీ జరగలేదు. అన్యమతస్తులు ఎవరూ తిరుమలలో పని చేయడానికి వీలు లేదు. స్వామి ప్రసాదం తీసుకోని‌వారికి పని‌చేసే అర్హత కూడా లేదు. స్వామి వారిని నమ్మని వారి సేవలు మాకు అవసరం లేదు. తిరుమల లో ఉన్న అన్య మతస్తులు వేరే విభాగాలకు వెళ్లిపోండి. ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇదే అంశం ప్రస్తావిస్తే జగన్ ఆయన్ను మార్చేశారు’’ అని తెలిపారు.


ఇకపై కొండపై అలా చేశారో.. జాగ్రత్త

‘‘కూటమి ప్రభుత్వం లో హిందూ ధర్మ పరిరక్షణకు సంకల్పం తీసుకున్నాం. సాలి గ్రామ స్వరూపం తిరుమలగా చెబుతారు. కొండకు వచ్చిన ఒక మాజీ మంత్రి జగన్ బొమ్మ పెట్టుకుని రావడం సిగ్గు చేటు. ఇక నుంచి పూర్తి ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుమల ఉండాలి. ఏ రాజకీయ నాయకుడు అయినా తిరుమల పవిత్రను కాపాడాలి. ఇటీవల స్వామి వారి దర్శనం చేసి.. జగన్ కళ్లల్లో అనందం‌ కోసం రాజకీయ విమర్శలు చేయడం అలవాటు గా మారింది. ఇక నుంచి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే చర్యలు ఉంటాయి. అన్యమతస్తులు దర్శనం కోసం వస్తే డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. సీఎంగా జగన్ వచ్చినప్పుడు మాత్రమే హైకోర్టు డిక్లరేషన్ అడగలేదు. ఇతర హోదాల్లో జగన్ వచ్చినా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. ఇక నుంచి కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. తిరుమలలో గతంలొ అనేక అక్రమాలు జరిగాయి. గత పాలక మండలిలొ ఘోరమైన అపచారాలు చేశారు. వాటిని త్వరలో అన్నీ బయట పెడతాం. తిరుమల వచ్చే వారికి వెంకన్న దర్శనం‌ మంచిగా అయ్యేలా చేస్తాం. జీర్ణోద్ధరణ కోసం‌ కొన్ని ఆలయాలను ఎంపిక చేసి సహకారం అందిస్తాం. పాలక మండలి సమావేశంలో తిరుమల అభివృద్ధికి మంచి నిర్ణయాలను చేస్తాం’’ అని భాను ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

Cybercriminals: సైబర్‌ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ.. కాజేసిన డబ్బు అమాయకుల ఖాతాలకు..

BRS: పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది: కేటీఆర్

Read Latest AP News And Telangana News

Updated Date - Nov 12 , 2024 | 01:51 PM