Home » Andhra Pradesh » Krishna
సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్ ధర్నాచౌక్ వద్ద సోమవారం ఆశ వర్కర్లు ధర్నా చేశారు.
అవనిగడ్డ వంతెన సెంటర్ నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, అవనిగడ్డ డీఎస్పీ మురళీధర్‌కు వైసీపీ సోషల్ మీడియా సైకోలపై టీడీపీ, జనసేన నేతలు ఫిర్యాదు చేశారు.
రెండు దిక్కుల్లో సముద్రం. మిగిలిన రెండు దిక్కుల్లో కృష్ణానది, నడుమ ఉండే దీవే దివిసీమ. ప్రకృతి వైపరీత్యాలు, ఉప్పెన ముప్పులు, వరదలతో తరచూ ఈ ప్రాం తం తల్లడిల్లిపోతోంది. దివిసీమ ఉప్పెన అనంతరం సముద్రపు అలలు చెలియల కట్టు దాటి గ్రామాలపై పడకుండా రక్షణగా కరకట్టను పటిష్టపర్చి నది ద్వారా లోపలికి వచ్చే నీరు బయటకు పోయేలా, పోటు సమయాల్లో సముద్రపు నీరు లోపలికి రాకుండా అవుట్‌ఫాల్ స్లూయిస్‌లను ప్రభుత్వం నిర్మించింది. వరద నీరు గ్రామా ల్లోకి రాకుండా కృష్ణా కరకట్టను పటిష్ట పరిచింది. 1999లో చంద్రబాబు ప్రభుత్వం కృష్ణా కరకట్టలు పునర్నిర్మించింది. 2004 లో కాంగ్రెస్ ప్రభుత్వం సముద్రపు కరకట్ట ను పునర్నిర్మించింది. కృష్ణా కరకట్టలు కొంతమేర పటిష్టంగా ఉన్నప్పటికీ సము ద్రపు కరకట్టలు తీర ప్రాంత ప్రజలను తీవ్ర ఆందోళను గురి చేస్తున్నాయి. సముద్రపు కరకట్టల నిర్వహణను ప్రభుత్వాలు పట్టిం చుకోకపోవడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. వైసీపీ ప్రభుత్వం రూ.25 కోట్లతో కరకట్టలను పటిష్టపరుస్తామని ఉత్తుత్తి ప్రకటన చేసింది. రెండేళ్లకు కూడా డీపీఆర్‌లు తయారు చేయలేదు. కరకట్టలు పటిష్టపర్చాలంటూ అప్పుడు మండలి బుద్ధ ప్రసాద్ నేతృత్వంలో నాటి ప్రతిపక్ష టీడీపీ కరకట్ట పొడవునా పాదయాత్ర చేసింది. ప్రతిపక్షంలో ఉన్న వారు అధికారంలోకి వచ్చారు. కానీ ఇంతవరకు కరకట్టల ఊసే తీయలేదు. అవుట్‌ఫాల్ స్లూయిస్ల ద్వారా సముద్రపు నీరు పొలాలను ముంచె త్తుతోంది.
చార్టెడ్ అకౌంటెన్సీ చదువుతున్న విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గడానికి, సృజనాత్మకత పెరగడానికి వైబ్రెన్స్ ఫెస్ట్ వంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని సదరన్ ఇండియా చార్టెడ్ అకౌంటెంట్స్ స్టూడెంట్స్ అసోసియేషన్ విజయవాడ చైర్మన్ వేమూరి వీర పవన్‌కుమార్ చెప్పారు.
బుడమేరు ఉగ్రరూపం దాలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో సెప్టెంబరులో వరదలు ప్రత్యక్షంగా చూపించాయి. కేవలం 100 కిలోమీటర్ల మేర ప్రవహించే బుడమేరు వల్ల విజయవాడ నగరం అతలాకుతలమైంది. దీనికి ప్రధాన కారణం ఆక్రమణలే. అంతటి విపత్తు నుంచి బయటపడినా అక్రమార్కుల్లో కనీస స్పందన లేదు. పైగా నగరవ్యాప్తంగా బుడమేరు వెంబడి ఆక్రమణలు పెరుగుతుండటం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది.
శ్రీ కృష్ణ పారిజాతం ప్రతిరూపకం భక్తి రస ప్రధానంగా రసవత్తరంగా సాగింది.
మహిళల భద్రతకు పెద్దపీట అని ఆర్భాటపు ప్రచారాలు తప్ప10 ఏళ్లలో ఏ ఒక్క నేరస్థుడికీ కఠిన శిక్ష పడలేదని వైఎస్ షర్మిల అన్నారు. కేసులు ఛేదించాల్సిన పోలీసులను కక్ష్యసాధింపు రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తర సమయం కొనసాగుతోంది. మంత్రి అనగాని సత్య ప్రసాద్ మాట్లాడుతూ.. నిరుపయోగంగా ఉన్న భూమలును పేదలకు అసైన్డ్ చేసిందని, గత ప్రభుత్వం ఎన్నికలకు ఆరు నెలల ముందు నిషిద్ద 22 ఏ నుండి 9 లక్షలకు పైచిలుకు తొలగించాలని చూసారన్నారు.
ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, బెస్ట్ ఫిజిక్ పోటీల్లో కేబీఎన్ విద్యార్థులు ప్రతిభ కనబ రిచారు.
కారుకు బస్సు అడ్డం వచ్చిందని ఆర్టీసీ బస్సు డ్రైవర్ తో గొడవపడి దాడిచేసిన వ్యక్తులపై ఆదివారం కృష్ణ లంక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.