Home » Andhra Pradesh » Nellore
Nellore News: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు(AP Assembly Elections) సమయం దగ్గరపడుతోంది. రాష్ట్రంలో ఈసారి వైసీపీ(YCP) ఓటమి దాదాపు ఖాయం అని ప్రజల్లో గట్టి చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఈసారి తాను ఎలాగైనా గెలవాలనే ఉద్దేశ్యంతో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Kakani Govardhan Reddy) భారీ కుట్రకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి పరిశీలనలో అడ్డగోలు నియామకాల వ్యవహారం..
Andhrapradesh: ఏపీలో అభివృద్ధిపై అధికారపార్టీ వైసీపీ నేతలను ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్న విషయం తెలిసిందే. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులను సమస్యలపై మహిళలు, యువత ప్రశ్నిస్తూనే ఎందుకు వచ్చారంటూ నిలదీసిన సందర్భాలు ఎన్నో. కొందరు నేతలకు తమ సొంత నియోజకవర్గాల్లో కూడా ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదుర్కున్న విషయం తెలిసిందే.
నెల్లూరు జిల్లా: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రత్యేక హెలికాఫ్టర్‌లో హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లా రాపూరుకి వస్తారు.
‘జయ జయోస్తు’ అద్భుత గ్రంధాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ మాజీ సభ్యుడు, నెల్లూరు తెలుగుదేశం పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, ఆయన సతీమణి కోవూరు తెలుగుదేశం శాసన సభ అభ్యర్థి, టి.టి.డి. సలహామండలి చైర్ పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు ఆవిష్కరించడంతో అపురూప భక్తి సేవకు మరొకసారి నెల్లూరులో తెరలేచినట్లైంది
Andhrapradesh: జిల్లాలో అక్రమ క్వార్ట్జ్, ఇసుక, గ్రావెల్, మట్టి అక్రమాలపై మాజీ మంత్రి సోమిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం వీటికి సంబంధించిన ఆధారాలను మాజీ మంత్రి మీడియా ముందు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో యధేచ్ఛగా వేల కోట్ల క్వార్ట్జ్, ఇసుక, గ్రావెల్ దోచేస్తున్నారని.. అక్రమార్కులకు అధికారులు కొమ్ము కాయడం సిగ్గుచేటని మండిపడ్డారు.
నెల్లూరు: జిల్లాలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగలనుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి సిద్ధమయ్యారు. శుక్రవారం మరి కాసేపట్లో రాజీనామా ప్రకటన చేయునున్నట్లు సమాచారం.
నెల్లూరు: జిల్లాలో వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది. ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున చీరలు, క్రికెట్ కిట్లు పంపిణీ చేస్తున్నారు. ఎంపీలు విజయసాయి, ఆదాల కార్యక్రమాలకు సయితం నేతలు, కార్యకర్తలు ముఖం చాటేస్తున్నారు.
నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న గవర్నర్ అబ్దుల్ నజీర్.. బుధవారం బిజీ బిజీగా గడిపారు. జిల్లాలోని కస్తూర్బా కళా క్షేత్రంలో పీఎం సూరజ్ జాతీయ పోర్టల్‌ని ప్రారంభించారు.
నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్ డిపార్ట్మెంటులో వందల కోట్లు అవినీతి జరిగిందని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్ది తెలిపారు. ఒక్క సర్వేపల్లిలోనే రూ.300 కోట్లు పనులు చేయకుండానే డబ్బులు డ్రా చేశారన్నారు. సెంట్రల్ డివిజన్ నుంచి శ్రీధర్ ఇంజనీరింగ్ కంపెనీకి కట్టబెట్టారన్నారు.
Andhrapradesh: రాష్ట్రంలో వైసీపీ నేతల అరాచకాలు రోజు రోజుకు శృతిమించిపోతున్నాయి. తాజాగా జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలోని పోతిరెడ్డిపాళెం తిప్ప ప్రాంతంలో మంచినీటి ప్లాంటుకి విద్యుత్తును కట్ చేయించారు వైసీపీ నేతలు. ఎంపీ వీపీఆర్ గతంలో తన సొంత నిధులతో ప్లాంటు ఏర్పాటు చేశారు. అయితే ప్లాంట్‌కు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తాగునీటి కోసం 300 గిరిజన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.