Share News

Beeda Ravichandra: వైసీపీని ఇంటికి పంపించాలనే లక్ష్యంతోనే..

ABN , Publish Date - May 15 , 2024 | 02:20 PM

Andhrapradesh: ఏపీలో ఎన్నికలు ఉద్రిక్తతల నడుమ సాగాయి. అనేక ప్రాంతాల్లో వైసీపీ నేతలు బరితెగించి ప్రవర్తించారు. టీడీపీ ఏజెంట్లపై దాడులు, కిడ్నాప్‌లు ఇలా రకరకాలుగా బెదిరింపు చర్యలు పాల్పడ్డారు అధికారపార్టీ నేతలు. పోలింగ్ ముగిసి మూడు రోజులు గడుస్తున్నప్పటికీ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.

Beeda Ravichandra: వైసీపీని ఇంటికి పంపించాలనే లక్ష్యంతోనే..
TDP Leader beeda Ravichandra

నెల్లూరు, మే 15: ఏపీలో ఎన్నికలు (AP Elections 2024) ఉద్రిక్తతల నడుమ సాగాయి. అనేక ప్రాంతాల్లో వైసీపీ నేతలు (YSRCP Leaders) బరితెగించి ప్రవర్తించారు. టీడీపీ (TDP) ఏజెంట్లపై దాడులు, కిడ్నాప్‌లు ఇలా రకరకాలుగా బెదిరింపు చర్యలు పాల్పడ్డారు అధికారపార్టీ నేతలు. పోలింగ్ ముగిసి మూడు రోజులు గడుస్తున్నప్పటికీ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. పోలింగ్ రోజు జరిగిన ఘటనలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర (TDP Leader Beeda Ravichandra) స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్ల వైసీపీ‌ పాలనలో అరాచకాలు, వేధింపులు, దౌర్జన్యాలు సాగించారని మండిపడ్డారు.

AP Elections 2024: ఏపీలో 81.6 శాతం పోలింగ్: సీఈవో ముఖేశ్ కుమార్ మీనా


ఏపీలో విచిత్రపోకడ కనిపించిందన్నారు. గత మూడు నెలలుగా వైసీపీ శ్రేణులు ఓటర్లని దాడులు, బెదిరింపులతో భయపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల‌ పోలింగ్ రోజున నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, పల్నాడు ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలపై అమానుషంగా దాడులు చేశారన్నారు. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని విమర్శించారు. అభ్యర్ధులపై కూడా దాడులకు తెగపడ్డారన్నారు. ఓటర్లు కసిగా ఓటేశారని తెలిపారు. వైసీపీని ఇంటికి పంపించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రజలు ఓట్లు వేశారని బీద రవిచంద్ర పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

AP Elections: అంతలోనే మాట మారింది..?

TS News: కామారెడ్డి డీఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు

Read Latest AP News And Telugu News

Updated Date - May 15 , 2024 | 02:38 PM