Share News

Andhra Pradesh: అబ్బా.. ఏం ప్లాన్ చేసిర్రా.. చివర్లో పోలీసుల ట్విస్ట్ అదుర్స్..!?

ABN , Publish Date - May 30 , 2024 | 08:25 PM

నెల్లూరు, మే 30: సినిమాల ప్రభావమో.. దిమాక్‌కు జరంత ఎక్కువ పని చెప్పారో తెలియదు గానీ.. భారీగా నగదు, బంగారం బిస్కెట్లు తరలించేందుకు పెద్ద ప్లానే వేశారు కొందరు దుండగులు. కానీ.. పోలీసులు ఊరుకుంటేనా? ఛాన్సే లే.. అడ్డంగా దొరకబట్టారు. వారి వద్ద ఉన్న బంగారం, నగదుతో పాటు..

Andhra Pradesh: అబ్బా.. ఏం ప్లాన్ చేసిర్రా.. చివర్లో పోలీసుల ట్విస్ట్ అదుర్స్..!?
Andhra Pradesh

నెల్లూరు, మే 30: సినిమాల ప్రభావమో.. దిమాక్‌కు జరంత ఎక్కువ పని చెప్పారో తెలియదు గానీ.. భారీగా నగదు, బంగారం బిస్కెట్లు తరలించేందుకు పెద్ద ప్లానే వేశారు కొందరు దుండగులు. కానీ.. పోలీసులు ఊరుకుంటేనా? ఛాన్సే లే.. అడ్డంగా దొరకబట్టారు. వారి వద్ద ఉన్న బంగారం, నగదుతో పాటు.. వారు ఉపయోగించిన కారును కూడా సీజ్ చేశారు. మరి ఆ అతి తెలివి చూపిన ఆ కేటుగాళ్లు ఎవరు? వాళ్లు వేసిన ప్లాన్ ఏంది? పోలీసులు వారిని ఎలా గుర్తించారు? ఇదంతా ఎక్కడ జరిగింది? అనే ఇంట్రస్టింగ్ వివరాలు తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందేమరి.


నెల్లూరు జిల్లా కావలిలో భారీ మొత్తంలో నగదు, బంగారం పట్టుబడింది. ముసునూరు టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో ఓ బస్సును తనిఖీ చేయగా.. కొందరు మహిళల వద్ద లెక్కలు చూపని రూ. 1,61,49,500 నగదు పట్టుబడింది. ఆ కాసేపటికే అటువైపు నుంచి మరో కారు రాగా.. వారిని తనిఖీ చేశారు. ఆ కారులో 1497.410 గ్రాముల బంగారం బిస్కెట్లు పట్టుబడ్డాయి. వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.


ఐదుగురు మహిళలు తెలంగాణలోని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుంచి చెన్నైకి వెళ్తున్నారు. నిందితులు తిప్పన సుమతి, ఎర్రడ్ల తేజశ్రీ, షేక్ పర్వీన్, దూరి యాదమ్మ, బంటు శిమ్మల నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరు చెన్నైలో బంగారం కొనేందుకు వెళ్తున్నట్లు పోలీసులకు తెలిపారు. అయితే, కారులోని నిందితులు చెన్నైలో బంగారం కొనుగోలు చేసి మిర్యాలగూడకు వెళ్తున్నారు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడగా.. బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బిట్రా మోహన్ కుమార్, పగిళ్ల ప్రభాకర్‌గా గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 30 , 2024 | 08:25 PM