Home » Andhra Pradesh » Nellore
ఆత్మకూరు జిల్లా ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ హరినారాయణన్ అధికారులను ఆదేశించారు.
ఐటీడీఏ పీవోపై విచారణ జరిపించాలని కోరుతూ యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.
జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చే అర్జీలకు తక్షణ పరిష్కారం చూపాలని కలెక్టర్ హరినారాయణన్ అధికారులను ఆదేశించారు.
మాజీ మంత్రి నారాయణ అనుచరుల ఇళ్లపై వరసగా పోలీసులు దాడులు చేస్తున్నారు. భారీ సంఖ్యలో పోలీసులు చుట్టుముట్టి మరీ సోదాలు నిర్వహిస్తున్నారు. మహిళా నేత ముప్పాళ్ల విజేతరెడ్డి ఇంట్లో రెండు గంటలపాటు పోలీసులు జల్లెడ పట్టారు. రూ.20వేలు మాత్రమే ఉండటంతో చేసేదేమిలేక వెనుదిరిగారు. విజేత ఇంటి వద్దకి వెనువెంటనే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేరుకున్నారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ విధానాలతో ప్రజల్లోనే కాదు, వైసీపీ కార్యకర్తల్లోనే తిరుగుబాటు మొదలైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత మాట్లాడుతూ.. వెయ్యికి వెయ్యి శాతం టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి టీడీపీలోకి రావడం శుభపరిణామమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. నేడు నెల్లూరు సభలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో సంపాదించాలని, దుర్మార్గపు పనులు చేయాలనే ఆలోచన వారికి లేదన్నారు. వీపీఆర్ లాంటి వారు రాజకీయాల్లో ఉండటం అవసరమన్నారు.
Andhrapradesh: ఎన్నికల ముందు అధికార పార్టీ వైఎస్సార్సీపీకి జిల్లాలో భారీ షాక్ తగిలింది. వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరారు. శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో వేమిరెడ్డి దంపతులు తెలుగు దేశం పార్టీ కండువా కప్పుకున్నారు. వేమిరెడ్డితో పాటు వైసీపీ నేతలు టీడీపీలో భారీగా చేరారు.
జిల్లాలో ఓ వైసీపీ(YSRCP) ఎమ్మెల్యే మరోసారి రెచ్చిపోయారు. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా అధికార వైసీపీ పలు కుయుక్తులు పన్నుతోంది. కుట్రలో భాగంగా వైసీపీ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి(Mla Pratapkumar Reddy) అరాచకాలు సృష్టిస్తున్నారు.
అమరావతి: ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జోరుగా పర్యటిస్తున్నారు. ‘రా కదలి రా’ సభల ద్వారా మేనిఫేస్టోలోని అంశాలను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. ఈ క్రమంలోనే మార్చి 2న నెల్లూరు, గురజాలలో.. 4న రాప్తాడులో పర్యటించనున్నారు.
నెల్లూరు: నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ రాజీనామా చేశారు. ఆయనతోపాటు నలుగురు కార్పొరేటర్లు, మైనార్టీ నాయకులు, సీనియర్ నాయకులు వైసీపీకి రాజీనామా చేశారు.