Bhuvaneshwari: శ్రామిక మహిళలతో భువనేశ్వరి మాటామంతి
ABN , Publish Date - Mar 23 , 2024 | 10:54 AM
Andhrapradesh: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణ భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా శనివారం ఉదయం గూడూరు ఏ-5 కన్వెన్షన్‌లో నిర్వహించిన మహిళాశక్తి సమావేశంలో భువనేశ్వరి పాల్గొన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ చేపట్టారు.
నెల్లూరు, మార్చి 23: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (TDP Chief Nara Chandrababu) సతీమణ భువనేశ్వరి (Nara Bhuvaneshwari) ‘‘నిజం గెలవాలి’’ (Nijam Gelavali) పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా శనివారం ఉదయం గూడూరు ఏ-5 కన్వెన్షన్‌లో నిర్వహించిన మహిళాశక్తి సమావేశంలో భువనేశ్వరి పాల్గొన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ చేపట్టారు. ఏ-5 కన్వెన్షన్‌కు శ్రామిక మహిళలు భారీగా చేరుకున్నారు. అసంఘటిత రంగంలో పనిచేసే శ్రామిక మహిళలతో భువనేశ్వరి మాటామంతి నిర్వహించారు.
Nellore: ఎన్నికల్లో గెలుపు కోసం మంత్రి జిమ్మిక్కులు.. బయటపడ్డ భారీ కుట్ర..!
అలాంటి ఇళ్లు సుఖసంతోషాలతో ఉంటాయ్: పనబాక
మహిళా శక్తి కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి మాట్లాడుతూ.. మహిళలను గౌరవించే ఇల్లు, సమాజం సుఖ సంతోషాలతో ఉంటుందన్నారు. మహిళలను తమ కాళ్లపై తాము నిలబడేలా చేసిన వ్యక్తి, దార్శనీకుడు చంద్రబాబు అని కొనియాడారు. మహిళలకు మరింత బలాన్ని చేకూర్చేందుకు అనేక సంక్షేమ పథకాలని చంద్రబాబు అమలు చేశారని గుర్తుచేశారు. సూపర్ సిక్స్ పథకాలతో పేదింటి మహిళలు సంతోషంగా ఉండాలని చంద్రబాబు సంకల్పించారన్నారు. చంద్రబాబు సీఎం అయితేనే మహిళలకు రక్షణ, సంక్షేమం లభిస్తుందని పనబాక పేర్కొన్నారు.
MLC Kavitha: ఈడీ కార్యాలయంలో కవితను కలిసిన కుమారుడు ఆర్య..
భువనమ్మ ప్రేమ, అభిమానం వెలకట్టలేనిది: పంచుమర్తి
ఒక్కఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన రాక్షస ప్రభుత్వం రాష్ట్రాన్ని పీక్కుతింటుందని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ విమర్శలు గుప్పించారు. మహిళా శక్తి సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలని ప్రశ్నించినందుకే చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. సొంత బాబాయిని చంపేసిన వారి పాలనలో భువనమ్మ ధైర్యంగా బయటకొచ్చి పార్టీ కుటుంబసభ్యులని ఓదారుస్తున్నారన్నారు. టీడీపీ కార్యకర్తల పట్ల భువనమ్మకి ఉన్న ప్రేమ, అభిమానం వెలకట్టలేనిదని వెల్లడించారు.
మరోవైపు వాకాడు మండలం తిరుమూరు, వెంకటాచలం మండలం పుంజులూరుపాడు, కులిచెర్లపాడులో భువనేశ్వరి నిజం గెలవారి యాత్ర కొనసాగనుంది. అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుతో తీవ్ర ఆవేదనకి గురై మృతిచెందిన వారి కుటుంబాలని భువనమ్మ పరామర్శిస్తున్నారు. టీడీపీ అండగా ఉంటుందంటూ భరోసా ఇస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
Viral Video: మరో రికార్డు బ్రేక్ చేసిన ఎంఎస్ ధోని
Kavitha: కవిత బంధువుల ఇళ్లల్లో సోదాలు ఎందుకు..?
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..