Nellore: రాష్ట్రాన్ని బాగు చేసే సరైన నాయకుడు చంద్రబాబు: భువనేశ్వరి
ABN , Publish Date - Mar 23 , 2024 | 03:14 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం(Andhra Pradesh) అభివృద్ధి చెందాలంటే సరైన నాయకుడు అవసరం అని, ఆ సరైన నాయకుడు చంద్రబాబేనని(Chandrababu) పేర్కొన్నారు నారా భువనేశ్వరి(Bhuvaneshwari). శనివారం నాడు నెల్లూరు(Nellore) జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా మహిళలతో భువనేశ్వరి ప్రత్యేకంగా మాట్లాడారు.
నెల్లూరు, మార్చి 23: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం(Andhra Pradesh) అభివృద్ధి చెందాలంటే సరైన నాయకుడు అవసరం అని, ఆ సరైన నాయకుడు చంద్రబాబేనని(Chandrababu) పేర్కొన్నారు నారా భువనేశ్వరి(Bhuvaneshwari). శనివారం నాడు నెల్లూరు(Nellore) జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా మహిళలతో భువనేశ్వరి ప్రత్యేకంగా మాట్లాడారు. మహిళలు, రాష్ట్రంలో ప్రజలు అనుభవిస్తున్న కష్టాలపై ఆందోళన వ్యక్తం చేశారు. నారా భువనేశ్వరి కామెంట్స్.. ‘మీలో ఒక మహిళగా మీ బాధల్లో పాలుపంచుకోవడానికి వచ్చాను. మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడటం వారికి గౌరవం. నేను హెరిటేజ్ డైరీ భాద్యతలు తీసుకున్న తరువాత కొన్ని తప్పులు చేశాను. తప్పుల్లో నుంచి పాఠాలు నేర్చుకున్నాను. మహిళలు స్వేచ్ఛ కోసం ముందుకెళ్లాలి. కార్మికుల చమటతోనే పుట్టింది తెలుగు దేశం పార్టీ.
నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటడం వల్ల కార్మికులే అధికంగా ఇబ్బంది పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం కల్తీ మద్యం తీసుకొచ్చి పేదల జీవితంతో ఆడుకుంటోంది. లక్షల మంది రోజువారి కార్మికులు గత ఐదేళ్లగా ఉపాధి అవకాశలు లేక కష్టపడుతున్నారు. తెలుగు దేశం ప్రభుత్వం హయాంలో ఇరవై లక్షల మంది రోజు వారి కూలీలకి ఉపాధి కల్పించింది. ఈ ఇదేళ్ల కాలంలో 13,500 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. త్వరలో మన ప్రభుత్వం వస్తుంది.’ అని అన్నారు.
సరైన నాయకుడు చంద్రబాబు..
‘ప్రతి వర్గం గురించి ఆలోచించే వ్యక్తి చంద్రబాబు. మంచి సంక్షేమ పథకాలతో చంద్రబాబు మనకు అండగా నిలుస్తారు. రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్లాలి అంటే సరైన నాయకుడు అవసరం. చంద్రబాబుకు పని చేయడమంటేనే ఇష్టం. నిజం గెలవాలి కార్యక్రమం చేపట్టిన తరువాతే ప్రజల కోసం చంద్రబాబు పడుతున్న కష్టం నాకు తెలిసింది. ఆంధ్రుడిని అని చెప్పుకునేందుకు గతంలో గర్వపడే వాళ్లం.. నేడు తలదించుకోవాల్సి వచ్చింది. రాష్ట్రాన్ని డ్రగ్స్, గంజాయి ఆంధ్రాగా మార్చారు. విశాఖపట్నంలో లక్షల కోట్లు విలువ చేసే డ్రగ్స్ పట్టుకున్నారు. తప్పు చేయాలి అంటే బయపడే రోజులు పోయాయి. రాష్ట్రం, దేశం కోసం మహిళలు బయటకు వచ్చి ఓటు వేయాలి. మనం శాశ్వతం కాదు. మనం చేసే పనులు శాశ్వతం అని విశ్వసించే నాయకుడు చంద్రబాబు. రాష్ట్రంలో అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరం చేయి చేయి కలపాలి. స్వతంత్ర పోరాట స్ఫూర్తిని మనలో ఇనుమడింపజేసుకోవాలి.’ అని మహిళలకు పిలుపునిచ్చారు నారా భువనేశ్వరి.
మహిళల కామెంట్స్..
ఇదే సమయంలో పలువురు మహిళలు వైసీపీ పాలనలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను, పడుతున్న కష్టాల గురించి చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘చంద్రబాబు ప్రభుత్వంలో నిత్యావసర ధరలు పెరగలేదు. సంక్షేమం అందింది. జగన్ ప్రభుత్వంలో పది రూపాయిలు ఇచ్చి, వంద రూపాయలు లాక్కున్నాడు. ఉపాధి లేక కష్టాలు పడుతున్నాం. సహజ సంపదలు దోపిడితో రోడ్లు ధ్వంసం అయ్యాయి. రోడ్లలో ప్రయాణం అంటే భయమేస్తుంది. ఇసుక పనులకి వెళ్తుంటాం. మూడు నెలలు పనుంటుంది. మిగిలిన రోజులు ఉపాధి లేక కష్టపడుతున్నాం.’ అని నారా భువనేశ్వరికి మహిళలు తమ కష్టాలను చెప్పుకున్నారు.