Home » Andhra Pradesh » Nellore
Andhrapradesh: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. వాలంటీర్లలోనూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనపడుతోంది. కావలిలో టీడీపీ అభ్యర్ధి కావ్యా కృష్ణారెడ్డికి నలుగురు వాలంటీర్లు మద్దతు తెలిపారు. అయితే విషయం తెలిసిన అధికారులు.. వారిపై చర్యలకు రంగం సిద్ధం చేశారు.
ల్లూరు జిల్లా: జగన్ ప్రభుత్వం అరాచకాలు నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్నాయి. జిల్లాలో వైసీపీ మొత్తం ఖాళీ అవుతూ ఉండటంతో సర్కార్ టీడీపీ నేతలను టార్గెట్ చేసింది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్య అనుచరుడు హజరత్ నాయుడుపై అక్రమ కేసు బనాయించింది.
ప్రభుత్వాలు అభివృద్ధిని విస్మరించి ఓటర్లకు నేరుగా డబ్బులు ఇస్తే చాలు అనుకుంటున్నాయని మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు.
నగరంలోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘స్పందన’కు జిల్లా వ్యాప్తంగా 95 మంది ప్రజలు వచ్చి తమ సమస్యలపై ఎస్పీ డాక్టర్ కె తిరుమలేశ్వరరెడ్డికి ఫిర్యాదులు అందజేశారు.
విద్యుత్ సంస్థ మనుగడ, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో విద్యుత్ సిబ్బంది సేవలు ఎంతో కీలకమని విద్యుత్‌శాఖ ఎస్ఈ విజియన్ పేర్కొన్నారు.
ఆత్మకూరు జిల్లా ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ హరినారాయణన్ అధికారులను ఆదేశించారు.
ఐటీడీఏ పీవోపై విచారణ జరిపించాలని కోరుతూ యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.
జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చే అర్జీలకు తక్షణ పరిష్కారం చూపాలని కలెక్టర్ హరినారాయణన్ అధికారులను ఆదేశించారు.
మాజీ మంత్రి నారాయణ అనుచరుల ఇళ్లపై వరసగా పోలీసులు దాడులు చేస్తున్నారు. భారీ సంఖ్యలో పోలీసులు చుట్టుముట్టి మరీ సోదాలు నిర్వహిస్తున్నారు. మహిళా నేత ముప్పాళ్ల విజేతరెడ్డి ఇంట్లో రెండు గంటలపాటు పోలీసులు జల్లెడ పట్టారు. రూ.20వేలు మాత్రమే ఉండటంతో చేసేదేమిలేక వెనుదిరిగారు. విజేత ఇంటి వద్దకి వెనువెంటనే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేరుకున్నారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ విధానాలతో ప్రజల్లోనే కాదు, వైసీపీ కార్యకర్తల్లోనే తిరుగుబాటు మొదలైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత మాట్లాడుతూ.. వెయ్యికి వెయ్యి శాతం టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.