YCP Govt.: నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న జగన్ ప్రభుత్వం అరాచకం...
ABN , Publish Date - Mar 05 , 2024 | 08:59 AM
ల్లూరు జిల్లా: జగన్ ప్రభుత్వం అరాచకాలు నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్నాయి. జిల్లాలో వైసీపీ మొత్తం ఖాళీ అవుతూ ఉండటంతో సర్కార్ టీడీపీ నేతలను టార్గెట్ చేసింది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్య అనుచరుడు హజరత్ నాయుడుపై అక్రమ కేసు బనాయించింది.
నెల్లూరు జిల్లా: జగన్ ప్రభుత్వం (Jagan Govt.) అరాచకాలు నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్నాయి. జిల్లాలో వైసీపీ (YCP) మొత్తం ఖాళీ అవుతూ ఉండటంతో సర్కార్ టీడీపీ నేతలను టార్గెట్ (TDP Leaders Target) చేసింది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Koatamreddy Sridhar Reddy) ముఖ్య అనుచరుడు హజరత్ నాయుడు (Hazrat Naidu)పై అక్రమ కేసు బనాయించింది. సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టాడనే నెపంతో హజరత్ నాయుడు ఇంటిని పోలీసులు (Police) చుట్టుముట్టి.. పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లేందుకు యత్నించారు. అదే ప్రాంతంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి సతీమణి, కుమార్తెల ఇంటింటి ప్రచారానికి ఆటంకం సృష్టించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి సంఘటన ప్రదేశానికి చేరుకుని అక్రమ కేసులకు సంబంధించి పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది కాలంగా ఎంపీ ఆదాల సొంత ఖాతాల్లో సైతం తమపై పోస్టింగులు పెడితే చర్యలు ఎందుకు తీసుకోలేదని పోలీసులపై మండిపడ్డారు. ఇంటింటి ప్రచారం ముగిశాక హజరత్ నాయుడు పీఎస్కు వస్తాడని.. ఏం చేసుకుంటారో చేసుకోండని ఎమ్మెల్యే కోటంరెడ్డి హెచ్చరించడంతో పోలీసులు వెనుదిరిగారు.