Home » Andhra Pradesh
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుల్లో ఒకరైన గుర్రం నాని.. భవన నిర్మిణ కార్మికులకు నగదు చెల్లింపులు చేయ్యకుండా ఎగకొడుతున్నారు. ఈ నేపథ్యంలో వారు రహదారిపై ఆందోళనకు దిగారు.
కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ హర్షించదగ్గ విషయమని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. ఈ కేసులో అసలు కుట్రదారు ఏపీ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ అని రఘురామ చెప్పారు.
ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ.. ఒంగోలు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఏపీ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ బుధవారం విచారణకు రానుంది.
ఆర్టీపీపీ నుంచి ఫ్లైయాస్ పౌడర్ తాడిపత్రికి తరలించే విషయంలో జేసీ బ్రదర్స్.. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. ఆ చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. అటు తాడిపత్రి నుంచి జేసీ వర్గీయులు మళ్లీ వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా పోలీసు బలగాలు మొహరించాయి.
గత వైసీపీ ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. వారి హయాంలో ఎర్రచందనం అక్రమ రవాణా జరిగిందని ఆరోపించారు. ఏపీకి చెందిన రూ.110 కోట్ల విలువైన ఎర్రచందనం కర్ణాటకలో దొరికితే, వాటిని ఆ రాష్ట్రం అమ్మేసిందని చెప్పారు.
సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ను మరి కాసేపట్లో ఒంగోలు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం గుంటూరు కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ పూర్తయిన తరువాత ఆయనను గుంటూరుకు తరలించనున్నారు.
భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తనకు ఎన్నో విలువైన సూచనలు సలహాలు ఇచ్చారని.. బిజీ షెడ్యూల్లో తనకు సాదర స్వాగతం పలికిన ఉప రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలుపుతున్నానని పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
అలిపిరి మెట్ల మార్గంలో బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ తన వెకిలి చేష్టలతో మరోసారి వార్తల్లో నిలిచింది. బాయ్ ఫ్రెండ్ శివకుమార్తో కలిసి తిరుమలకు ప్రియాంక విచ్చేసింది. ఆ క్రమంలో తిరుమల మెట్ల మార్గంలో చిరుత సంచరించే ఏడో మైలు రాయి వద్ద తన ప్రియుడితో కలిసి ప్రియాంక రీల్స్ చేసింది.
ఏపీ పోలీసుల నోటీసులకు తాను వణికిపోవడం లేదని, మంచం కింద కూర్చొని ఎడవటం లేదని రాంగోపాల్ వర్మ అన్నారు. తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల వల్ల ఎవరి మనోభావాలో దెబ్బతిన్నాయ్... తాను పోస్టు ఎవరి ఉద్దేశించి పెట్టానో.. వారికి కాకుండా ఇంకెవరో సంబంధం లేని థర్డ్ పార్టీ వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయనేది తనకు అర్ధం కావట్లేదని అన్నారు.
అసెంబ్లీకి వెళ్లకుండా వైసీపీ రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తోందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.