AP Police: విజయపాల్‌ను గుంటూరు కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు..
ABN , Publish Date - Nov 27 , 2024 | 09:54 AM
సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్‌ను మరి కాసేపట్లో ఒంగోలు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం గుంటూరు కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ పూర్తయిన తరువాత ఆయనను గుంటూరుకు తరలించనున్నారు.
ప్రకాశం జిల్లా: ప్రస్తుత ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు (Raghuramakrishnamraju)ను అక్రమంగా అరెస్టు (Arrest)చేసి.. థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్‌ను (CID Retired ASP Vijayapal) మంగళవారం రాత్రి ఒంగోలు ఎస్పీ దామోదర్ (SP Damodar) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మరి కాసేపట్లో ఒంగోలు జీజీహెచ్‌లో విజయపాల్‌కు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం గుంటూరు కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ పూర్తయిన తరువాత ఆయనను గుంటూరుకు తరలించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల తరువాత గుంటూరుకు తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా రఘురామ కేసులో మంగళవారం విజయపాల్ ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం రాత్రి 9 గంటలకు అరెస్టు చేసినట్లు ఎస్పీ దామోదర్ ప్రకటించారు. రాత్రి నుంచి ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌లో విజయపాల్ ఉన్నారు.
కాగా మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజును కస్టడీలో హింసించిన కేసులో రిటైర్డ్ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు ఆయనకు ముందస్తు బెయిలు నిరాకరించడం, విచారణకు ఏమాత్రం సహకరించకపోవడంతో మంగళవారం రాత్రి ఆయనను అరెస్టు చేశారు. దర్యాప్తు అధికారి, ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఈ విషయాన్ని ప్రకటించారు. విజయ్‌పాల్‌ను భారీ భద్రత మధ్య ఒంగోలు తాలుకా పోలీసు స్టేషన్‌కు తరలించారు. బుధవారం ఉదయం గుంటూరుకు తీసుకెళ్లనున్నారు. కస్టోడియల్ టార్చర్‌పై రఘురామ ఫిర్యాదు మేరకు గుంటూరు నగరంపాలెం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రభుత్వం ప్రకాశం జిల్లా ఎస్పీని విచారణాధికారిగా నియమించింది. ఈనెల 13వ తేదీన పోలీసులు విజయ్‌పాల్‌ను ఈ కేసులో ప్రశ్నించారు. ‘తెలియదు... గుర్తులేదు... మరిచిపోయా’ అనే సమాధానాలు ఇస్తూ ఆయన విచారణకు సహకరించకుండా మొండికేశారు.
మంగళవారం మరోమారు విజయ్‌పాల్‌ను ఒంగోలులోని ఎస్పీ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 దాకా ఈ ప్రక్రియ కొనసాగింది. విచారణ అధికారిగా ఉన్న ఎస్పీ ఏఆర్ దామోదర్ సాయంత్రం 6 గంటలకు స్వయంగా రంగంలోకి దిగారు. రఘురామకృష్ణరాజును అంతమొందించేందుకు కుట్ర పన్నారా? దీని వెనుక ఎవరు ఉన్నారు? కస్టడీలో ఆయనను ఎందుకు హింసించారు? మీరు కొట్టకుంటే ఆయన కాలికి గాయాలు ఎలా అయ్యాయి? ఎవరి ఆదేశాల మేరకు రఘురామను కొట్టారు? కేసు నమోదు చేసిన గంటల వ్యవధిలోనే ఆయనను అరెస్టు చేయడంలో ఆంతర్యం ఏమిటి? కనీసం నోటీసు కూడా ఎందుకు ఇవ్వలేదు? హైదరాబాద్‌లో అరెస్టు చేసిన తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరచకుండా ఎందుకు సీఐడీ కార్యాలయంలో నిర్బంధించారు? నిబంధనలు పాటించకపోవడానికి కారణమేమిటి? ఇలా అనేక కోణాల్లో విజయ్‌పాల్‌ను ప్రశ్నించారు. కానీ... ఆయన దేనికీ సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. పోలీసులు సేకరించిన ఆధారాలను ఆయన ముందుంచి ప్రశ్నించి... కొంత సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. రాత్రి 9 గంటల వరకు విచారణ జరిపిన తర్వాత... ఆయనను అరెస్టు చేస్తున్న ట్లు ప్రకటించారు. విచారణలో పోలీసులు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో ప్రధాన ద్వారం నుంచి విచారణ జరిపిన గెలాక్సీ భవన్ వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోకి ఇతరులెవ్వరూ రాకుండా చర్యలు తీసుకున్నారు.
కోర్టుల్లో చుక్కెదురు
అరెస్టు నుంచి తప్పించుకునేందుకు విజయ్‌పాల్ విశ్వప్రయత్నం చేశారు. హైకోర్టులో ఆయనకు చుక్కెదురు కావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించడం గమనార్హం. ముందస్తు బెయిల్ కోసం విజయ్‌పాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. దీంతో... ఆయన అరెస్టుకు మార్గం సుగమమైంది.
వీరిపైనే కేసు...
2021 మే నెలలో సీఐడీ అధికారులు కస్టడీకి తీసుకొని చిత్రహింసలకు గురిచేసి, హత్యాయత్నం చేశారని ఈ ఏడాది జూలైలో రఘురామ రాజు ఫిర్యాదు చేశారు. దీనిపై గుంటూరు నగరంపాలెం స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పటి సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు, సీఐడీ ఏఎస్పీ విజయ్‌పాల్, అప్పటి సీఎం జగన్, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ప్రభావ తి, మరి కొంతమందిని నిందితులుగా చేర్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆయన ఎన్నో విలువైన సూచనలు సలహాలు ఇచ్చారు..
డియో విడుదల చేసిన రాంగోపాల్ వర్మ..
జీడిమెట్లలో ఇంకా ఆదుపులోకి రాని మంటలు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News