Pawan Kalyan: అదానీ సోలార్ ప్రాజెక్టు అంశాన్ని సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారు..
ABN , Publish Date - Nov 27 , 2024 | 10:44 AM
గత వైసీపీ ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. వారి హయాంలో ఎర్రచందనం అక్రమ రవాణా జరిగిందని ఆరోపించారు. ఏపీకి చెందిన రూ.110 కోట్ల విలువైన ఎర్రచందనం కర్ణాటకలో దొరికితే, వాటిని ఆ రాష్ట్రం అమ్మేసిందని చెప్పారు.
ఢిల్లీ: అదానీ సోలార్ ప్రాజెక్టు అంశాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడిందని పవన్ ఆరోపించారు. మూడ్రోజుల ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ ఇవాళ (బుధవారం) ఉదయం ఉప రాష్ట్రపతి జగదీప్ దన్‌ఖడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ వేదికగా వైసీపీ అక్రమాలపై పవన్ ధ్వజమెత్తారు.
AP Police: విజయపాల్‌ను గుంటూరు కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు..
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. "గత వైసీపీ ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడింది. ముఖ్యంగా ఎర్రచందనం అక్రమ రవాణా జరిగింది. ఏపీకి చెందిన రూ.110 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు కర్ణాటకలో దొరికితే, వాటిని ఆ రాష్ట్రం అమ్మేసింది. అదే ఎర్రచందనం ఇతర దేశాల్లో దొరికితే తిరిగి తెప్పించుకోవచ్చు. నేపాల్ నుంచి అలాగే రప్పించాం. విదేశాల విషయంలో ట్రీటీ ఉన్నట్టు పొరుగు రాష్ట్రాల్లో లేదు. దేశ సరిహద్దు అవతల ఎర్రచందనం దొరికితే తెప్పించుకోవచ్చు కానీ, పక్క రాష్ట్రంలో దొరికితే స్వరాష్ట్రానికి చేరవేసే విధానం లేదు. దీనిపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌తో మాట్లాడాను. సొంత రాష్ట్రానికి అప్పగించేలా చర్యలు చేపట్టాలని కోరాను.
KTR: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వారిని మోసం చేసింది: కేటీఆర్..
గత ప్రభుత్వ హయాంలో ఒకటి కాదు చాలా అక్రమాలు జరిగాయి. అదానీ పవర్ విషయంలో లోతుగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయంలో అంతర్జాతీయ స్థాయిలో ఏం జరిగింది తెలుసుకోవాల్సి ఉంది. అదానీ సోలార్ ప్రాజెక్టు అంశాన్ని చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింస చాలా బాధాకరం. తీవ్ర ఆవేదన చెందుతున్నాం. బంగ్లాదేశ్ ఏర్పడిందే భారత సైన్యం త్యాగాలతో. భారత్‌లో మైనార్టీలను ఎలా చూస్తున్నాం, అక్కడ మైనార్టీ హిందువులను ఎలా చూస్తున్నారు?. పాలస్తీనాలో ఏదైనా జరిగితే స్పందించే ప్రముఖులు, బంగ్లాదేశ్‌లో జరిగే అంశాలపై ఎందుకు స్పందించరు" అంటూ ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: కాంగ్రెస్ సీనియర్ నేత కారుపై గుర్తుతెలియని దుండగులు దాడి..
Fire Accident: జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఇంకా ఆదుపులోకి రాని మంటలు..