Home » Andhra Pradesh » Visakhapatnam
సాగునీటి వనరుల నిర్వహణ, అభివృద్ధి విషయంలో గత వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న విషయం మండలంలోని గోకివాడ ఆనకట్టను ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని, అన్నదాతలను పలు విధాలుగా ఆదుకుంటున్నామని ఐదేళ్లపాటు కల్లబొల్లి కబుర్లు చెప్పారు. సుమారు 13 వేల ఎకరాలకు నీరు అందించేందుకు బ్రిటీష్ హయాంలో నిర్మించిన గోకివాడ ఆనకట్ట పూర్తిగా ఛిద్రమైంది. ఆధునికీకరణ పనులకు నిధులు మంజూరు చేయాలని ఇరిగేషన్ అధికారులు ఏటా ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపగా, గత ఐదేళ్ల కాలంలో ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు.
వాల్తేరు రైల్వే డివిజన్లో ఆదివారం కలకలం రేగింది. లంచం తీసుకుంటూ డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్ ముంబైలో సీబీఐ అధికారులకు చిక్కారనే వార్త డివిజన్లో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు నగర వాసుల్లోనూ సంచలనం కలిగింది.
వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటరుగా నమోదుకు తొలి విడతలో 17,404 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు.
విశాఖకు చెందిన స్టార్టప్ సంస్థ తారామండల్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని అనేక వ్యవహారాలపై ఉన్నతాధికారులు కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నగరంలో బైక్రేస్ల నియంత్రణలో భాగంగా త్రీటౌన్ పోలీసులు శనివారం రాత్రి బీచ్ రోడ్డులో స్పెషల్‌డ్రైవ్ నిర్వహించారు.
మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. ప్రస్తుతం పిక్నిక్ల సీజన్ జోరందుకోవడంతో వివిధ ప్రాంతాల నుంచి జనం మన్యం బాట పట్టారు.
మండలంలో చలి తీవ్రత పెరిగింది. శీతాకాలం ప్రారంభంకావడంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి.
మండలంలోని వనభంగి పంచాయతీ జడిగూడ గ్రామ పరిధిలో గల అటవీ శాఖ భూముల్లో 15 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి తోటలను పోలీసులు ఆదివారం ధ్వంసం చేశారు.
మండలంలోని గుమ్మ పంచాయతీ కర్రీగుడ గ్రామంలో అనారోగ్యానికి గురైన ఓ మహిళను కుటుంబ సభ్యులు ఆదివారం డోలీలో ఎనిమిది కిలో మీటర్లు మోసుకెళ్లారు.