Home » Crime
మీ ఖాతా నుంచి విదేశాలకు డబ్బులు వెళ్లాయని, మీపై మనీ లాండరింగ్ కేసులు నమోదయ్యాయని భయపెట్టిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) వృద్ధుడి వద్ద రూ. 8.30 లక్షలు కాజేశారు. రిటైర్డ్ ఉద్యోగి(85) సెల్‌ఫోన్‌కు సైబర్ నేరగాళ్లు 8284880588 నంబర్ నుంచి ఫోన్ చేశారు.
తమిళనాడులోని దిండుగల్(Dindugal) జిల్లా ఉడుమలై సమీపంలో జీపు, టెంపో ట్రావెలర్ ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందగా, మరో ఇద్దరు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పళనికి చెందిన ఓ కుటుంబం జీపులో కినత్తుకడవులోని బంధువు అంత్యక్రియల్లో పాల్గొని తిరుగు ప్రయాణమయ్యారు.
చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర పాత నేరస్థుడిని ఎల్బీనగర్ సీసీఎస్, రాచకొండ ఐటీ సెల్, చైతన్యపురి పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.9లక్షల విలువ చేసే సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
ఎన్నో శక్తులున్న రైస్ పుల్లింగ్ కలశం తమవద్ద ఉన్నదని, అమ్మితే భారీగా లాభాలు వస్తాయని ఓ వ్యక్తిని నమ్మించి, మోసం చేసిన ముగ్గురు సభ్యుల ముఠాను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్, మహంకాళి పోలీసులు అరెస్ట్ చేశారు.
చిట్టీ డబ్బు ఇవ్వడం లేదనే ఆగ్రహంతో ఓ ఆటోడ్రైవర్ మహిళను హత్య చేశాడు. ఎల్లారెడ్డిగూడ(Ellareddyguda) ప్రాంతంలో సెప్టెంబరు 30న జరిగిన ఆర్ఎంపీ భార్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
‘‘కే.సురేష్ జూనియర్ సివిల్ జడ్జి’’.. ట్రూ కాలర్‌లో ఈ పేరు కనిపించిందంటే చాలు.. కలెక్టర్లు, పోలీసు అధికారులు గజగజా వణికిపోవాల్సిందే. ‘‘మా టీం వస్తోంది.. పనులు చేసి పెట్టండి’’.. అని చెప్పడమే ఆలస్యం జిల్లా స్థాయి అధికారులు దగ్గరుండి పనులు చక్కబెట్టేవారు. సూటు.. బూటు.. ప్రోటోకాల్ కార్ సెటప్ చేసుకొని ఇతడు చేసిన నేరాలు తెలిస్తే నోరెళ్లబెడతారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, ఎలాంటి నేరాలకు పాల్పడ్డాడో తెలుసుకుందాం..
బ్లాక్ మ్యాజిక్(Black magic) పేరుతో మోసాలకు పాల్పడుతూ.. రూ. లక్షల్లో కొల్లగొడుతున్న నకిలీ బాబా ఆటకట్టించారు సౌత్‌ఈస్టు టాస్క్‌ఫోర్స్ జోన్ పోలీసులు. బహదూర్‌పురాకు చెందిన మాజీ రౌడీషీటర్ మహ్మద్ ఖలీమ్ అలియాస్ ఖలీ వాల్ పెయింటింగ్ వర్క్ చేసేవాడు.
శివారు ప్రాంతాల్లో తిష్టవేసి, ఖరీదైన ఇళ్లను రెక్కీ చేస్తూ అర్ధరాత్రి తర్వాత దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర థార్ గ్యాంగ్ ముఠా సభ్యుల ఆటకట్టించారు సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు(Cyberabad CCS Police). ఆరుగురు నిందితులను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.
ఆమె ఓ పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ తల్లి. పది రోజుల కిందట మిస్సింగ్ అయింది. సీరియస్‌గా తీసుకున్న జిల్లా పోలీసు యంత్రాంగం రెండు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు నేర చరితుడు కావడంతో పోలీసులకు చిక్క కుండా దృశ్యం సినిమా తరహాలో మొబైల్ ఫోన్, సిమ్ ఇంట్లోనే పడేసి పరారయ్యాడు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station) నుంచి బయలుదేరే వందేభారత్ రైల్లో(Vande Bharat train) బాంబు పెట్టానని ఓ అజ్ఞాతవ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్‌చేసి బెదిరించాడు. దీంతో పోలీస్ కంట్రోల్ రూమ్ పోలీసులు గోపాలపురం పోలీసులకు సమాచారం అందించారు.