Share News

Hyderabad: తండ్రి మందలించాడని.. ఇంటి నుంచి వెళ్లిపోయాడు

ABN , Publish Date - Dec 11 , 2024 | 07:16 AM

తండ్రి మందలించడంతో అలిగిన ఓ బాలుడు ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయాడు. ఖైరతాబాద్‌ ఎస్‌ఐ సందీప్‏రెడ్డి(Khairatabad SI Sandeep Reddy) తెలిపిన వివరాల ప్రకారం... ఖైరతాబాద్‌ లక్ష్మీనగర్‌ నివాసి అబ్రహం కుమారుడు అభిషేక్‌(14) స్థానిక నిశుల్క్‌ ప్రభాత్‌ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు.

Hyderabad: తండ్రి మందలించాడని.. ఇంటి నుంచి వెళ్లిపోయాడు

హైదరాబాద్: తండ్రి మందలించడంతో అలిగిన ఓ బాలుడు ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయాడు. ఖైరతాబాద్‌ ఎస్‌ఐ సందీప్‏రెడ్డి(Khairatabad SI Sandeep Reddy) తెలిపిన వివరాల ప్రకారం... ఖైరతాబాద్‌ లక్ష్మీనగర్‌ నివాసి అబ్రహం కుమారుడు అభిషేక్‌(14) స్థానిక నిశుల్క్‌ ప్రభాత్‌ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. సోమవారం అభిషేక్‌(Abhishek) స్కూల్‌కు వెళ్లకుండా స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా తండ్రి గమనించి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన బాలుడు రాత్రి 9 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: 1,100 సెల్‌ఫోన్లు.. విలువ రూ.3.30 కోట్లు


అంతటా వెతికినా, ప్రయోజనం లేకపోవడంతో తండ్రి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలుడు నల్లగా ఉంటాడని, తెలుగు, హిందీ మాట్లాడతాడని, ఇంటి నుంచి వెళ్లేటప్పుడు తెల్లటి దుస్తులు ధరించాడని, ఆచూకీ తెలిసిన వారు ఖైరతాబాద్‌ పోలీస్‏స్టేషన్‌(Khairatabad Police Station)లో లేదా.. ఫోన్‌ నెంబరు8712661534లో సంప్రదించాలని ఎస్‌ఐ సందీప్‏రెడ్డి కోరారు.


ఈవార్తను కూడా చదవండి: విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా?

ఈవార్తను కూడా చదవండి: తినే మాంసంలో.. యాంటీబయాటిక్స్‌

ఈవార్తను కూడా చదవండి: సింగరేణి సీఎండీ రేసులో శైలజా రామయ్యర్‌!

ఈవార్తను కూడా చదవండి: ఆన్‌లైన్‌లో భద్రాద్రి ముక్కోటి దర్శన టికెట్లు

Read Latest Telangana News and National News


Updated Date - Dec 11 , 2024 | 07:16 AM