Home » Crime
ఇటివల పలువురికి బెదిరింపు ఇమెయిల్స్(emails) వచ్చాయి. ఆ లేఖల ద్వారా హ్యాకర్లు పిల్లల అశ్లీలత, లైంగిక దోపిడీ గురించి ఆరోపణలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు సైబర్ దోస్త్.. సోషల్ మీడియా(social media)లో వైరల్ అయిన లెటర్ గురించి ప్రజలను హెచ్చరించింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
నగరంలో అతివేగం, అజాగ్రత్త, మద్యం మత్తులో ఇతరులను ఢీకొట్టి (హిట్ అండ్ రన్) వాహనాలు ఆపకుండా వెళ్లిపోతున్నారు. రక్తపు మడుగులో ఉన్నా కనీసం దయ చూపకుండా పారిపోతుండడంతో బాధితులు రోడ్లపైన గంటల తరబడి హాహాకారాలు చేస్తున్నారు.
పాత పేపర్లు, సామాన్లు, సెల్ఫోన్లు కొంటాం అంటూ.. బిహార్(Bihar) ముఠా సభ్యులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతున్నారు. పాతవి, పనిచేయని మొబైల్ ఫోన్లను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని సైబర్ నేరాలకు కేంద్రమైన జాంతారకు ఎగుమతి చేస్తున్నారు.
కుమార్తెను కాలేజీ నుంచి ఇంటికి తీసుకెళ్తుండగా మృత్యురూపంలో వచ్చిన డీసీఎం(DCM) వారి స్కూటర్ను ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే కూతురు మృతిచెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తండ్రి కన్నుమూశాడు.
మధ్యరాత్రి నిర్మానుష్య ప్రదేశంలో ఒంటరిగా వెళుతున్న ప్రజల నుంచి సెల్ఫోన్లను(Cell phones) కాజేస్తున్న ముగ్గురు వ్యక్తుల్ని గోపాలపురం పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
క్రెడిట్ కార్డు(Credit card) లేకున్నా బిల్లు కట్టాలని బెదిరించాడు. ఇంకో వ్యక్తితో వీడియో కాల్లో మాట్లాడించి బ్యాంక్స్కామ్లో మీ పాత్ర ఉన్నదని భయపెట్టి ఓ యువకుడి నుంచి రూ.5 లక్షలు దోచేశారు. నగరానికి చెందిన ఓ యువకుడి (28)కి ఈనెల 19న గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది.
నిషేధిత హాష్ ఆయిల్(Hash oil)ను విక్రయిస్తున్న వ్యక్తిని తెలంగాణా యాంటీ నార్కొటిక్స్ బ్యూరో, బాలానగర్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. అతడి నుంచి 10 లక్షల రూపాయాల విలువచేసే 1291గ్రాముల హాష్ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు.
పోలీస్గా చెప్పుకొని బెదిరిస్తూ దారిదోపిడీలకు పాల్పడుతున్న ఓ అంతరరాష్ట్ర దొంగను సిటీ టాస్క్ఫోర్స్ పోలీసులు(City Task Force Police) అరెస్ట్ చేశారు.
మాయమాటలతో బాలికను అపహరించి ఆపై అత్యాచారానికి పాల్పడిన యువకుడిని ఎల్బీనగర్ పోలీసులు(LB Nagar Police) అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్ పరిధిలో ఉండే ఓ ఆటో డ్రైవర్ కుమార్తె(13) ఈనెల 7వ తేదీన పోచారం వంకమామిడిలో ఉండే అమ్మమ్మ ఇంటికి వెళ్లింది.
తినేందుకు ఆహార పదార్థాలను కొనుగోలు చేసేందుకు హాస్టల్ నుంచి బయటకు వచ్చిన నిజాం హాస్టల్(Nizam Hostel)కు చెందిన ఓ విద్యార్థి కారు ఢీకొనడంతో మృతిచెందాడు. కేసు విచారణలో జాప్యం చేస్తున్నారంటూ విద్యార్థులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు.