Share News

Hyderabad: సైబర్‌ నేరగాళ్లు కాజేసిన డబ్బు రికవరీ

ABN , Publish Date - Nov 15 , 2024 | 10:41 AM

సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) కాజేసిన డబ్బును రికవరీ చేసిన సైబర్‌క్రైం పోలీసులు బాధితుడి ఖాతాలో జమ చేయించారు. బ్యాంకు అధికారులమంటూ నగరానికి చెందిన వ్యక్తికి ఫోన్‌చేసిన సైబర్‌ నేరగాళ్లు.. క్రెడిట్‌ కార్డు లిమిట్‌(Credit card limit) పెంచుతామని చెప్పారు.

Hyderabad: సైబర్‌ నేరగాళ్లు కాజేసిన డబ్బు రికవరీ

హైదరాబాద్‌ సిటీ: సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) కాజేసిన డబ్బును రికవరీ చేసిన సైబర్‌క్రైం పోలీసులు బాధితుడి ఖాతాలో జమ చేయించారు. బ్యాంకు అధికారులమంటూ నగరానికి చెందిన వ్యక్తికి ఫోన్‌చేసిన సైబర్‌ నేరగాళ్లు.. క్రెడిట్‌ కార్డు లిమిట్‌(Credit card limit) పెంచుతామని చెప్పారు. వారి సూచనల మేరకు వాట్స్‌పలో పంపిన లింక్‌ను ఓపెన్‌ చేసి వివరాలు నమోదు చేశాడు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: అధికారులపై దాడి వెనుక ఎవరున్నా ఉపేక్షించొద్దు


ఆ లింక్‌ ద్వారా మాల్‌వేర్‌ను మొబైల్‌లోకి జొప్పించిన సైబర్‌నేరగాళ్లు మొబైల్‌ను తమ నియంత్రణలో తెచ్చుకొని అతడి క్రెడిట్‌ కార్డు నుంచి రూ.1,18,196 కొనుగోళ్లు చేశారు. విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులను సంప్రదించాడు. దర్యాప్తు చేపట్టిన సైబర్‌ క్రైం పోలీసులు(Cybercrime police) మొబైల్‌లో ఉన్న మాల్‌వేర్‌ను తొలగించి, ఎన్‌సీఆర్‌పీలో వివరాలు నమోదు చేశారు. కాజేసిన డబ్బుతో ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోళ్లు జరిగినట్లు గుర్తించిన సైబర్‌ క్రైం పోలీసులు సదరు ఈ కామర్స్‌ సంస్థను సంప్రదించారు.


city7.2.jpg

మోసపూరితంగా కాజేసిన డుబ్బుతో కొనుగోళ్లు జరిగాయని వారికి వివరించి, నగదు బదిలీని నిలిపివేశారు. ఈ కామర్స్‌ సంస్థ ప్రతినిధుల సాయంతో సైబర్‌ నేరగాళ్లు కాజేసిన డబ్బును బాధితుడి ఖాతాలో జమ చేయించారు. వేగంగా స్పందించి సైబర్‌ నేరగాళ్ల బారినపడి డబ్బులు పోగొట్టుకున్న బాధితుడికి తిరిగి డబ్బు ఇప్పించడంలో కీకలంగా వ్యవహరించిన సిబ్బందిని సీపీ ఆనంద్‌ అభినందించారు.


ఈవార్తను కూడా చదవండి: కేసు పెట్టాల్సింది.. సీఎం బ్రదర్స్‌పైనే

ఈవార్తను కూడా చదవండి: మాజీ మంత్రి మల్లారెడ్డి మోసం చేశారు

ఈవార్తను కూడా చదవండి: 14 రకాల వివరాలివ్వండి..

ఈవార్తను కూడా చదవండి: ‘లగచర్ల’పై ఉన్నత స్థాయి విచారణ

Read Latest Telangana News and National News

Updated Date - Nov 15 , 2024 | 10:41 AM