Home » Crime
ఖరీదైన బైకు.. రోడ్లు ఖాళీగా ఉన్నాయి ఇంకేముంది.. వేగం పెంచారు కానీ, అదుపు చేయలేకపోయారు. అంతే ద్విచక్రవాహనం డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఇద్దరు టెకీలు మృతి చెందారు. కన్న వారికి కడుపుకోత మిగిల్చారు. ఈ ప్రమాదం మాదాపూర్ పోలీస్‌స్టేషన్(Madhapur Police Station) పరిధిలో జరిగింది.
హత్య చేసి.. డెడ్‌బాడీని గోనెసంచిలో కట్టి రోడ్డు పక్కన వేసిన కేసు మిస్టరీ వీడింది. కట్టుకున్న భార్యే హత్య చేసినట్లు తేలింది. తాగివచ్చి వేధిస్తున్నాడని సోదరి సాయంతో ఉరేసి చంపేసింది.
భార్య మాజీ ప్రియుడిపై భర్త కొడవలితో బహిరంగంగా దాడి చేసిన సంఘటన బెళగావి(Belagavi) జిల్లా మల్లమ్మన బెళవడి గ్రామంలో చోటు చేసుకుంది. ముక్తుమ్ అనే వ్యక్తిపై ముత్తు గణాచారి దాడికి పాల్పడ్డారు.
బెంగళూరు రాజరాజేశ్వరినగర్ బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న(Rajarajeshwari Nagar BJP MLA Munirathna)పై కోడిగుడ్లతో దాడి చేశారు. బుధవారం ఆర్ఆర్ నగర పరిధిలోని లక్ష్మిదేవి నగర్ వార్డు బీజేపీ కార్యాలయంలో వాజ్‌పేయి జయంతిలో పాల్గొనేందుకు వెళ్తున్న ఎమ్మెల్యేపై గుడ్లతో దాడి చేశారు.
దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటైన అన్నా విశ్వవిద్యాలయం(Anna University)లో ఇంజనీరింగ్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ నెల 21వ తేదీ రాత్రి జరిగిన ఈ దారుణం బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.
కూతురు బాగా చదివి ఉద్యోగం చేసి కుటుంబ కష్టాలను గట్టెక్కిస్తుందని భావించిన ఓ పేద కుటుంబానికి తీరని శోకం మిగిలింది. ప్రేమ పేరుతో యువకుడు పెట్టిన వేధింపులకు మనస్తాపం చెందిన చదువుల తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.
క్రికెట్ ఆడుతుండగా ఓ యువకుడు గుండెపోటుకు గురై మృతి చెందాడు. బుధవారం కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరు(Angaluru)లో ఈ విషాదం చోటుచేసుకుంది.
యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడిచేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకోవాలని, లేకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ సంఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్(Malakpet Police Station) పరిధిలో బుధవారం జరిగింది.
మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా, ఐదుగురు గాయపడ్డారు. బుధవారం యాదాద్రి- భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి(Bhuvanagiri)లో ఈ ఘటన చోటు చేసుకుంది.
అరుదైన జాతులకు చెందిన తాబేళ్లను అక్రమంగా రవాణా చేసి విక్రయిస్తున్న ఇద్దరిని మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు(Malkajgiri SOT Police) అరెస్ట్ చేశారు. మేడిపల్లి పీర్జాదిగూడకు చెందిన షేక్ జానీ(50) ఆదర్ష్నగర్లో ఫేమస్ ఆక్వేరియం పేరుతో చేపలు, పక్షుల విక్రయాలు చేస్తున్నాడు.