Share News

Hyderabad: అరుదైన తాబేళ్లను విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్‌..

ABN , Publish Date - Dec 26 , 2024 | 06:47 AM

అరుదైన జాతులకు చెందిన తాబేళ్లను అక్రమంగా రవాణా చేసి విక్రయిస్తున్న ఇద్దరిని మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు(Malkajgiri SOT Police) అరెస్ట్‌ చేశారు. మేడిపల్లి పీర్జాదిగూడకు చెందిన షేక్‌ జానీ(50) ఆదర్ష్‌నగర్‌లో ఫేమస్‌ ఆక్వేరియం పేరుతో చేపలు, పక్షుల విక్రయాలు చేస్తున్నాడు.

Hyderabad: అరుదైన తాబేళ్లను విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్‌..

- పరారీలో ప్రధాన నిందితుడు

హైదరాబాద్‌ సిటీ: అరుదైన జాతులకు చెందిన తాబేళ్లను అక్రమంగా రవాణా చేసి విక్రయిస్తున్న ఇద్దరిని మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు(Malkajgiri SOT Police) అరెస్ట్‌ చేశారు. మేడిపల్లి పీర్జాదిగూడకు చెందిన షేక్‌ జానీ(50) ఆదర్ష్‌నగర్‌లో ఫేమస్‌ ఆక్వేరియం పేరుతో చేపలు, పక్షుల విక్రయాలు చేస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు మల్కాజిగిరి ఎస్‌ఓటీ, ఉప్పల్‌ పోలీసులు కలిసి ఇతడి దుకాణంపై దాడి చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: చిన్న ప్రయత్నం... పెద్ద మార్పు


అతడి వద్ద నక్షత్ర తాబేళ్లతో పాటు రెడ్‌ ఇయర్డ్‌ స్లైడర్‌ తాబేళ్లను గుర్తించారు. తాబేళ్లను ఓల్డ్‌ మలక్‌పేటలోని న్యూషైన్‌ ఆక్వేరియం నిర్వహిస్తున్న ఎండీ సిరాజ్‌ అహ్మద్‌(MD Siraj Ahmed) వద్ద కొనుగోలు చేశానని పోలీసులకు చెప్పాడు. దాంతో ఎస్‌ఓటీ పోలీసులు మలక్‌పేట(Malakpet)లోని న్యూ షైన్‌ అక్వేరియంపై దాడి చేశారు. అక్కడ రహస్యంగా దాచిన తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు.


city1.2.jpg

ఏపీకి చెందిన విజయ్‌కుమార్‌ తాబేళ్లను తెచ్చి ఇక్కడ విక్రయిస్తాడని సిరాజ్‌ అహ్మద్‌ పోలీసులకు తెలిపాడు. వీరిద్దరి వద్ద నుంచి రూ.64 లక్షల విలువైన 281 నక్షత్ర తాబేళ్లు, 160 రెడ్‌ ఇయర్డ్‌ స్లైడర్‌ తాబేళ్లు, 4 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తాబేళ్ల అక్రమరవాణాలో కీలకంగా ఉన్న విజయ్‌కుమార్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: Investigation: కర్త, కర్మ, క్రియ.. కేటీఆరే!

ఈవార్తను కూడా చదవండి: Hyderabad: జానీ మాస్టర్‌ లైంగిక వేధింపులు నిజమే

ఈవార్తను కూడా చదవండి: ఆహా.. ఏం ఐడియాగురూ.. వాట్సాప్‌ డీపీ మార్చి.. మెసేజ్‌ పంపి..

ఈవార్తను కూడా చదవండి: Pneumonia: పిల్లలపై న్యుమోనియా పంజా

Read Latest Telangana News and National News

Updated Date - Dec 26 , 2024 | 06:47 AM