Home » Elections » Lok Sabha
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఈ రోజు (గురువారం నాడు) మూడు జిల్లాల్లో పర్యటిస్తారు. ఆసిఫాబాద్, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. హైదరాబాద్ నుంచి నేరుగా సీఎం రేవంత్ ఆసిఫాబాద్ చేరుకుంటారు.
మొన్న సిద్దిపేటలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) మాట్లాడిన మాటలను కాంగ్రెస్ నేతలు మార్పింగ్ చేశారని మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు (Raghunandan Rao) అన్నారు. గజ్వేల్ పట్టణంలో బుధవారం ఓ ఫంక్షన్ హల్లో బీజేపీ ఓబీసీ సామజిక సమ్మేళనం జరిగింది. ఈ సమావేశానికి రఘునందన్ రావు, బీజేపీ కీలక నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
రిజర్వేషన్లు తీసేయడం ఆర్ఎస్ఎస్ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ఆర్ఎస్ఎస్ విధానాలపై తాను స్పష్టంగా మాట్లాడానని అన్నారు.రిజర్వేషన్లు రద్దు చేయాలనేది ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతామని తెలిపారు. ఆర్ఎస్ఎస్ రాజకీయ కార్యాచరణ పేరే బీజేపీ అని చెప్పారు.
తెలంగాణలో కేసీఆర్ (KCR) ఆనవాళ్లు లేకుండా చేయటం రేవంత్ రెడ్డి జేజమ్మతో కూడా కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలంటే తెలంగాణనే లేకుండా చేయాలని అన్నారు. కార్మికులను, కర్షకులను చావ గొట్టిన్నందుకా? దేనికి మోదీ దేవుడని ప్రశ్నించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) ఢిల్లీ పోలీసులు (Delhi police) రెండు రోజుల క్రితం సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah) డీప్ ఫేక్ వీడియో (Deep fake Video) కేసులో భాగంగా సీఎం రేవంత్‌కు సమన్లు జారీ చేశారు. మే 1వ తేదీన హాజరుకావాల్సిందిగా ఢిల్లీ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.
భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా ఇంచార్జీ కృషాంక్‌ను పోలీసులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ చేయడంతో అదుపులోకి తీసుకున్నారు. కృషాంక్‌పై నిన్న పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తుండగా చౌటుప్పల్ మండలం పంతంగి చెక్ పోస్ట్ వద్ద అరెస్ట్ చేశారు.
లోక్‌సభ ఎన్నికలు-2024 (Lok Sabha Polls 2024) పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో అభ్యర్థులు ప్రచారాన్ని మరింత హోరెత్తించారు. మండుటెండలను లెక్క చేయకుండా ప్రచారపర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఖమ్మం లోక్‌సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి రామసాయం రఘురాంరెడ్డి ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లారు.
దేశసంపదను అదానీ, అంబానీలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) దోచిపెడుతున్నారని.. వారికి ఎందుకు ఓటు వేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ప్రశ్నించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట, పందిళ్లలో ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ , కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు , ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
బడేభాయ్.. చోటే భాయ్ కలిసి మోటార్లకు మీటర్లు పెడతారని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఆయన చేపట్టిన బస్సు యాత్ర 7వ రోజుకు చేరుకుంది. జిల్లాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో కాంగ్రెస్, బీజేపీలపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్(Congress) ఏనాడూ దేశం కోసం పనిచేయదని.. ఓటు బ్యాంకు కోసమే ప్రయత్నిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM MODI) అన్నారు. మంగళవారం మెదక్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అంటూ తెలుగులో మోడీ స్పీచ్ ప్రారంచించారు.