Share News

CM Revanth: వాజ్‌పేయ్ హయాంలోనే రిజర్వేషన్లు తీయడానికి ప్లాన్: సీఎం రేవంత్

ABN , Publish Date - May 01 , 2024 | 05:48 PM

రిజర్వేషన్లు తీసేయడం ఆర్ఎస్ఎస్ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ఆర్ఎస్ఎస్ విధానాలపై తాను స్పష్టంగా మాట్లాడానని అన్నారు.రిజర్వేషన్లు రద్దు చేయాలనేది ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతామని తెలిపారు. ఆర్ఎస్ఎస్ రాజకీయ కార్యాచరణ పేరే బీజేపీ అని చెప్పారు.

CM Revanth: వాజ్‌పేయ్ హయాంలోనే రిజర్వేషన్లు తీయడానికి ప్లాన్:  సీఎం రేవంత్
CM Revanth Reddy

హైదరాబాద్: రిజర్వేషన్లు తీసేయడం ఆర్ఎస్ఎస్ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఆర్ఎస్ఎస్ విధానాలపై తాను స్పష్టంగా మాట్లాడానని అన్నారు.రిజర్వేషన్లు రద్దు చేయాలనేది ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతామని తెలిపారు. ఆర్ఎస్ఎస్ రాజకీయ కార్యాచరణ పేరే బీజేపీ (BJP) అని చెప్పారు.ఎన్నికలకు ఇబ్బంది అవుతుందనే తాను మాట్లాడే విషయాలను బీజేపీ నేతలు పక్కదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. నిజాలు మాట్లాడుతున్నందుకే తనపై ఢిల్లీలో అక్రమ కేసులు పెట్టారని చెప్పుకొచ్చారు.


Konda Surekha: కొండా సురేఖ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల వాగ్వాదం

బుధవారం రేవంత్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ... రాజ్యాంగాన్ని మార్చే ప్రక్రియల్లో భాగంగానే దివంగత ప్రధానమంత్రి వాజ్‌పేయ్ హయాంలో కమిషన్ ఏర్పాటు చేస్తూ మొదటిసారి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారని చెప్పారు. 2002లో ఈ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందని తెలిపారు. దళితులకు హక్కులు లేని హిందూ సమాజం మేలని మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్ రాశారని వివరించారు. ఎన్జీ బైద్య అనే ఆర్ఎస్ఎస్ ఫిలాసఫర్ 2015లో కులపరమైన రిజర్వేషన్లు రద్దు చేయాలని రాశారని చెప్పారు. 1978లో మండల్ కమిషన్ ఏర్పాటు చేస్తే దానికి వ్యతిరేకంగా కమాండల యాత్ర నిర్వహించారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.


తాను మాట్లాడే విషయాలపై మోదీ, అమిత్ షాలకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసులు వస్తే మాట్లాడటం మానేస్తానని అనుకుంటున్నారేమోనని.. కానీ అంతకు రెండింతలు కచ్చితంగా మాట్లాడుతానని అన్నారు. రిజర్వేషన్లు కాపాడడం ముఖ్యమంత్రిగా తన బాధ్యతని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు.

TS High Court: కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు నోటీసులు

Read Latest Election News or Telugu News

Updated Date - May 01 , 2024 | 08:53 PM