Share News

PM MODI: డబుల్ ఆర్ ట్యాక్స్ వల్ల దేశం సిగ్గుపడుతోంది

ABN , Publish Date - Apr 30 , 2024 | 08:24 PM

కాంగ్రెస్(Congress) ఏనాడూ దేశం కోసం పనిచేయదని.. ఓటు బ్యాంకు కోసమే ప్రయత్నిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM MODI) అన్నారు. మంగళవారం మెదక్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌ పార్టీలపై మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అంటూ తెలుగులో మోడీ స్పీచ్ ప్రారంచించారు.

PM MODI: డబుల్ ఆర్ ట్యాక్స్ వల్ల దేశం సిగ్గుపడుతోంది
PM Narendra Modi

మెదక్: కాంగ్రెస్(Congress) ఏనాడూ దేశం కోసం పనిచేయదని.. ఓటు బ్యాంకు కోసమే ప్రయత్నిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM MODI) అన్నారు. మంగళవారం మెదక్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌ పార్టీలపై మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అంటూ తెలుగులో మోడీ స్పీచ్ ప్రారంచించారు.

బసమేశ్వర్, సంగమేశ్వర్, సేవాలాల్ మహరాజ్‌కు నా నమస్కారాలు తెలిపారు. గత పదేండ్లలో ఎన్డీఏ ప్రభుత్వం దేశాన్ని ఎంత అభివృద్ధి చేసిందో మీరంతా చూశారని చెప్పారు. ఒకప్పుడు ప్రపంచం మొత్తం అభివృద్ధిలో దూసుకుపోతుంటే.. కాంగ్రెస్ కరప్షన్‌తో అవినీతి ఊబిలోకి నెట్టేసి దేశాన్ని మొత్తం ముంచేసిందన్నారు. కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక అవినీతి ఊబి నుంచి దేశాన్ని అతి కష్టంగా బయటకు తీసుకొచ్చిందని వివరించారు. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అవినీతి చేస్తోందని మోదీ విరుచుకుపడ్డారు.


Loksabha polls 2024: కరెంట్ పోయిందంటూ అబద్దాలు చెబుతున్నారు.. కేసీఆర్‌పై తుమ్మల ఆగ్రహం

డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు

అబద్ధపు వాగ్ధానాలు, ఓటుబ్యాంకు రాజకీయం, మాఫియా, అపరాధులను పెంచి పోషించడం, కుటుంబ పాలన, కరప్షన్‌ను నమ్ముకుందని చెప్పారు. ఈ ఐదు సూత్రాలే చేతిగుర్తు వని.. వీటితోనే కాంగ్రెస్ పాలించిందని ఆరోపించారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ దేశానికి ట్రిపుల్ ఆర్ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని ఇచ్చిందని గుర్తుచేశారు. ట్రిపుల్ ఆర్ మూవీతో టాలీవుడ్ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందిందని తెలిపారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తోందని ఆరోపించారు.

డబుల్ ఆర్ ట్యాక్స్ పై తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. డబుల్ ఆర్ ట్యాక్స్ వల్ల దేశం సిగ్గుపడుతోందన్నారు. పారిశ్రామిక వేత్తలు, వ్యాపారస్తుల నుంచి ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.అందులో వాటా నల్లధనం రూపకంగా ఢిల్లీకి పోతోందని విమర్శించారు. మీకు ఆ డబుల్ ఆర్ ఎవరో అందరికీ తెలుసునని అన్నారు. ట్యాక్స్ వసూళ్లతో ఐదేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేస్తారని మండిపడ్డారు.

ఎంతగా అంటే తెలంగాణ ప్రజలు తిరిగి కోలుకోనంతగా దోచేస్తారని ఆరోపించారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ మొత్తం దోచుకుందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్క గూటి పక్షులే.. అవి వేర్వేరు కావని చెప్పారు. కాంగ్రెస్ దోచుకునేందుకు కొత్త విధానాన్ని తీసుకొస్తోందన్నారు.ఇన్ హరిటెన్స్(వారసత్వ సంపద) ట్యాక్స్ తీసుకురావాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ఇది అమలుచేస్తే మీరు జీవితాంతం కష్టపడి దాచుకున్న సొమ్మును మీ మరణం తర్వాత మీ వారసులకు ఇవ్వలేరని చెప్పారు. అలాంటి విధానాన్ని కాంగ్రెస్ తీసుకురానుందన్నారు.

55 శాతం వసూలు చేయాలని చూస్తోందన్నారు. దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొన్నటి వరకు తెలంగాణను బీఆర్ఎస్ దోచుకుందని... ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటోందని విమర్శించారు.కాంగ్రెస్ విపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఎన్నో విమర్శలు చేసిందని అన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక ఈ కేసుకు సంబంధించిన ఫైళ్లను ఎందుకు తొక్కి పెట్టిందని ప్రశ్నించారు.

ఈ రెండు పార్టీలు ఒకరినొకరు కాపాడుకోవాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు వేర్వేరు కాదు.. ఒక్కటేనని చెప్పారు..కరప్షన్ రాకెట్ కమిటీకి చెందిన పార్టీలని ఎద్దేవా చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ద్వారా ఇది అర్థమవుతోందన్నారు. బీఆర్ఎస్.. ఆప్‌తో కలిసి లిక్కర్ స్కామ్ చేసిందని విమర్శించారు. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసిన పార్టీతో కాంగ్రెస్ అలయెన్స్ పెట్టుకుందన్నారు.కరప్షన్ చేసిన అందరూ ఒకరినొకరు సమర్థించుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.


రైతులకు కాంగ్రెస్ వెన్నుపోటు..

‘‘కాంగ్రెస్.. రైతులకు వెన్నుపోటు పొడవడానికి కూడా వెనుకాడటంలేదు. వంద రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు చేయలేదు. క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామన్నారు.ఇప్పుడు ఇవ్వకుండా, కనీసం దానిపై మాట్లాడకుండా నోటికి తాళం వేసుకున్నారు. కాంగ్రెస్ పేదలను.. మరింత పేదలుగా మార్చాలని చూస్తోంది. ఇక్కడి ప్రజల ఉత్సాహం చూస్తుంటే డబుల్ ఆర్‌లో ఒకరికి నిద్రలేకుండా పోతుంది. కాంగ్రెస్.. పేదలు, వెనుకబడిన వారు, దళితులు, ఆదివాసీలు, మహిళలను ఎన్నటికీ ఎదగనివ్వదు.కాంగ్రెస్ హయాంలో మహిళలకు అధికారం దక్కలేదు, కనీసం మహిళలకు రక్షణ కూడా కల్పించలేదు. వారిని కేవలం ఓటు బ్యాంకుగానే చూశారు. అయోధ్య రామమందిరం 500 ఏండ్ల కల. అయోధ్య రామమందిరాన్ని నిర్మించామా? లేదా?. ఇది మోదీ కట్టించలేదు.. మీ ఒక్క ఓటు కట్టించేలా చేసింది’’ అని మోదీ తెలిపారు.


Loksabha polls 2024: కేసీఆర్.. స్థాయిని మరిచి అబద్దాలు మాట్లాడుతున్నారన్న భట్టి

ఓటు బ్యాంకు రాజకీయాలు

’‘కనీసం హైదరాబాద్‌లో పండుగ నిర్వహించుకోవాలంటే కూడా చివరకు శ్రీరామ నవమికి కూడా ఆంక్షలు పెట్టింది. ఒక వర్గం ఓట్ల కోసం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి 2009లో కాంగ్రెస్‌కు రికార్డు స్థాయిలో ఎమ్మెల్యేలు, ఎంపీలను గెలిపించారు.కానీ కాంగ్రెస్ ఏం చేసింది. గెలిచాక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను కాలరాసింది. ఏపీని ఒక ప్రయోగశాలగా మార్చి ఓబీసీల రిజర్వేషన్లను ముస్లింలకు కట్టబెట్టింది.ముస్లింల మెప్పు కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. లింగాయత్, మరాఠీలు, 26 ఇతర బీసీ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని అడుగుతున్నారు. కానీ కాంగ్రెస్ అంగీకరించలేదు.. అదే ముస్లింలను మాత్రం రాత్రికి రాత్రే బీసీ జాబితాలోకి చేర్చింది.బంజారాలు సమాజంలో ఎంతో గౌరవ జీవితాన్ని గడిపేవారు.. కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేరస్తులగా చూశాయి, వారిని వంచించాయి. రాజ్యాంగం, రిజర్వేషన్లపై మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోంది. కానీ ఎస్సీ వర్గీకరణకు నేను కట్టుబడి ఉన్నాను.. మీకోసం నేను పోరాడుతా. కాంగ్రెస్ మొదటి నుంచి రాజ్యాంగాన్ని, అంబేద్కర్‌ను గౌరవించలేదు’’ అని మోదీ అన్నారు.


రాజ్యాంగానికి తూట్లు పొడిచింది

‘‘రాజ్యాంగంలో ప్రతి పేజీలో రామాయణం, మహాభారతం, జీవిత సంస్కృతికి సంబంధించిన లింకును తుడిచిపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేసింది. ఈ దేశ మొదటి ప్రధాని రాజ్యాంగాన్ని అవహేళన చేసి పెద్ద తప్పు చేశాడు.. ఆయన తర్వాత ఇప్పుడున్న యువరాజు నానమ్మ రాజ్యాంగాన్ని తన రాజకీయ అవసరాల కోసం రాజ్యాంగానికి తూట్లు పొడిచింది. ఎమర్జెన్సీ విధించింది. రాహుల్ తండ్రి ప్రధానిగా ఉన్నప్పుడు మీడియా, పత్రిక స్వేచ్ఛను హరించారు. ఎన్నో పాపాలు చేసిన కాంగ్రెస్.. రాజ్యాంగం గురించి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తోంది. మన్మోహన్ సింగ్ కేబినెట్ ఒక నిర్ణయం తీసుకున్నారు.. చట్టరూపకంగా బిల్లును తీసుకువస్తే.. దాన్ని రాహుల్ చింపివేశారు. మతపర రిజర్వేషన్లు వద్దని రాజ్యాంగంలో ఉంటే.. రాహుల్ గాంధీ ఓటుబ్యాంకు రాజకీయాల కోసం మతపరమైన రిజర్వేషన్లను ప్రోత్సహిస్తోంది. కాంగ్రెస్ నేతలారా.. చెవులు తెరిచి వినండి. రాజ్యాంగం రచించి 60 ఏళ్ల సందర్భంగా ఏనుగుపై రాజ్యాంగాన్ని ఊరేగించాను. రాజ్యాంగంపై మాకు ఉన్న నమ్మకాన్ని మీరు శంకించాల్సిన అవసరం లేదు.. దీనికోసం నేను నా జీవితాన్ని త్యాగం చేశాను’’ అని మోదీ తెలిపారు.


సీతారాం కేసరిని అలా చేశారు..

‘‘2019లో రెండోసారి ప్రధాని అయ్యాక నా బాధ్యతలు స్వీకరించే సమయంలో రాజ్యాంగాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో పెట్టి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాను. రాజవంశీయులు అధికార దాహంతో రాజ్యాంగాన్ని అవమానించారు. చివరకు కాంగ్రెస్ పార్టీ రచించుకున్న రాజ్యాంగాన్ని కూడా అవమానించారు.. ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సీతారాం కేసరిని బాత్రూంలో బంధించి సోనియాగాంధీని అధ్యక్షురాలిగా చేసుకున్నారు.ఇది కాంగ్రెస్ చరిత్ర. అధికారం కోసం దేనికైనా కాంగ్రెస్ దిగజారుతోంది. ఈవీఎంలు, ఎన్నికల కమిషన్‌ను కూడా నమ్మడం లేదు. మోదీ బతికి ఉన్నంత వరకు రాజ్యాంగాన్ని కదిలించే వ్యక్తి, శక్తి ఎవరూ ఉండరు’’ అని కాంగ్రెస్‌ నేతలకు మోదీ సవాల్ విసిరారు.

‘‘రాజ్యాంగాన్నికాపాడే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మోదీ మూడోసారి అధికారంలో వస్తే రాజ్యాంగం రచించి 75 ఏళ్లయిన సందర్భంగా వాడవాడలా ఉత్సవం నిర్వహిస్తాం. కాంగ్రెస్ చేసిన తప్పులను, మోసాలు, అవినీతిని బయటపెడుతాం.. దోషిగా నిలబెడుతాం. ప్రజాస్వామ్మాన్ని కాంగ్రెస్ నాయకులు అవమానిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతామని భావించి ఫేక్ వీడియో సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్నారు. ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు.దీని వెనుక డబుల్ ఆర్ వ్యక్తుల పేర్లు ఉన్నాయని తెలుస్తోంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఒక ముఖ్యమంత్రి ఇలా చేయొచ్చా? ఇండి కూటమికి ఈసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి లేదు. ఆ పార్టీకి అతి తక్కువ సీట్లు రాబోతున్నాయి. మీరు రఘునందన్ రావు, బీబీ పాటిల్‌కు ఓటు వేస్తే మోదీకి పడినట్లే’’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు.

Madhukar Reddy: కాంగ్రెస్‌ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు..

Read Latest Election News And Telugu News

Updated Date - Apr 30 , 2024 | 08:54 PM