Loksabha Polls: బీఆర్ఎస్ నేత కృషాంక్ అరెస్ట్.. ఎందుకంటే..?
ABN , Publish Date - May 01 , 2024 | 02:18 PM
భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా ఇంచార్జీ కృషాంక్‌ను పోలీసులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ చేయడంతో అదుపులోకి తీసుకున్నారు. కృషాంక్‌పై నిన్న పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తుండగా చౌటుప్పల్ మండలం పంతంగి చెక్ పోస్ట్ వద్ద అరెస్ట్ చేశారు.
యాదాద్రి: భారత రాష్ట్ర సమితి (BRS) సోషల్ మీడియా ఇంచార్జీ కృషాంక్‌ను పోలీసులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ చేయడంతో అదుపులోకి తీసుకున్నారు. కృషాంక్‌పై నిన్న పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తుండగా చౌటుప్పల్ మండలం పంతంగి చెక్ పోస్ట్ వద్ద అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో కృషాంక్ యాక్టివ్‌గా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నారు. కృషాంక్‌పై కేసు నమోదు కాగా.. పోలీసులు అరెస్ట్ చేశారు. 2018కి ముందు కృషాంక్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
Read Latest Telangana News And Telugu News