Home » Elections » Lok Sabha
మైక్యవాదుల కంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అత్యంత ప్రమాదకరమని బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ (Errolla Srinivas) ఆరోపించారు. సమైక్యవాదుల ముసుగులో రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ అమరవీరులను అవమానించేలా రేవంత్ మాట్లాడారని మండిపడ్డారు.
కాంగ్రెస్ (Congress) బ్రిటిష్ వారసత్వాన్ని ఇంకా కొనసాగిస్తోందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) సంచలన ఆరోపణలు చేశారు. బ్రిటిష్ ప్రతినిధిగా ఇటలీకి చెందిన సోనియాగాంధీని దేశంపై రుద్దే ప్రయత్నం చేశారని విరుచుకుపడ్డారు. ఆమె ప్రధాని కాకుండా బీజేపీ అడ్డుకుందని గుర్తుచేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) శవ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సంచలన ఆరోపణలు చేశారు. విభజన హామీలను బీజేపీ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటును మోదీ అవహేళన చేశారని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం అన్నింటి మీద జీఎస్టీ వసూలు చేస్తుందన్నారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ సంస్కృతి గురించి తెలియదని మండిపడ్డారు.
లోక్‌సభ ఎన్నికలు-2024 నామినేషన్ల పరిశీలనలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ (BRS) పార్టీకి భారీ షాక్ తగిలింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ భారీ ఓటమిని చవిచూసిన విషయం తెలసిందే. ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడంతో కీలక నేతలంతా వరుసగా రాజీనామాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ కీలక నేతలు బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ (Congress party)లో చేరుతున్నారు. ఇదే కోవలో కొత్తగూడెం బీఆర్ఎస్ సీనియర్ నేత కోనేరు చిన్ని ( Koneru Chini) కూడా గులాబీ పార్టీని వీడేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నయవంచనకు మారు పేరు అని మండిపడ్డారు. మెజార్టీ ప్రజల హక్కులను ఆ పార్టీ కాలరాసిందని ఆరోపించారు. రూ.2 లక్షల రుణమాఫీ ఇంకెప్పుడు చేస్తారని అడిగారు.
ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ (Congress) అభ్యర్థిగా రామసహాయం రఘురామిరెడ్డి (Raghuram Reddy) గురువారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. ఖమ్మం కలెక్టరేట్‌లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీవీ గౌతమ్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు.
ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జాతీయ కుల గణణ చేపడతామని, ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులు తెలుసుకుంటామని కాంగ్రెస్ మాజీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన ``సామాజిక న్యాయ్ సమ్మేళన్``లో రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు.
తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డి పేరుని ప్రకటించింది.
తెలంగాణ గడ్డపై రుణమాఫీ అంశంపై అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య డైలాగ్ వార్ తీవ్రస్థాయికి చేరింది. ఆగస్టు 16వతేదీ లోపు రుణమాఫీ చేయకుంటే సీఎం పదవికి రాజీనామా చేయాలని, రుణ మాఫీ అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీశ్ రావు ఛాలెంజ్ చేశారు.