Home » Elections » Lok Sabha
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గంగా సప్తమి పర్వదినాన.. ప్రధాని మోదీ వారాణసీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి నామినేషన్ వేశారు. అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ సహా పలువురు ఎన్డీయే కూటమి నేతలు తదితర అతిరథమహారథులు వెంటరాగా..
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో బీఆర్‌ఎస్ విలీనం ఖాయమని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ అన్నారు. పంద్రాగస్టులోగా
లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం.. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే భారీగా తగ్గింది. సోమవారం పూర్తయిన లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ 65.67 శాతంగా
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచిన ప్రజానీకానికి ధన్యవాదాలు తెలుపుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజానీకానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. సోనియమ్మ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంపై విశ్వాసంతో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి లోక్ సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. వరసగా మూడోసారి ఇక్కడి నుంచి మోదీ బరిలోకి దిగారు. 2019, 2014లో కూడా వారణాసి నుంచి మోదీ పోటీ చేసి గెలుపొందిన సంగతి తెలిసిందే.
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ దక్షిణాదిన భారీ విజయం సాధిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చోట్ల పోలింగ్ ముగిసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ ముగిసిందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో గల అరకు, రంపచోడవరం పాడేరు నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటు వేసేందుకు వయోజనులు ఉదయమే పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని ఎన్నికల సంఘం ప్రజలకు పిలుపునిచ్చింది. ఓటు హక్కు విధిగా ఉపయోగించుకోవాలని సెలబ్రిటీలు కోరారు.
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొడంగల్‌లో కుటుంబసమేతంగా సీఎం రేవంత్ ఓటేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 33.5 శాతం ఓట్లు వచ్చాయని.. ఈ ఎన్నికల్లో అంతకు మించివస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు తమ వందరోజుల పాలనకు రెఫరెండమని తెలిపారు. బీజేపీ కూడా ఈ ఎన్నికలు మోదీ పాలనకు రెఫరెండం అని చెబుతోందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించడం తప్ప పోలింగ్ కూల్‌గా సాగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రలో సతీ సమేతంగా ఓటు వేశారు.