Share News

Loksabha Polls: పోలింగ్ కేంద్రం వద్ద సెల్ఫీ పాయింట్.. ఓటేసేందుకు జనాల ఇంట్రెస్ట్

ABN , Publish Date - May 13 , 2024 | 03:06 PM

తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటు వేసేందుకు వయోజనులు ఉదయమే పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని ఎన్నికల సంఘం ప్రజలకు పిలుపునిచ్చింది. ఓటు హక్కు విధిగా ఉపయోగించుకోవాలని సెలబ్రిటీలు కోరారు.

Loksabha Polls: పోలింగ్ కేంద్రం వద్ద సెల్ఫీ పాయింట్.. ఓటేసేందుకు జనాల ఇంట్రెస్ట్
selfi

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ (Polling) ప్రశాంతంగా జరుగుతోంది. ఓటు వేసేందుకు వయోజనులు ఉదయమే పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని ఎన్నికల సంఘం (Election Commission) ప్రజలకు పిలుపునిచ్చింది. ఓటు హక్కు విధిగా ఉపయోగించుకోవాలని సెలబ్రిటీలు కోరారు. ఈ సారి పోలింగ్ కేంద్రాల వద్ద సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. జనాలు సెల్ఫీ అంటే ఇంట్రెస్ట్ చూపించడంతో వారి అభీష్టం మేరకు సెల్ఫీ పాయింట్ నెలకొల్పారు. దీంతో కొందరు ఓటు అంటే ఇంట్రెస్ట్ చూపని వారు కూడా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేస్తున్నారు. ఓటు వేసిన తర్వాత సెల్ఫీ దిగుతున్నారు. ఆ పిక్స్ వాట్సాప్ స్టేటస్, వాట్సాప్ గ్రూపులు, ఫేస్ బుక్, ఎక్స్‌లో షేర్ చేస్తున్నారు. మేము ఓటేశాం.. మరి మీరు అని ఫ్రెండ్స్‌ను అడుగుతున్నారు. ఓటు హక్కు గురించి సోషల్ మీడియా వేదికగా అవగాహన కల్పిస్తున్నారు.


సెల్ఫీ పాయింట్ మీద ఇలా..?

ఆ సెల్ఫీ పాయింట్ (Selfie Point) మీద ఇలా రాసి ఉంది. ‘మెరుగైన భవిష్యత్ కోసం ఓటు వేయండి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు నీ ఆయుధం. ఈ రోజు నేను నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. మరి మీరు అని’ రాసి ఉంది. సెల్ఫీ పాయింట్ అని కింద ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం, నియోజకవర్గం పేరు కూడా ఉంది. ఓటు హక్కు బాధ్యతను ఎన్నికల సంఘం సెల్ఫీ పాయింట్ ద్వారా తెలియజేసింది.


పెరగనున్న ఓటింగ్ శాతం

సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేయడం వల్ల జనాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. గతంలో కన్నా ఓటింగ్ శాతం పెరుగుతోంది. ఈ విషయం పోలింగ్ శాతం చూస్తే అర్థమవుతోంది. సాయంత్రం వరకు అది మరింత పెరిగే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు అంచనా వేశారు. తెలంగాణలో ఈ రోజు వాతావరణం కూడా చల్లగా ఉండటం ఓటింగ్ శాతం పెరిగేందుకు కలిసి వస్తోంది.


ఇవి కూడా చదవండి:

LoKSabha Elections: పోలింగ్‌ బహిష్కరించిన పలు గ్రామాల ప్రజలు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest Telangana News and Telugu News

Updated Date - May 13 , 2024 | 03:07 PM