Home » Elections
సోషల్ మీడియాలో ప్రముఖుల మీమ్స్ సందడి చేస్తుంటాయి. కొందరు క్రియేటర్స్ మీమ్స్ చేసి పోస్ట్ చేస్తుంటారు. మీమ్స్ చూసి కొందరు లైట్ తీసుకుంటారు. మరికొందరు సీరియస్‌గా తీసుకొని, కేసులు పెడతారు.
మంత్రి జోగి రమేశ్ తనయుడు రాజీవ్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు నమోదు చేయడం జరిగింది. పెదపులిపాకలో దళితులపై వైసీపీ నేతలు దాడి చేశారు. దళితవాడలో మంత్రి జోగి కుమారుడు రాజీవ్, వైసీపీ కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. కాలనీకి చెందిన సుదర్శన్, మరికొందరు మాట్లా డుకుంటుండగా.. వైసీపీ కార్యకర్తలు తమ గురించే మాట్లాడుకుంటున్నట్టు అనుమానపడి వారిపై రాజేష్ దాడి చేశాడు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలు కావడంతో భారతీయ పౌరసత్వం ఉన్న వ్యక్తి దేశంలో ఏ లోక్‌సభ స్థానంలో అయినా పోటీ చేయవచ్చు. మరోవైపు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లి స్థిరపడిన వ్యక్తులు అక్కడి రాజకీయాల్లో రాణిస్తున్నవారెందరో ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతోమంది ఇతర రాష్ట్రాల్లో రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తులు ఉన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోనే ఎక్కువ లోక్‌సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్‌లోని జాన్పూర్ పార్లమెంట్ నియోజకవర్గం అందరిదృష్టిని ఆకర్షించింది.
దేశవ్యాప్తంగా మూడో విడత పోలింగ్ ప్రారంభమైంది. అహ్మదాబాద్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు ప్రాధాన్యం ఉందన్నారు. అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
వరంగల్ బీఆర్ఎస్లో పార్టీ ఫండ్ రగడ రాజుకుంటోంది. పార్లమెంట్ ఎన్నికల ఖర్చుకోసం అధిష్టానం ఇచ్చిన పార్టీ ఫండ్‌ను మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు కలిసి పంచుకున్నారు. పర్సెంటేజీలుగా పంచుకున్నట్టు సమాచారం. బూత్ కమిటీలు, మండలస్థాయి కేడర్‌కు ఫండ్ అందక పోవడంతో నిరాశలో ఉన్నారు. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలపై సొంతపార్టీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
ఓట్ల పండుగ జరుగుతోంది. ప్రజాస్వామ్య దేశంలో అతిపెద్ద పండుగ ఎన్నికలు.. ఏడు దశల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఎంతోమందికి ఎన్నో అనుమానాలు వస్తుంటాయి. ఓటర్లకు సహజంగా వచ్చే అనుమానాలు కొన్ని అయితే.. ఈవీఎంలపై రాజకీయ పార్టీల ఆరోపణలతో మరిన్ని అనుమానాలు వస్తుంటాయి. ప్రస్తుతం ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరుగుతున్నాయి. అసలు ఈవీఎం ఎలా పనిచేస్తుంది. మనం వేసిన ఓటు వేసిన పార్టీకే పడుతుందా.. వేరు పార్టీకి పడుతుందా..
రిటైర్డ్ ఏఆర్ ఎస్సై దుర్గాప్రసాద్ వర్మ ఇంట్లో 9.9 లక్షల రూపాయల నగదును పెందుర్తి నియోజకవర్గం ఎన్నికల విభాగం ఫ్లైయింగ్ సర్వేలైన్ టీం(ఎఫ్ఎన్టీ) స్వాధీనం చేసుకుంది. జీవీఎంసీ 95 వ వార్డు లక్ష్మీపురంలో నివాసం ఉంటున్న ఏఆర్ మాజీ ఎస్ఐ దంతులూరి దుర్గా ప్రశాంత్ వర్మ ఇంట్లో పెద్ద ఎత్తున నగదు ఉన్నట్లు నగర టాస్క్ ఫోర్సు పోలీసులకు సమాచారం అందింది.
కుప్పంలో ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు కుప్పంలో భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు తరపున ఎన్నికల ప్రచారాన్ని భువనేశ్వరి నిర్వహించనున్నారు. రేపు శాంతిపురం మండలంలో ర్యాలీ, ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎల్లుండి కుప్పం, రామకుప్పం మండలాల్లో మహిళలు, వివిధ సామాజికవర్గాలతో ప్రత్యేక కార్యక్రమాల్లో భువనేశ్వరి పాల్గొననున్నారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడు విడతలకు గానూ మూడో విడత పోలింగ్ ఇవాళ ప్రారంభమైంది. 12 రాష్ట్రాల్లోని 93 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. బీజేపీ, కాంగ్రెస్‌లను భయం వెంటాడుతోంది. మూడో దశలో ఎన్నికలు జరగనున్న స్థానాల్లో 2014, 2019లో ఎన్డీయే కూటమి మెజార్టీ సీట్లు సాధించింది. బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలంటే ఈ విడతలో ఎక్కవ స్థానాలు గెలవాల్సి ఉంటుంది.
మూడో విడత లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. 3 వ ఫేజ్‌లో 12 రాష్ట్రాలు, యూటీలలోని 93 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అస్సాం (4), బీహార్ (5),ఛత్తీస్ ఘడ్(7),దాద్రా నగర్ హవేలీ ,డామన్ & డయ్యు,(2) గోవా (2) గుజరాత్(26), కర్ణాటక(14) మహారాష్ట్ర(11),ఉత్తరప్రదేశ్ (10),వెస్ట్ బెంగాల్ (4),మధ్యప్రదేశ్ (8) రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి.