Loksabha Polls: ప్లీజ్ ఓటేయండి.. ఓటర్లకు మోదీ పిలుపు
ABN , Publish Date - May 07 , 2024 | 09:30 AM
దేశవ్యాప్తంగా మూడో విడత పోలింగ్ ప్రారంభమైంది. అహ్మదాబాద్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు ప్రాధాన్యం ఉందన్నారు. అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
అహ్మదాబాద్: దేశవ్యాప్తంగా మూడో విడత పోలింగ్ ప్రారంభమైంది. అహ్మదాబాద్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు ప్రాధాన్యం ఉందన్నారు. అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. దేశంలో ఉష్ణోగ్రతలు పెరుగుతోన్న వేళ ప్రజలు ఎక్కువగా నీళ్లు తీసుకోవాలని సూచించారు. నీరు ఎక్కువగా తాగితే ఆరోగ్యంగా ఉంటారని వివరించారు. ప్రధాని మోదీ వెంట కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఉన్నారు. అమిత్ షా గాంధీనగర్ లోక్ సభ స్థానం నుంచి మరోసారి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.
10 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో గల 93 నియోజకవర్గాల్లో మూడో విడత పోలింగ్ జరుగుతోంది. ఇందులో 72 జనరల్ సీట్లు కాగా 10 ఎస్సీలు, 11 ఎస్టీలకు కేటాయించారు. మూడో విడతలో అమిత్ షా, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఎన్సీపీ (శరద్ పవార్) నేత సుప్రియ సులే బరిలో ఉన్నారు. ఎస్పీ నుంచి డింపుల్ యాదవ్ కూడా పోటీలో ఉన్నారు.
Read Latest National News and Telugu News