Lok Sabha Polls 2024: మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. పోటీలో కీలక నేతలు
ABN , Publish Date - May 07 , 2024 | 07:09 AM
మూడో విడత లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. 3 వ ఫేజ్‌లో 12 రాష్ట్రాలు, యూటీలలోని 93 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అస్సాం (4), బీహార్ (5),ఛత్తీస్ ఘడ్(7),దాద్రా నగర్ హవేలీ ,డామన్ & డయ్యు,(2) గోవా (2) గుజరాత్(26), కర్ణాటక(14) మహారాష్ట్ర(11),ఉత్తరప్రదేశ్ (10),వెస్ట్ బెంగాల్ (4),మధ్యప్రదేశ్ (8) రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి.
ఢిల్లీ: మూడో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 3 వ ఫేజ్‌లో 12 రాష్ట్రాలు, యూటీలలోని 93 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అస్సాం (4), బీహార్ (5), ఛత్తీస్‌ఘడ్ (7), దాద్రా నగర్ హవేలీ, డామన్ & డయ్యు, (2) గోవా (2) గుజరాత్(26), కర్ణాటక(14) మహారాష్ట్ర(11),ఉత్తరప్రదేశ్ (10),వెస్ట్ బెంగాల్ (4),మధ్యప్రదేశ్ (8) రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. మూడో విడత లోక్ సభ ఎన్నికల్లో పలువురు కీలక నేతలు పోటీలో ఉన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా, ఎన్సీపీ సుప్రియ సులే, ఎస్పీ నేత డింపుల్ యాదవ్ పోటీలో ఉన్నారు. పోలింగ్‌కు ఎన్నికల కమిషన్ భారీ ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లను ఈసీ చేసింది.
ఇవి కూడా చదవండి..
PM MODI : మాఫియా రాజ్.. కరప్షన్ కింగ్
దేశంలో అమృత ఘడియలు.. రాష్ట్రంలో విష ఘడియలు
Read Latest National News and Telugu News