Home » Elections
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులెవరైనా పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవచ్చు. కానీ ఏపీలో అవన్నీ కుదరవు. దేశంలో ఎన్నికల విధుల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవచ్చు కానీ ఏపీ నుంచి ఎన్నికల బందోబస్తుకు మహారాష్ట్రకు వెళ్ళిన స్పెషల్ పోలీస్‌లకు మాత్రం నో పోస్టల్ బ్యాలెట్. అరిచి గీ పెట్టినా ఓటు హక్కు కల్పించారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. రెండు విడతలు పూర్తయ్యాయి. మూడో విడతలో భాగంగా పది రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 పార్లమెంట్ స్థానాలకు మంగళవారం (మే7న) పోలింగ్ జరగనుంది. ఈ లోక్‌సభ స్థానాల్లో ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగిసింది.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ రౌడీల దాష్టీకం వెలుగు చూసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసే వారికి వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి అనుచరులు డబ్బు ఎర చూపిస్తున్నారు. డబ్బులు ఎందుకు ఇస్తున్నారంటూ ఓ యువకుడు ప్రశ్నించగా.. అతనిపై వెల్లంపల్లి అనుచరులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ఓ దళిత ఉద్యోగిపై దాడి చేసి కొటారు. పాయకాపురం 63వ డివిజన్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
తెలంగాణలో బీజేపీ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. బీజేపీ అగ్ర నేతలంతా రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. నేడు మూడు బహిరంగ సభల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేరుకోనున్నారు. ఉదయం 10 గంటలకు పెద్దపల్లి, ఒంటి గంటకు భువనగిరి, మధ్యాహ్నం 3 గంటలకు నల్లగొండ బీజేపీ అభ్యర్థి మద్దతుగా నడ్డా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామీ, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మతో పాటు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు..
అప్పుడేమో.. ప్రత్యర్థి పార్టీల్లో పలుకుబడి ఉన్నవారైతే పిలిచి మరీ కండువాలు! వీధివీధినా ఆత్మీయ సమ్మేళనాలు! దావత్‌లతో రాత్రింబవళ్లు మందు పార్టీలు! ఖర్చుకు లెక్కే లేదు! గడపగడపకూ నాయకులు! ఓటరన్నకు వంగివంగి దండాలు..!
సరిహద్దున ఉన్న నియోజకవర్గం. రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో విస్తరించి ఉన్న పార్లమెంటు స్థానం. మెజారిటీ సంఖ్యలో బీసీ ఓటర్లు. ఇప్పటివరకు జరిగిన మూడు ఎన్నికల్లోనూ బీసీ నేతకే ఎంపీగా పట్టం.
తెలంగాణలో రాహుల్ - రేవంత్ టాక్స్ వసూలు చేస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పెద్దలకు తెలంగాణ ఏటీఎంగా మారిందని విమర్శించారు. మజ్లిస్ అధినేత అక్బరుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్, బీఆర్స్ పార్టీలు ముస్లిం ఓట్ల కోసం పని చేస్తున్నాయన్నారు. తన పేరిట ఫేక్ వీడియో చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీ పోలీసులు వెంట పడుతున్నారని గోల చేస్తున్నారని చెప్పారు.
తెలంగాణలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కావట్లేదని పదే పదే బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్ హామీలు రాష్ట్రంలో ఎక్కడ అమలవుతున్నాయో నిరూపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి(CM Revanth Reddy) మరోసారి సవాల్ విసిరారు. ఈ సవాల్‌కు రేవంత్ ప్రతి సవాల్ విసిరారు.
కాంగ్రెస్ (Congress) పార్టీ, ఇండియా కూటమి రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తుంటే.. బీజేపీ మాత్రం రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తోందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. మన దేశ ప్రజలు ఎలాంటి లబ్ధి పొందినా.. అది కేవలం రాజ్యాంగం వల్లే అని చెప్పారు. దేశంలో యాభై శాతం మంది అణగారిన వర్గాల వారు ఉన్నారని.. వారికి రాజ్యాంగం అండగా ఉందని తెలిపారు. కానీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రాజ్యాంగం అనే పుస్తకాన్ని మార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు.
నాయకుల వాహనాలంటేనే హడావుడి.. పదుల సంఖ్యలో కార్లు రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్తుంటాయి.