Share News

Lok Sabha Elections 2024: తెలంగాణలో రాహుల్ - రేవంత్ టాక్స్ వసూలు చేస్తున్నారు: అమిత్ షా

ABN , Publish Date - May 05 , 2024 | 09:29 PM

తెలంగాణలో రాహుల్ - రేవంత్ టాక్స్ వసూలు చేస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పెద్దలకు తెలంగాణ ఏటీఎంగా మారిందని విమర్శించారు. మజ్లిస్ అధినేత అక్బరుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్, బీఆర్‌స్ పార్టీలు ముస్లిం ఓట్ల కోసం పని చేస్తున్నాయన్నారు. తన పేరిట ఫేక్ వీడియో చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీ పోలీసులు వెంట పడుతున్నారని గోల చేస్తున్నారని చెప్పారు.

Lok Sabha Elections 2024: తెలంగాణలో రాహుల్ - రేవంత్ టాక్స్ వసూలు చేస్తున్నారు: అమిత్ షా
Amit Shah

నిజామాబాద్: తెలంగాణలో రాహుల్ - రేవంత్ టాక్స్ వసూలు చేస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పెద్దలకు తెలంగాణ ఏటీఎంగా మారిందని విమర్శించారు. మజ్లిస్ అధినేత అక్బరుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్, బీఆర్‌స్ పార్టీలు ముస్లిం ఓట్ల కోసం పని చేస్తున్నాయన్నారు. తన పేరిట ఫేక్ వీడియో చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీ పోలీసులు వెంట పడుతున్నారని గోల చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు.


KTR: యాచన వద్దు.. శాసిద్దాం

లెకో‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపూరి అర్వింద్‌కు ఓటేస్తే మోదీకి వేసినట్లేనని చెప్పుకొచ్చారు. నిజామాబాద్‌లో ‘‘విశాల జనసభ’’ వేదికగా ఆదివారం అమిత్ షా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌ పార్టీలపై అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీని మూడోసారి ప్రధాని చేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదం, నక్సలిజం అంతం చేయాలని.. ప్రస్తుతం ఛత్తీస్‌గడ్‌లో మాత్రమే నక్సలిజం ఉందని వివరించారు. మోదీ మరోసారి ప్రధాని అయితే ఇక్కడ కూడా అంతం అవుతుందని చెప్పారు.


కాంగ్రెస్ నేతలను అయోధ్య రాంమందిరం ప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వానిస్తే ఎవరూ రాలేదని మండిపడ్డారు. ట్రిపుల్ తలాక్ తొలగిస్తే కాంగ్రెస్ నేతలు ఎందుకు గగ్గోలు పెట్టారని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్వింద్ తన హమీ నెరవేర్చడానికి ప్రధాని మోదీ వెంటపడ్డారని.. ఈ ప్రాంతానికి పసుపు బోర్డు సాధించారని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇక్కడ బీడీ కార్మికుల కోసం ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పీఎఫ్ఐ లాంటి సంస్థలు ఇక్కడ ఉండలేవని.. ఒవైసీ.. జాగ్రత్తగా ఉండాలని అమిత్ షా వార్నింగ్ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి

Harish Rao: మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఇలాగేనా మాట్లాడేది

Hyderabad: అసదుద్దీన్‌ ప్రచారం తీరు మారిందా? గత ఎన్నికలకు భిన్నంగా ప్రచార శైలి

Read Latest Election News or Telugu News

Updated Date - May 05 , 2024 | 09:32 PM