Share News

Lok Sabha Elections 2024: రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర.. రాహుల్ గాంధీ ఫైర్

ABN , Publish Date - May 05 , 2024 | 06:42 PM

కాంగ్రెస్ (Congress) పార్టీ, ఇండియా కూటమి రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తుంటే.. బీజేపీ మాత్రం రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తోందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. మన దేశ ప్రజలు ఎలాంటి లబ్ధి పొందినా.. అది కేవలం రాజ్యాంగం వల్లే అని చెప్పారు. దేశంలో యాభై శాతం మంది అణగారిన వర్గాల వారు ఉన్నారని.. వారికి రాజ్యాంగం అండగా ఉందని తెలిపారు. కానీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రాజ్యాంగం అనే పుస్తకాన్ని మార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు.

Lok Sabha Elections 2024: రాజ్యాంగాన్ని మార్చేందుకు  బీజేపీ కుట్ర.. రాహుల్ గాంధీ ఫైర్
Rahul Gandhi

జోగులాంబ గద్వాల జిల్లా: కాంగ్రెస్ (Congress) పార్టీ, ఇండియా కూటమి రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తుంటే.. బీజేపీ మాత్రం రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తోందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. మన దేశ ప్రజలు ఎలాంటి లబ్ధి పొందినా.. అది కేవలం రాజ్యాంగం వల్లే అని చెప్పారు. దేశంలో యాభై శాతం మంది అణగారిన వర్గాల వారు ఉన్నారని.. వారికి రాజ్యాంగం అండగా ఉందని తెలిపారు. కానీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రాజ్యాంగం అనే పుస్తకాన్ని మార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు. అంబేద్కర్, గాంధీ లాంటి వారి ఆలోచనలకు అనుగుణంగా ఉన్న రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని విమర్శించారు.


KTR: యాచన వద్దు.. శాసిద్దాం

రెండు, మూడు కుటుంబాల రక్షణ కోసం మాత్రమే బీజేపీ పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. రాజ్యాంగ రక్షణ కోసం కాంగ్రెస్ పని చేస్తుందని ఉద్ఘాటించారు. దేశంలోని పోర్టులు, ఎయిర్ పోర్ట్‌లు ఇలా అన్నీ అదానీకి మోదీ కట్టబెట్టారని ఫైర్ అయ్యారు. ఎర్రవల్లిలో కాంగ్రెస్ జన జాతర సభ జరుగుతోంది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి, మంత్రి భట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ , ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఈ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు.


Harish Rao: మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఇలాగేనా మాట్లాడేది

తెలంగాణ ప్రభుత్వం 20 వేల ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పారు. ఆరు గ్యారెంటీలను రాష్ట్రంలో తాము పక్కాగా అమలు చేస్తున్నామని ఉద్ఘాటించారు. దేశంలో అణగారిన వర్గాల వారికి కులగణన చేస్తున్నామన్నారు. దీని వల్ల వారికి లబ్ధి చేకూరుతుందని చెప్పుకొచ్చారు. ఇదే పథకాన్ని దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా అమలు చేస్తామని ప్రకటించారు. దేశంలో నిరుద్యోగం, ధరల పెంపు పెద్ద సమస్య.. కానీ మీడియా ఈ సమస్యను ఎందుకు చూపించదని ప్రశ్నించారు. ఎందుకంటే మీడియా మొత్తం అణగారిన వర్గాల వారిది కాదన్నారు.


‘‘దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ కూలీ రూ.400కు పెంచుతాం. దేశంలోని పేదలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తాం. మహిళల పింఛన్లను రెట్టింపు చేస్తాం. మహిళల అభ్యున్నతికి చారిత్రాత్మక పథకాన్ని అమల్లోకి తీసుకొస్తాం. ఈ పథకం ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రతి పేద కుటుంబం నుంచి ఓ మహిళను ఈ పథకానికి ఎంపిక చేసి.. ఆమెకు సంవత్సరానికి లక్ష రూపాయలు ఇచ్చేలా చూస్తాం. మోదీ రెండు కుటుంబాలను మాత్రమే కోట్లాధిపతులను చేస్తే.. మేము ప్రతీ పేద కుటుంబాన్ని లక్షాధికారులను చేస్తాం. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. పేద కుటుంబాల యువత.. చదువు పూర్తి అయ్యాక అప్రెన్టీషిప్ చేయడానికి సాయం చేస్తాం. మా ప్రభుత్వంలో కోట్లాది మంది యువకులకు ఈ అవకాశం కల్పిస్తాం. ఇందువల్ల దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల్లో భారీగా ఉద్యోగాలు వస్తాయి. మొదటి సంవత్సరం లక్ష రూపాయలు ఇస్తాం. ఇలా స్కిల్ ఉన్న యువత దేశానికి లభిస్తుంది. దేశంలోని రైతులకు.. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ, కనీస మద్దతు ధర ఇస్తాం. దేశంలో మోదీ ప్రభుత్వం ద్వేషం పెంచింది. నేను కన్యాకుమారి దాక పాదయాత్ర చేసి పేదలను అక్కున చేర్చుకున్నాను. ఈ ఎన్నికల్లో పేదల, రైతుల ప్రభుత్వాన్ని ఎంచుకోండి. మోదీ ధనికుల ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. నాగర్‌ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించాలి’’ అని రాహుల్‌గాంధీ కోరారు.

Hyderabad: అసదుద్దీన్‌ ప్రచారం తీరు మారిందా? గత ఎన్నికలకు భిన్నంగా ప్రచార శైలి

Read Latest Election News or Telugu News

Updated Date - May 05 , 2024 | 07:25 PM