Home » Elections
ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు రానున్నారు. పోలింగ్‌కు మరో వారం మాత్రమే సమయం ఉండడంతో ప్రచారంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇప్పటికే తెలంగాణను చుట్టేశారు. మరో రౌండ్ ప్రచారానికి మోదీ, అమిత్ షా, నడ్డా, కేంద్రమంత్రులు రానున్నారు.
ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దూసుకెళ్తున్నారు. రోజు కనీసం రెండు, మూడు చోట్ల సభల్లో పాల్గొంటున్నారు. ఆయా చోట్ల స్థానిక సమస్యలను ఎత్తి చూపుతున్నారు. అందుకోసం కొత్త ఎత్తుగడ వేశారు. జనాలను తమవైపు ఆకర్షించే ప్రయత్నం చేశారు.
లోక్‌సభ ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. ఈ క్రమంలోనే పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు, రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు సంబంధించిన పోలీసులు సంయుక్తంగా వాహన తనఖీలు చేస్తుండగా పెద్ద ఎత్తున బంగారం, వెండి పట్టుబడింది.
రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టుకుంది. 80 ఏళ్లు దాటిన వయో వృద్ధులు, నడవలేని దివ్యాంగులతోపాటు పోస్టల్ బ్యాలెట్లు స్వీకరించడాన్ని శుక్రవారం ప్రారంభించారు.
హైదరాబాద్ మజ్లిస్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ గురువారం రాత్రి మూసారాంబాగ్ బస్తీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయం పక్క నుంచి వెళ్లారు.
పార్లమెంటు ఎన్నికలు వచ్చినప్పుడు హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పేరు చెప్పగానే.. ‘ఆ.. అక్కడ మజ్లిసే గెలుస్తుంది’ అనే మాట సర్వసాధారణంగా వినిపించేది! సలావుద్దీన్ ఒవైసీ, బద్ధం బాల్‌రెడ్డి, ఆలె నరేంద్ర కాలంలో పోటాపోటీ నెలకొన్నా..
అపరిమిత అధికారాలతో కేసీఆర్ చాలా పిచ్చిపనులు చేశారని చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా.. దేశంలో
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీలో భాగమైన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయడం, ఐటీఐఆర్ ప్రాజెక్టు పునఃప్రారంభం, ఐదు ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు.
లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి 200 ఎంపీ సీట్ల కంటే మించి రావని బీఆర్ఎస్ అధినేతచ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) అన్నారు. శుక్రవారం రామగుండంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన రోడ్ షోలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నదీ జిల్లాల్లో అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎందుకు పట్టించు కోవడం లేదని ప్రశ్నించారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ (BJP)కి 400 ఎంపీ సీట్లు వస్తే.. దేశానికి ప్రమాదమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) హెచ్చరించారు. పెద్దపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.